ఈ యోగాసనాలతో కిడ్నీలను కాపాడుకోవచ్చు.. 

ప్రస్తుత ఈ కాలుష్య ప్రపంచంలో మనుషులకు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సవాలుగా మారింది. కాలుష్యంతో పాటు జీవన విధానం వల్ల  కూడా చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. పని ప్రదేశాల్లో ఒత్తిడి, టైమ్‌కి ఫుడ్‌ తినకపోవడం, శరీరానికి శారీరకంగా పని లేకపోవడం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దీంతో అనారోగ్యల బారిన పడి హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతుంటారు. మన జీవన శైలే మన ఆరోగ్యాన్ని డిసైడ్‌ చేస్తుంది. బాడీలోని ప్రతి వ్యవస్థ […]

Share:

ప్రస్తుత ఈ కాలుష్య ప్రపంచంలో మనుషులకు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సవాలుగా మారింది. కాలుష్యంతో పాటు జీవన విధానం వల్ల  కూడా చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. పని ప్రదేశాల్లో ఒత్తిడి, టైమ్‌కి ఫుడ్‌ తినకపోవడం, శరీరానికి శారీరకంగా పని లేకపోవడం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దీంతో అనారోగ్యల బారిన పడి హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతుంటారు. మన జీవన శైలే మన ఆరోగ్యాన్ని డిసైడ్‌ చేస్తుంది. బాడీలోని ప్రతి వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే రోగాల బారిన పడాల్సి వస్తుంది. ఇందుకోసం ఇప్పటినుంచే మంచి ఫుడ్‌ తీసుకుంటూ, శారీరకంగా కష్టపడుతూ హెల్దీగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం డైలీ ఎక్సర్‌‌సైజ్‌లతో పాటు యోగా చేయడం చాలా ముఖ్యం. డైలీ యోగా చేయడం వల్ల శరీరానికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శరీరంలోని ఒక్కో వ్యవస్థ బాగా పనిచేయడానికి ప్రత్యేకంగా యోగాసనాలు ఉన్నాయి. 

శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడంలో మూత్ర పిండాలు కీలకంగా వ్యవహరిస్తాయి. బాడీకి అవసరమైన ఖనిజాలను సమతుల్యం చేయడం, రక్తపోటు (బీపీ) స్థాయిలను నియంత్రించడంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి మూత్ర పిండాల (కిడ్నీ)ను జాగ్రత్తగా చూసుకోకపోవడం వల్ల అందులో రాళ్లు ఏర్పడి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. శరీరంలోని అన్ని విధులను నియంత్రించే ముఖ్యమైన అవయవం మూత్రపిండాలు కావడంతో వీటిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అయితే, యోగా ద్వారా కూడా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కిడ్నీ ఆరోగ్యానికి యోగా ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం..

సమతుల్య ఆహారం, తగినంత నీరు తాగడంతో పాటు ప్రతి రోజూ 10 నుంచి 20 నిమిషాలు యోగా చేయాలి. దీని ద్వారా మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాకుండా, ఆలసట, ఒత్తిడి నుంచి ఉపశమనం కూడా అందిస్తుంది. సో.. ఇక, లేట్‌ ఎందుకు మీరు మీ కిడ్నీలను హెల్దీగా ఉంచుకునేందుకు ఈ రోజు నుంచే యోగాను స్టార్ట్ చేయండి.  ముఖ్యంగా మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి 4 యోగాసనాలు ఉన్నాయి. అవెంటో ఇప్పుడు చూద్దాం…

1. కపాల భాతి ప్రాణాయామం..

ఈ యోగాసనం వేయడం వల్ల శరీరం చాలా వేడిని ఉత్పత్తి చేస్తుది. దీని వల్ల వ్యర్థ పదార్థాలు, టాక్సిన్స్‌ సులభగా కరిగిపోతాయి.అదే సమయంలో రక్త ప్రసరణ, డైజేషన్‌ (జీర్ణక్రియ), మెటాబాలిజం (జీవక్రియ)ను మెరుగుపరుస్తుంది. మూత్రపిండాలు, కాలేయం పనితీరును పెంచుతుంది.

ఇది  ఎలా చెయాలి?

1. ముందుగా మీ వీపును నిటారుగా పెట్టి, చాప మీద ప్రశాంతంగా కూర్చోవాలి. 

2. తర్వాత లోతైన శ్వాస తీసుకోవాలి. అది ఎలా ఉండాలంటే, మీ నాభిని వెన్నెముక వైపునకు లాగుతూశ్వాస తీసుకోవాలి. అలా చేయడం వల్ల పొత్తి కడుపు కదులుతుంది. ఇలా గట్టిగా తీసుకోవడం వల్ల శ్వాస నేరుగా ఊపిరితిత్తుల్లోకి ప్రవహిస్తుంది. 

3. కనీసం 20 శ్వాసలు తీసుకుంటే కపాల భాతి ప్రాణాయామ ఒక రౌండ్‌ పూర్తి అవుతుంది. 

4.ఆ తర్వాత కాళ్లను రిలాక్స్‌ వదిలేసి, ఇంద్రియాలను గమనించండి.

5. ఇలా మీకు వీలైనన్ని రౌండ్లు చేయండి

2. ధనురాసనం

ఈ ధనురాసనం మీ కడుపు, తొడలు, చీల మండలు, గొంతు, శరీరాన్ని లక్ష్యంగాచేసుకొని ఉంటుంది. ఈ యోగాసనం వేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. జీర్ణక్రియ, కాలేయం, మూత్రపిండాల పనితీరును ప్రోత్సహిస్తుంది. ఇది మధుమేహంతో బాధపడుతున్న రోగులకు కూడా సహాయపడుతుంది. 

ఎలా చెయ్యాలి?

1. ముందుగా మీ పాదాలను, తుంటి, చేతులకు అనుగుణంగా బోర్లా పడుకోవాలి. 

2. మీ మోకాళ్లను వెనుక నుంచి దగ్గరగా తీసుకురండి. తర్వాత కాళ్ల చీల మండలను మీ చేతులతో పట్టుకోండి.

3. లోతైన శ్వాస తీసుకోండి, ముందుకు చూస్తూ నేలపై ఉన్న ఛాతీని పైకి ఎత్తండి. ఇప్పుడు ఈ ఆసనం ధనస్సు లాగా కనిపించాలి.

4.30 నుంచి 60 సెకన్ల పాటు ఇదే భంగిమలో ఉండాలి. ఇదే భంగిమను 10 నుంచి 15 సార్లు రిపీట్‌ చేయాలి.

5. ఈ ఆసనం వేసేటప్పుడు ఎక్కడైన నొప్పి అనిపిస్తే భంగిమ నుంచి బయటకు వచ్చి, రిలాక్స్‌ కావొచ్చు.

3. పశ్చిమోత్తనాసనం

ఈ  పశ్చిమోత్తానాసనం కాలేయం, మూత్రపిండాలు, అండాశయాలు, గర్భాశయ పనితీరును ప్రేరేపిస్తుంది. ఇది మల బద్ధకానికి చికిత్సలా పనిచేస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. కడుపు, కటి అవయవాలను మేలు చేస్తుంది. ప్రతి రోజూ దీన్ని సాధన చేయడం వల్ల మహిళల్లో రుతు చక్రం కరెక్ట్ సమయానికి వస్తుంది. మెదడు ప్రశాంతంగా ఉంటుంది. నిరాశ, ఒత్తిడి, అలసట వంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు సహాయపడుతుంది.

ఇది ఎలా చెయ్యాలి?

1. ముందుగా కింద కూర్చొని, రెండు కాళ్లను ముందుకు చాపాలి. 

2. రెండు చేతులను పైకెత్తి, నిదానంగా తలను, చేతులను రెండింటిని ఒకేసారి కిందికి వంచుతూ ఇంటిపైకప్పు మాదిరి భంగిమలోకి రావాలి.

3. తర్వాత అలాగే, కిందికి వంగుతూ తలను మోకాళ్లకు తగించాలి. చీల మండలను చేతులతో పట్టుకోవాలి. 

4. బాడీని బెండ్‌ చేసినప్పుడు వీపు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. మీ పొట్ట తొడల దగ్గరకు రావడానికి ప్రయత్నించండి.

5. ఈ భంగిమలో కొద్దిసేపు అలాగే ఉండి, మళ్లీ నిదానంగా పైకి లేవాలి.

4. చక్రాసనం

చక్రాసనం మీ ఛాతీని ఎక్స్‌పాండ్‌ చేస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది మీ కాలేయం, మూత్రపిండాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. అలాగే, చేయి, కాళ్ల కండరాలను కూడా బలపరుస్తుంది.

ఇది ఎలా చెయ్యాలి?

1. ముందుగా వెల్లకిలా పడుకోవాలి.

2.తర్వాత కాళ్లు మడిచి, చేతులను భుజాల కిందుగా నేలపై ఆనించి, కొద్దిగా శ్వాస తీసుకుంటూ కుంభించి నడుమును వీలైనంత పైకి ఎత్తాలి.

3. మెడ కిందికి వేలాడుతుండాలి. ఇలా చూసినప్పుడు ఇది చక్రం ఆకారంలో కనపడాలి. 

4. ఈ భంగిమలో ఉంటూ ఊపిరి పీల్చుకుంటూ, వదిలేయాలి. అలా కొద్ది సేపు ఉన్న తర్వాత నడుమును 

మెల్లిగా కిందికి దించాలి. తర్వాత కాళ్లను చాపి, రిలాక్స్‌గా పడుకొని శవాసనం వేయ్యాలి. 

ఈ నాలుగు ఆసనాలు కిడ్నీ ఆరోగ్యాన్ని అదుపులో ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. అయితే, మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం వీటిని నిపుణుల సమక్షంలోనే చేయాల్సి ఉంటుంది. కొన్ని రకాల నొప్పులు, వ్యాధులు ఉన్న వారు ఈ ఆసనాలను వేయడానికి వీల్లేదు.