షుగర్ ఉంటే అలా చేయకండి..

షుగర్ వ్యాధి కనుక వస్తే ముందుగా ప్రతి ఒక్క ఆహారాన్ని చాలా కంట్రోల్​గా తినాలని సూచిస్తున్నారు.  ఏమవుతుందిలే అని ఇష్టరీతిన వ్యవహించిన వారు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. నేటి ప్రపంచంలో చాలా మంది షుగర్ (డయాబెటిస్) ​తో బాధపడుతున్నారు. కొంత మంది ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ షుగర్ వస్తుంది. అసలు మేము ఏం తినకపోయినా కానీ షుగర్ వచ్చిందే అని బాధపడే వారు చాలా ఎక్కువగానే ఉంటారు. షుగర్ వస్తే అన్నీ కంట్రోల్​గా […]

Share:

షుగర్ వ్యాధి కనుక వస్తే ముందుగా ప్రతి ఒక్క ఆహారాన్ని చాలా కంట్రోల్​గా తినాలని సూచిస్తున్నారు.  ఏమవుతుందిలే అని ఇష్టరీతిన వ్యవహించిన వారు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.

నేటి ప్రపంచంలో చాలా మంది షుగర్ (డయాబెటిస్) ​తో బాధపడుతున్నారు. కొంత మంది ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ షుగర్ వస్తుంది. అసలు మేము ఏం తినకపోయినా కానీ షుగర్ వచ్చిందే అని బాధపడే వారు చాలా ఎక్కువగానే ఉంటారు. షుగర్ వస్తే అన్నీ కంట్రోల్​గా తినాలని వైద్యులు సిఫారసు చేస్తారు. అంతే కాకుండా షుగర్​తో బాధపడేవారు వ్యాయామాలు కూడా చేయాలని చెబుతారు. కానీ కొంత మంది ఇవన్నీ పెడచెవిన పెడుతూ వారికి తోచిన విధంగా సొంత వైద్యం చేసుకుంటూ ఉంటారు. ఇలా సొంత వైద్యం చేసుకోవడం అనేది చాలా ముప్పును తీసుకొస్తుంది. సొంత వైద్యం చేసుకోవడం మానేయాలని ఎంత మంది ఎన్ని విధాలుగా చెప్పినా కానీ కొంత మంది వినరు. వారికి షుగర్ అటాక్ అయినా కానీ ఇష్టారీతిన ఏది పడితే అది తినడం అలాగే ఏది పడితే అది తాగడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మొదటికే మోసం వస్తుంది. ఇలా చేస్తూ ఎన్ని మందులు వాడినా కానీ పెద్దగా ప్రయోజనం ఉండదని అనేక మంది వైద్యులు చెబుతున్నారు. షుగర్ వ్యాధి కనుక వస్తే ముందుగా ప్రతి ఒక్క ఆహారాన్ని చాలా కంట్రోల్​గా తినాలని సూచిస్తున్నారు. హా.. ఏమవుతుందిలే అని ఇష్టారీతిన వ్యవహించిన వారు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. 

అలా అస్సలు చేయకండి..

షుగర్​తో బాధపడే వారు కొంత మంది మద్యం తాగుతూ ఉంటారు. ఇలా షుగర్​ ఉన్న వారు మద్యం అస్సలుకే తాగకూడదని వైద్యులు చెబుతారు. అయినా కానీ కొంత మంది హా… ఏమవుతుందిలే అని వైద్యుల మాటను లైట్ తీసుకుంటూ మద్యం తాగుతారు. కానీ ఇలా మద్యం తాగడం వలన చాలా సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. మామూలుగానే మధుమేహంతో బాధపడే వారికి నాడులు దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, ఇక మద్యం తాగితే అంతే అని పలువురు వైద్యులు హెచ్చరిస్తున్నారు. మద్యం తాగడం వలన నాడులు త్వరగా దెబ్బతినే ప్రమాదం ఉందని, ఇలా జరిగినపుడు కాళ్లు మొద్దుబారడం, పుండ్లు పడడం జరుతుందని తెలుపుతున్నారు. ఆ పుండ్లు మానకపోతే వేళ్లు, పాదాలు, కాళ్లు తొలగించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

అగ్నికి ఆజ్యం పోసినట్లే

షుగర్​తో ఉన్న వారు మందు అస్సలుకే ముట్టుకోకూడదు. మధుమేహానికి మద్యం తోడైతే అగ్నికి ఆజ్యం పోసినట్లే. మద్యం ప్రభావం వల్ల నాడులు త్వరగా దెబ్బతినే ప్రమాదం ఉంది. షుగర్ వచ్చినపుడు మద్యం తాగాల్సి వస్తే, విధిగా భోజనం చేయాలని వైద్యులు తెలుపుతున్నారు. షుగర్ వచ్చినపుడు రక్తంలోని గ్లూకోజ్​లో చెక్కెర స్థాయిలు పెరిగిపోతాయనే విషయం అందరికీ తెలిసిందే. మన కాలేయం నిరంతరం గ్లూకోజ్​ను ఉత్పత్తి చేస్తూ.. మన శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్​లో ఉండేలా చూస్తుంది. కానీ, ఆల్కహాల్ తాగడం వల్ల ఈ ప్రక్రియ దెబ్బతింటుంది. దీంతో శరీరంలో గ్లూకోజ్ మోతాదులు పడిపోతాయి. ఇది ఒక్కోసారి మరణానికి కూడా దారితీస్తుంది. అందుకోసమే షుగర్​తో బాధపడుతున్నవారు మద్యం జోలికి వెళ్లకూడదని వైద్యులు చెబుతున్నారు. 

విస్కీ, జిన్, టేకిలా, రమ్ మరియు వోడ్కా వంటి స్వచ్ఛమైన ఆల్కహాల్‌లు పూర్తిగా చక్కెర రహితంగా ఉంటాయి, అయితే వైన్‌లు మరియు సపోరో లేదా బుద్వార్ వంటి తేలికపాటి బీర్‌లలో తక్కువ కార్బ్ కంటెంట్ ఉంటుంది.