శాకాహారులు కోసం కాల్షియం అధికంగా ఉండే 5 ఆహారపదార్థాలు

కాల్షియం అనేది అన్ని జీవులకూ ఎంతో అవసరమైన ఒక ముఖ్యమైన పోషకం. కాల్షియం మన శరీరంలోని ఎముకలను, దంతాలను బలోపేతం చేయడమే కాకుండా, కండరాల బలాన్ని, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. హృదయ స్పందన రేటును నియంత్రించడంలో కూడా ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాల్షియం లోపం ఉన్నవారిలో ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి, హైపోగ్లైసీమియా, కండరాల తిమ్మిరి, గోర్లు బలహీనంగా మారటం, పీరియడ్స్ సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి, నడుము నొప్పి, తలనొప్పి, డిప్రెషన్, గుండె వేగంగా […]

Share:

కాల్షియం అనేది అన్ని జీవులకూ ఎంతో అవసరమైన ఒక ముఖ్యమైన పోషకం. కాల్షియం మన శరీరంలోని ఎముకలను, దంతాలను బలోపేతం చేయడమే కాకుండా, కండరాల బలాన్ని, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. హృదయ స్పందన రేటును నియంత్రించడంలో కూడా ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాల్షియం లోపం ఉన్నవారిలో ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి, హైపోగ్లైసీమియా, కండరాల తిమ్మిరి, గోర్లు బలహీనంగా మారటం, పీరియడ్స్ సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి, నడుము నొప్పి, తలనొప్పి, డిప్రెషన్, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి.

ఒక వ్యక్తికి రోజుకు ఎంత కాల్షియం అవసరం

మన శరీరానికి రోజూ ఎంత కాల్షియం అవసరమో తెలుసుకోవాలి. పురుషులైతే… కనీసం 1000 నుంచి 1200 మిల్లీగ్రాములు, మహిళలు, వృద్ధులైతే… 1200 నుంచి 1500 మిల్లీగ్రాములు, పిల్లలైతే… కనీసం 1300, గరిష్టంగా 2500 మిల్లీగ్రాముల క్యాల్షియం తీసుకోవాలి.

పాలు లేదా పాల ఉత్పత్తులలో  కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కానీ కొంతమందికి పాల అలెర్జీ ఉంటుంది. అంటే పాలు తాగటం వల్ల అనారోగ్యం వస్తుంది. ఇదేవిధంగా శాకాహారం తీసుకొనే వాళ్ళు అంటే ‘వేగన్’ లు పాలు తాగడానికి ఇష్టపడరు. ఎందుకంటే అది జంతువుల నుండి లభించే ఆహారం. మరి.. వేగన్ లు లాక్టోస్ పడని వాళ్ళు కాల్షియం కోసం దేనిమీద ఆధారపడాలి?

ఈ 5 శాకాహార పదార్థాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది

మీరు పాలు తాగకూడదని అనుకుంటే, మీ డైట్‌లో ఈ ఆహార పదార్థాలను చేర్చండి. దీనివల్ల మీకు రోజూ అవసరమయ్యే  కాల్షియం లభిస్తుంది

1. గింజలు

పాలు కాకుండా మనకి పుష్కలంగా కాల్షియం దొరికే ఆహార పదార్థాలేమిటా అని ఆలోచిస్తున్నారా? గింజలు. గింజలలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటితో కూడా బాదం పప్పులో అత్యధిక కాల్షియం ఉంటుంది. ఒక కప్పు బాదం పప్పులో దాదాపు 385 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుందని ఎన్నో మెడికల్ జర్నల్స్ లో పేర్కొన్నారు. బాదంలో పీచుపదార్థాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. బాదం పప్పులో మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ ఇ కూడా ఎక్కువగా ఉంటాయి.

2. ఆకు కూరలు

కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలలో ముఖ్యమైనవి ఆకుకూరలు. బచ్చలికూర, పాలకూర, తోటకూర, కేల్, కొల్లార్డ్ గ్రీన్స్ మొదలైన ఆకు కూరలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కొల్లార్డ్ గ్రీన్స్ తీసుకోవడం వల్ల మనం తీసుకొనే కాల్షియం 21 శాతం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాల్షియం మాత్రమే కాదు.. ఇందులో ఐరన్, ఫోలేట్ కూడా ఎక్కువగా ఉంటాయి.

3. అంజీర్

అంజీర్ పండ్లలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అంజీర్ పండ్లలో 70 మిల్లీ గ్రాముల కాల్షియం ఉందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిలో పొటాషియం, విటమిన్ K  కూడా ఎక్కువే. ఈ రెండూ కూడా ఎముకల ఆరోగ్యానికి అత్యంత అవసరమైన సూక్ష్మపోషకాలు.

4. బీన్స్, కాయధాన్యాలు

బీన్స్, కాయధాన్యాలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఫైబర్, ప్రొటీన్, మెగ్నీషియం, ఫోలేట్, జింక్, పొటాషియంలతో నిండి ఉంటాయి.

5. నువ్వులు

నువ్వులలో కూడా కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. మన శరీరానికి కాల్షియం అందించడానికి నువ్వులను ఆహారంలో చేర్చుకోవచ్చు. 100 గ్రాముల నువ్వుల గింజలు రోజుకు 97 శాతం కాల్షియంను అందిస్తాయి. వీటిలో మెగ్నీషియం, ఇనుము, భాస్వరం, జింక్, సెలీనియం కూడా ఉంటాయి. ఇవి కాకుండా  గసగసాలు, సెలెరీ, చియా గింజలలో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. 

ఇవేనండీ! కాల్షియం గనులు. మరి ఇంకేమీ ఆలోచించకుండా వీటిని మీ ఆహారంలో భాగం చేయడం మొదలుపెట్టేయండి.