బ్రేక్ ఫాస్ట్ లో తృణధాన్యాలు తీసుకుంటున్నారా?

ఆహారాన్ని మితంగా తీసుకుంటే ఔషధం అతిగా తీసుకుంటే విషమన్న సంగతి తెలిసిందే అయితే కొన్ని ఆహార పదార్థాలు కొన్ని కొన్ని సమయాల్లో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. ముఖ్యంగా ఉదయం పూట మనం తీసుకునే అల్పాహారం ఆరోగ్యానికి చాలా ముఖ్యం పోషక విలువలు ఉన్న అల్పాహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే మీరు తీసుకునే అల్పాహారంలో తృణధాన్యాలు కచ్చితంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తృణధాన్యాలు ఉదయం అల్పాహారంలో తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, […]

Share:

ఆహారాన్ని మితంగా తీసుకుంటే ఔషధం అతిగా తీసుకుంటే విషమన్న సంగతి తెలిసిందే అయితే కొన్ని ఆహార పదార్థాలు కొన్ని కొన్ని సమయాల్లో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. ముఖ్యంగా ఉదయం పూట మనం తీసుకునే అల్పాహారం ఆరోగ్యానికి చాలా ముఖ్యం పోషక విలువలు ఉన్న అల్పాహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే మీరు తీసుకునే అల్పాహారంలో తృణధాన్యాలు కచ్చితంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తృణధాన్యాలు ఉదయం అల్పాహారంలో తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, తృణధాన్యాలను అల్పాహారం గా ఎంపిక చేసుకునేటప్పుడు ఈ కింది సూత్రాలను పాటించండి.. 

అల్పాహారంలో తృణధాన్యాలు తీసుకోవటం వలన ఊబకాయంలో దూరం చేసుకోవడంతో పాటు ఆరోగ్యంగా ఉండవచ్చని న్యూట్రిషన్లు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన అల్పాహార ధాన్యాలను పరిగణలోకి తీసుకుంటే వాటిలో కొవ్వు శాతం అస్సలు ఉండదు. తృణధాన్యాల్లో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అల్పాహారంలో ఆరోగ్యకరమైన తృణధాన్యాలు నట్స్ వంటివి తీసుకోవటం ఉత్తమం త్రోణ ధాన్యాలు మొలకెత్తిన ధాన్యాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యంతో పాటు శక్తి లభిస్తుంది. ఫైబర్ కలిగిన కార్న్, గోధుమ, బాదం పప్పుతో తయారైన నట్స్ను బ్రేక్ఫాస్ట్ గా తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చు. గుండెపోటుకు చెక్ పెట్టవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

తృణధాన్యాల ఎంపికలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. 

తృణధాన్యాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అల్పాహారంలో ఆరోగ్యకరమైన తృణధాన్యాలను ఎంచుకోండి. మీ భోజనంలో ఓట్స్ గోధుమ కినోవా రాగి వంటి ధాన్యాలను యాడ్ చేసుకోండి. ఇది మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 

తృణధాన్యాలను కూడా ప్రాసెస్ చేసే అందిస్తున్నారు. కానీ ప్రాసెస్ చేసినవి కాకుండా లేబుల్ లను జాగ్రత్తగా చదివి అదనపు చక్కెరలు , కృత్రిమ పదార్ధాలు, అనారోగ్యకరమైన కొవ్వులు, ఇతర అవాంఛిత పదార్థాలు కలిపి తీసుకోకండి. 

తృణధాన్యాలు అధిక కంటెంట్ కలిగినవి మాత్రమే తీసుకోండి. కనీస ప్రాసెసింగ్ చేసిన తృణధాన్యాలను ఎంపిక చేసుకోండి. చక్కెరను జోడించవద్దు. చాలా తృణధాన్యాలలో ఇప్పటికీ చక్కెర కలిగి ఉంటాయి. వాటిలో ఎక్కువ చక్కెర కలిగి ఉన్న వాటిని ఎంచుకోవద్దు. వాటికి బదులుగా తృణధాన్యాలలో తాజా పండ్లు యాడ్ చేసుకోండి. ఎండుద్రాక్ష, తేనే, బెల్లం వంటి వాటిని తృణధాన్యాలకు జోడించండి. ఇది మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చక్కెరను మాత్రం తృణధాన్యాలతో కలిపి తీసుకోకుండా ఉండడమే ఉత్తమం.

తృణధాన్యాల్లో రాగులు సజ్జలు, గోధుమ, జొన్నలు, కొర్రలు ,  వరిగలు , సాములు, ఊదలు, అవిసే లాంటివి ఉన్నాయి. పిండి పదార్థాల్లో శరీరానికి కావలసిన 70% శక్తి లభిస్తుంది. వీటిలో మాంసకృతులు, కాల్షియం, బి కాంప్లెక్స్, ఐరన్ వంటివి సమృద్ధిగా లభిస్తాయి. తృణ ధాన్యాలను కాయగూరలు, పప్పు వాటితో కలిపి తీసుకుంటే మాంసకృత్తులు నాణ్యత పెరుగుతుంది. ఆకుకూరలతో తీసుకుంటే ఐరన్ శరీరానికి సక్రమంగా అందుతుంది. బియ్యాన్ని నీళ్లలో నానబెట్టి ఆవేరి పట్టి ఉడికించడంతో విటమిన్లు ఎక్కువగా దొరుకుతాయి. వీటి వలన కూడా ఆరోగ్యం బాగుంటుంది. సజ్జలు జొన్నలు, రాగుల్లో ఖనిజాలు , పీచు పదార్థాలు అధిక మొత్తంలో దొరుకుతాయి. ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉండటంతో ఎముకలు బలంగా తయారవుతాయి. తృణధాన్యాల్లో ఆరు నుంచి 12 శాతం మాంసకృత్తులు ఉంటాయి. అమినో ఆసిడ్ తక్కువగా ఉండటంతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. చిరుధాన్యాల్లో పైటేట్  సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ ఏ, సి ఉండవు. మొక్కజొన్నలో బీటా కెరోటిన్ లభిస్తుంది. చిరుధాన్యాలు తినడంతో ఊబకాయం, ఆర్థరైటిస్, మధుమేహం, కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవచ్చు.