Breast Cancer: మహిళల్లో రొమ్ము క్యాన్సర్ నివారణకు చిట్కాలు..

ప్రతీ ఎనిమిది మంది మహిళల్లో ఒకరు రొమ్ము క్యాన్సర్‌(Breast cancer) వ్యాధి బారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. త్వరగా గుర్తిస్తే, ప్రాణాపాయం తప్పుతుంది, ఎలాగో చూడండి.. రొమ్ము క్యాన్సర్(Breast cancer) అనేది రొమ్ములోని కణజాలంపై ప్రభావం చూపే క్యాన్సర్(cancer)రూపం. ఇది మహిళల్లో సంభవించే అత్యంత సాధారణమైన క్యాన్సర్ రకాల్లో ఒకటి. ప్రతీ ఎనిమిది మంది మహిళల్లో ఒకరు తమ జీవిత కాలంలో ఏదో ఒక సమయంలో రొమ్ము క్యాన్సర్‌ను అభివృద్ధి చేస్తారని నివేదికలు పేర్కొన్నాయి. అయితే, సకాలంలో […]

Share:

ప్రతీ ఎనిమిది మంది మహిళల్లో ఒకరు రొమ్ము క్యాన్సర్‌(Breast cancer) వ్యాధి బారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. త్వరగా గుర్తిస్తే, ప్రాణాపాయం తప్పుతుంది, ఎలాగో చూడండి..

రొమ్ము క్యాన్సర్(Breast cancer) అనేది రొమ్ములోని కణజాలంపై ప్రభావం చూపే క్యాన్సర్(cancer)రూపం. ఇది మహిళల్లో సంభవించే అత్యంత సాధారణమైన క్యాన్సర్ రకాల్లో ఒకటి. ప్రతీ ఎనిమిది మంది మహిళల్లో ఒకరు తమ జీవిత కాలంలో ఏదో ఒక సమయంలో రొమ్ము క్యాన్సర్‌ను అభివృద్ధి చేస్తారని నివేదికలు పేర్కొన్నాయి. అయితే, సకాలంలో రోగ నిర్ధారణ, తగిన చికిత్స తీసుకోవడం వలన ఈ ప్రాణాంతక వ్యాధి ముప్పు నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. రెగ్యులర్ మామోగ్రామ్‌ల ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించవచ్చు. అయితే అన్ని రొమ్ము క్యాన్సర్‌లను మామోగ్రామ్ ద్వారా గుర్తించలేమని ఇక్కడ గమనించాల్సిన విషయం.

Read More: Obesity: ఊబకాయం మగవారిలో వంధ్యత్వానికి కారణమవుతుందా?

రొమ్ము క్యాన్సర్ ప్రాథమిక లక్షణాలు

మహిళల్లో రొమ్ము క్యాన్సర్(Breast cancer) అభివృద్ధి చెందడాన్ని కొన్ని ముందస్తు సంకేతాల ద్వారా గుర్తించవచ్చు. రొమ్ము క్యాన్సర్ లక్షణాల విషయానికి వస్తే రొమ్ములో ముద్ద.. ద్రవ్యరాశి పెరగడం, రొమ్ము ఆకారం పరిమాణంలో మార్పులు, చంకలో గడ్డ ఏర్పడటం, రొమ్ము ప్రాంతంలో కొవ్వు, చర్మం మడతలు పడటంలాంటివి గమనించవచ్చు. 

రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ

ఈ లక్షణాలు గమనించినట్లయితే ఇది రొమ్ము క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. కొన్నిసార్లు ఈ లక్షణాలు లేకపోయినా రొమ్ము క్యాన్సర్(Breast cancer)  సంభవించవచ్చు. రొమ్ము భాగంలో ఏదైనా అసాధారణ పరిస్థితులపై అనుమానం కలిగినపుడు వైద్యులను సంప్రదించి స్కానింగ్(scanning) చేయించుకోవడం ఉత్తమం. 50 ఏళ్లు పైబడిన మహిళలు ప్రతి రెండేళ్లకోసారి మామోగ్రామ్ చేయించుకోవాలని సూచించారు. అయితే దట్టమైన రొమ్ము కణజాలం కలిగిన మహిళల్లో మోమోగ్రామ్ చేసినప్పటికీ లక్షణాలు గుర్తించడం కష్టం అవుతుంది. అలాంటి సందర్భాల్లో వైద్యులు మరింత లోతైన విశ్లేషణ చేసి వ్యాధిని నిర్ధారించడం జరుగుతుంది.

రొమ్ము క్యాన్సర్ కు సంబంధించిన ఏవైనా లక్షణాలు లేదా అనుమానాలు ఉంటే, పరిస్థితిని నిర్ధారించడానికి వైద్యులు కొన్ని పరీక్షలను సూచించవచ్చు. వీటిలో మామోగ్రామ్, అల్ట్రాసౌండ్(Ultrasound), ఎంఆర్ఐ(MRI) లేదా బయాప్సీ ఉండవచ్చు. బయాప్సీలో రొమ్ము కణజాలం నుండి చిన్న నమూనాను తీసుకొని, క్యాన్సర్ కణాల ఉనికిని మైక్రోస్కోప్‌లో పరీక్షించడం జరుగుతుంది.

రొమ్ము క్యాన్సర్ చికిత్స

రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స చేయడం అనేది క్యాన్సర్ నిర్దిష్ట రకం, అది ఏ దశలో ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. రొమ్ము క్యాన్సర్‌కు అత్యంత సాధారణ చికిత్సలలో శస్త్రచికిత్స, కీమోథెరపీ(Chemotherapy), రేడియేషన్ థెరపీ(radiation therapy) ఉన్నాయి. చాలా రకాల రొమ్ము క్యాన్సర్‌లకు శస్త్రచికిత్స చేసి రొమ్ము నుండి క్యాన్సర్ కణజాలాన్ని తొలగించడం. మిగిలిన క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి కీమోథెరపీ, రేడియేషన్ థెరపీలను ఉపయోగిస్తారు.

శరీరం అంతటా క్యాన్సర్ కణాలను చంపడానికి కీమోథెరపీని కూడా ఉపయోగించవచ్చు. క్యాన్సర్ హార్మోన్ రిసెప్టర్-పాజిటివ్ అయితే హార్మోన్ థెరపీ(Hormone therapy)ని ఉపయోగించవచ్చు. కొన్ని రకాల రొమ్ము క్యాన్సర్‌లకు కూడా టార్గెటెడ్ థెరపీని ఉపయోగించవచ్చు. అయితే ఏ చికిత్స అయినా రోగి ఆరోగ్యం, క్యాన్సర్ దశ, అది ఎలాంటి రకం మొదలన ప్రాధాన్యతలను పరిగణలోకి తీసుకుంటారు.

రొమ్ము క్యాన్సర్ తగ్గించడానికి చిట్కాలు

శరీరం బరువు నిర్వహణ: ఆరోగ్యకరమైన బరువు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కానీ, గుండె ఆరోగ్యానికి, ఎముక, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవడానికి డైట్ కంట్రోల్‌తోపాటు యోగా(Yoga), వ్యాయామం వంటివి అలవర్చుకోవాలి.

ఆహారం ముఖ్యపాత్ర: ఆరోగ్యకరమైన ఆహారం ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం శరీరానికి ఎంతో ముఖ్యమైనదని తెలిసినప్పటికీ ప్రజలు తరచుగా వారి జీవనశైలిలో చేర్చుకోవడంలో విఫలమవుతున్నారు. రొమ్ము క్యాన్సర్(Breast Cancer) ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం తప్పనిసరి అని గుర్తించాలి. పుట్టగొడుగులు, బ్రొకోలి, దానిమ్మ, బీన్స్‌, చిక్కుడు గింజలు, బచ్చలి కూర నిత్యం ప్లేట్‌లో ఉండేలా చూసుకోవాలి.

వ్యాయామం మరువొద్దు: శారీరకంగా చురుకుగా ఉండేందుకు వివిధ వ్యాయామాలు(Exercises) ఎంతగానో ఉపయోగపడతాయి. శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి నిత్యం అర్ధగంటకు తక్కువ కాకుండా వ్యాయామం చేయాలి. ప్రతి వారం కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆరోగ్యకరమైన జీవనశైలి: మద్యం(alcohol), ధూమపానం(Smoking), మాదకద్రవ్యాల వినియోగం వంటి అలవాట్ల వల్ల బ్రెస్ట్‌ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకుగాను, పరిశుభ్రమైన జీవనశైలిని పాటించడం అలవాటు చేసుకోవాలి. మన ఆరోగ్యకరమైన జీవనశైలే ఆరోగ్య సమస్యల ప్రమాదం నుంచి మనల్ని రక్షిస్తుందని గుర్తుంచుకోవాలి.

డాక్టర్‌తో మాట్లాడండి: కొన్ని మందులు, గర్భనిరోధకాలు, హార్మోన్ పునఃస్థాపన చికిత్స రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. మీ పర్సనల్‌ డాక్టర్‌తో రొమ్ము క్యాన్సర్‌పై మనుసు విప్పి మాట్లాడండి. విషయాలు తెలుసుకోండి. వారి సలహాలు తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనానికి మెట్లు వేసుకోవాలి. రొమ్ముల్లో ఎలాంటి అసాధాణతను గుర్తించినా వెంటనే వైద్యుల దృష్టికి తీసుకురావాలి. 40 ఏండ్ల వయసు దాటిన ప్రతీ ఒక్కరు ఏడాదికి ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి.
గ‌మ‌నిక‌: ఇది కేవ‌లం అవ‌గాహ‌న కోసం అందించిన స‌మాచారం మాత్ర‌మే. ఆరోగ్యం, ఆహారానికి సంబంధించిన నిర్ణ‌యాలు తీసుకునే ముందు వైద్యుల‌ను సంప్ర‌దించ‌డం ఉత్త‌మం.