రక్తదానం చేయడం మంచిదేనా?

అన్ని దానాలలోకెల్లా రక్తదానం మిన్నని పెద్దలు చెబుతున్నారు.. ఒకరు దానం చేయడం వల్ల ముగ్గురి ప్రాణాల్ని కాపాడవచ్చు.. రక్తదానం మరొకరి జీవితానికి వెలుగు రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అంటూ ఎన్నో స్వచ్ఛంద సంస్థలు వైద్యులు పలు అవగాహన కార్యక్రమాలు ర్యాలీలు చేస్తుండడం మనం చూస్తూనే ఉంటాం.. రక్తదానం చేయాలంటే బోలెడన్ని అపోహలు ఉంటాయి. కానీ రక్తదానం చేయడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. రక్తదానం ఎవరు చేయాలి.? ఎవరు చేయకూడదు.? రక్తదానం చేయడం […]

Share:

అన్ని దానాలలోకెల్లా రక్తదానం మిన్నని పెద్దలు చెబుతున్నారు.. ఒకరు దానం చేయడం వల్ల ముగ్గురి ప్రాణాల్ని కాపాడవచ్చు.. రక్తదానం మరొకరి జీవితానికి వెలుగు రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అంటూ ఎన్నో స్వచ్ఛంద సంస్థలు వైద్యులు పలు అవగాహన కార్యక్రమాలు ర్యాలీలు చేస్తుండడం మనం చూస్తూనే ఉంటాం.. రక్తదానం చేయాలంటే బోలెడన్ని అపోహలు ఉంటాయి. కానీ రక్తదానం చేయడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. రక్తదానం ఎవరు చేయాలి.? ఎవరు చేయకూడదు.? రక్తదానం చేయడం వలన కలిగే లాభాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..  

రక్తదానం చేయడం వల్ల శరీరం నీరసం , బలహీనత పడుతుందని అనుకోవడం పొరపాటు.  నిరంభ్యంతరంగా రక్తదానం చేయవచ్చు. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు రక్తం రక్తదానం చేయవచ్చు. 45 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్న వ్యక్తులు మాత్రమే రక్తం ఇవ్వాలి. బరువు తక్కువ ఉంటే రక్తం ఇవ్వకూడదు. 60 నుంచి 100 మధ్య రక్తపోటు సాధారణ శరీర ఉష్ణోగ్రత 37.5 డిగ్రీల సెల్సియస్ కు మించని వ్యక్తుల నుంచి రక్తం తీయవచ్చు  తీవ్రమైన అనారోగ్యాలు లేని వ్యక్తులు రక్తదానం చేయవచ్చు. 

తీవ్రమైన వ్యాధులు , మూర్చ, మూత్రపిండా వ్యాధులు , అలర్జీ, అసాధారణ రక్తస్రావ లక్షణాలు, త్వరితగతిగా బరువు కోల్పోవడం, హృదయ సంబంధమైన వ్యాధులు, ఇతర ప్రమాదకరమైన వ్యాధులు తో బాధపడుతున్న వారు రక్తదానం ఇవ్వకూడదు. గర్భవస్థలో,  డెలివరీ అయిన ఆరు నెలల వరకు, బిడ్డకు పాలించినంతకాలం , బహిష్టు సమయంలో అధికంగా రక్తస్రావం జరిగే పరిస్థితుల్లో స్త్రీలు రక్తం ఇవ్వకూడదు. టీకాలు వేసుకున్న రెండు వారాల తర్వాత అవాంచిత లక్షణాలు లేనప్పుడు రక్తం ఇవ్వవచ్చు. ధనుర్వాతం, కంటవాపు, గ్యాస్, పచ్చకామెర్లు ఒక సంవత్సరం ముందు వరకు లేని వారు రక్తదానం ఇవ్వడానికి అర్హులు. 

రక్తంలోని ఏ, బి, ఓ గ్రూపులను కనుగొన్న కార్లు స్టైనర్ జన్మదినం జూన్ 14న పురస్కరించుకొని ఆ రోజున రక్తదాతల దినోత్సవం గా పాటిస్తున్నారు. రెడ్ క్రాస్, రెడ్ రీసెంట్ సొసైటీ ఇంటర్నేషనల్ బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్లు ప్రపంచ ఆరోగ్య సంస్థలతో కలిసి రక్తదాతల దినోత్సవం నిర్వహిస్తున్నాయి. మనిషి దినచర్య సక్రమంగా జరగాలంటే రక్త ప్రసరణ ఎంతో అవసరం. సకాలంలో రక్తం అందగా చనిపోతున్న వారు ఎందరో. అత్యవసర చికిత్సలు, క్లిష్టమైన ప్రసవాల సమయంలో ఎంతో మందికి రక్తం అవసరం అవుతుంది. దేశంలో ప్రతి రెండు సెకండ్లకు ఒకరికి రక్తం అవసరమవుతుంది. సరైన అవగాహన లేనందున రక్తదానం చేసే వారి సంఖ్య తగ్గిపోతుంది. రక్తదాతలు ముందుకొస్తే ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చు . ఇటీవల ఆన్లైన్ లో దాతల వివరాలు అందుబాటులో ఉంచుతూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చినప్పటికీ.. వీటి గురించి తెలియకపోవడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. 

మీరు రక్తదానం చేసిన తర్వాత మీ చేతిని పైకి చాచి ఉంచండి డాక్టర్ల సూచన మేరకే తేలికపాటి ఆహార పదార్థాలు తీసుకోవాలి రక్తదానం చేసిన తరువాత 24 గంటల్లో ఎటువంటి శారీరక శ్రమ చేయకుండా ఉంటే మంచిది. రెండు మూడు వారాల తర్వాత శరీరంలోని రక్త స్థాయిలు సాధారణ స్థితికి వస్తాయి అప్పుడు మీ ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. 

రక్తదానం తరువాత పునరుత్పత్తి ప్రారంభం కావడానికి నాలుగు రోజుల సమయం పడుతుంది. గుండె సంబంధిత వ్యాధులు ఉంటే తగ్గుతాయి. పెద్ద పేగు , గొంతు క్యాన్సర్లు, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.

 రక్తదానం చేసి ప్రజలను కాపాడాలని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాం. రక్తం ఇచ్చి మరొకరి జీవితాన్ని కాపాడాలని ఉద్దేశంతో 166 సార్లు రక్తదానం చేశాను. మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేసి ఎన్నో అవార్డులు అందుకున్నాను. 2023 సంవత్సరంలో లండన్ వండర్ బుక్ రికార్డ్స్ ఆధ్వర్యంలో  లైఫ్ సేవర్ అవార్డు అందుకున్నాను అని లయన్ నటరాజ్ పాలమూరు జిల్లా రెడ్డి క్రాస్ సొసైటీ చైర్మన్ తెలిపారు.