జుట్టు రాలడం ఆపేందుకు ఏది ఉత్తమం

నేటి రోజుల్లో జుట్టు రాలడం అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది. ఈ జుట్టు రాలడం తగ్గించడం కోసం మార్కెట్లో మనకు అనేక రకాల ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కాస్మోటిక్స్ వాడుతూ… చాలా మంది తమకు అనువైన రిజల్ట్ ను పొందుతున్నారు. కొంత మంది తాము అనుకున్నది పొందక జుట్టు రాలడం ఆగేందుకు వివిధ టిప్స్ ట్రై చేస్తూనే ఉన్నారు. అసలు జుట్టు రాలేందుకు ముఖ్య కారణం మనలో సరైన పోషకాలు విటమిన్లు లేకపోవడం.. ఈ […]

Share:

నేటి రోజుల్లో జుట్టు రాలడం అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది. ఈ జుట్టు రాలడం తగ్గించడం కోసం మార్కెట్లో మనకు అనేక రకాల ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కాస్మోటిక్స్ వాడుతూ… చాలా మంది తమకు అనువైన రిజల్ట్ ను పొందుతున్నారు. కొంత మంది తాము అనుకున్నది పొందక జుట్టు రాలడం ఆగేందుకు వివిధ టిప్స్ ట్రై చేస్తూనే ఉన్నారు. అసలు జుట్టు రాలేందుకు ముఖ్య కారణం మనలో సరైన పోషకాలు విటమిన్లు లేకపోవడం.. ఈ పోషకాలు విటమిన్ల వల్ల శరీర ఆరోగ్యంతో పాటు కురుల ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతోంది. అందుకోసమే చాలా మంది మహిళలు తమకు జుట్టు రాలుతున్నపుడు వివిధ రకాల విటమిన్లను తీసుకుంటూ ఉంటారు. అంతే కాకుండా జుట్టు సంరక్షణ అనేది షాంపూ మరియు కండీషనర్ ఉపయోగించడం వల్ల కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే మనం ఎటువంటి షాంపూను కండీషనర్ ను వాడుతున్నామో ఓ సారి గమనించుకోవాలి. కేవలం ఇవి మాత్రమే కాకుండా కొందరు హెయిర్ మాస్క్‌ లు వాడి కూడా జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేసుకుంటారు. హెయిర్ స్పా కు కూడా వెళ్తుంటారు. మీరు మీ జుట్టుకు కావలసినన్ని ఉత్పత్తులను అప్లై చేసుకోవచ్చు. కానీ మీరు కనుక సరైన పోషకాలను పొందకపోతే, మీ జుట్టు నష్టపోతుంది. అందుకే ఆరోగ్యకరమైన జుట్టుకు బయోటిన్ మరియు విటమిన్ డి అనేవి చాలా ముఖ్యమైనవి. ఈ రెండు జుట్టు రాలడాన్ని ఎదుర్కోవడానికి మీకు సహాయపడతాయి. కానీ జుట్టు పెరుగుదలకు ఏది ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందనేది ఓ సారి పరిశీలిస్తే.. 

పెరుగుదల కోసం ఉపయోగపడే బయోటిన్

ఈ రెండింటి గురించి ప్రముఖ వైద్యులు ఏం చెబుతున్నారో ఓ సారి గమనిస్తే.. 

బయోటిన్ లేదా విటమిన్ బీ7 అనేది బీ కాంప్లెక్స్ విటమిన్లలో ఒకటి. ఇది మొత్తం ఆరోగ్యానికి అలాగే బలమైన జుట్టుకు ముఖ్యమైనది. జుట్టు పెరుగుదలకు అవసరమైన వివిధ అమైనో ఆమ్లాలు మరియు ప్రోటీన్ల సంశ్లేషణలో ఇది ముఖ్యమైన పాత్రను కలిగి ఉందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి, జుట్టు రాలడం లేదా జుట్టు పల్చబడటం వంటి సమస్యలతో బాధపడేవారికి దీన్ని సప్లిమెంట్‌గా ఇవ్వొచ్చు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, జుట్టు సన్నబడటం వంటి సమస్యతో బాధపడుతున్న మహిళలు బయోటిన్‌ తో కూడిన బహుళ-పదార్ధాల హెయిర్ గ్రోత్ సప్లిమెంట్‌ ను లేదా ఆరు నెలల పాటు ప్లేసిబోను ఎంచుకోవాలని సూచించారు. 

మరి విటమిన్ డీ ఎందుకోసమంటే.. 

బయోటిన్ అనేది ఆరోగ్యకరంగా జుట్టు పెరిగేందుకు ఉపయోగపడితే మరి విటమిన్ డీ ఎందుకోసం ఉపయోగపడుతుందని అనేక మందికి డౌట్ రావడం సహజం. జుట్టు రాలడాన్ని నివారించడానికి విటమిన్ డి ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ లో ఉండే యాంటీ ఇన్‌ ఫ్లమేటరీ లక్షణాల వల్ల డెర్మటాలజీలో విటమిన్ డీ కీలక పాత్ర పోషిస్తోంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం ఇది జుట్టు చక్రంపై కూడా ప్రభావం చూపుతుంది. విటమిన్ డీ మరియు స్త్రీల బట్టతల, అలోపేసియా అరేటా మరియు టెలోజెన్ ఎఫ్లూవియం వంటి కొన్ని రకాల జుట్టు రాలే సమస్యల మధ్య సంబంధాన్ని చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని డాక్టర్లు తెలిపారు. కాబట్టి, జుట్టు పెరుగుదలకు బయోటిన్ మరియు విటమిన్ డీని కలిపి ఉపయోగించాలి. ఈ రోజుల్లో అనేక ముఖ్యమైన మల్టీవిటమిన్లు, ప్రత్యేకంగా జుట్టు కోసం, ఒకే క్యాప్సూల్ లేదా టాబ్లెట్‌లో కలపవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. వీటిని రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తీసుకోవచ్చు. ఈ స్థూల మరియు సూక్ష్మపోషకాలు ప్రతి ఒక్కటి జుట్టు పెరుగుదల యొక్క అన్ని దశలకు అవసరం.