నలుగురిలో భిన్నంగా.. ఉద్యోగం మీ వెంటే..

యాజమాన్యానికి నచ్చేలా పనిచేసేవాడే మంచి ఉద్యోగి అనిపించుకుంటాడు. నేటి ఉద్యోగ ధర్మం కూడా అదే. మంచి ఉద్యోగిగా ఉన్నప్పుడే పదోన్నతలు లభిస్తాయి. మంచి.. వేతనాలు అందుకోగలుగుతాం నలుగురితో నారాయణలా కాకుండా అందరికంటే ముందే బాధ్యతలను నెరవేర్చడంలో ముందుండాలి. ఉద్యోగ నిర్వహణలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే ఆకాంక్ష అందరికీ ఉంటుంది. ఎదగాలంటే కష్టపడాలి. చొరవ తీసుకునే లక్షణం ఉండాలి.. వేగంగా నిర్ణయాలు తీసుకోగలగాలి. ఆ నిర్ణయాలు కూడా సృజనాత్మకంగా ఉండాలి.. అక్కడ కూడా అందరికంటే ముందే బాధ్యతలను నెరవేర్చాలి. […]

Share:

యాజమాన్యానికి నచ్చేలా పనిచేసేవాడే మంచి ఉద్యోగి అనిపించుకుంటాడు. నేటి ఉద్యోగ ధర్మం కూడా అదే. మంచి ఉద్యోగిగా ఉన్నప్పుడే పదోన్నతలు లభిస్తాయి. మంచి.. వేతనాలు అందుకోగలుగుతాం నలుగురితో నారాయణలా కాకుండా అందరికంటే ముందే బాధ్యతలను నెరవేర్చడంలో ముందుండాలి. ఉద్యోగ నిర్వహణలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే ఆకాంక్ష అందరికీ ఉంటుంది. ఎదగాలంటే కష్టపడాలి. చొరవ తీసుకునే లక్షణం ఉండాలి.. వేగంగా నిర్ణయాలు తీసుకోగలగాలి. ఆ నిర్ణయాలు కూడా సృజనాత్మకంగా ఉండాలి.. అక్కడ కూడా అందరికంటే ముందే బాధ్యతలను నెరవేర్చాలి. అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకోగలరు.. మరి బాస్ నచ్చేలాగా నచ్చేలాగా ఎలా పని చేయాలి..? ఉద్యోగంలో పురోగతి సాధించడానికి ఎలాంటి స్కిల్స్ అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం..

నేర్చుకోవడం

మనం ఎంత ఎత్తుకు ఎదిగినా వారు కూడా ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. మీరు చేసే ఉద్యోగంలో అన్ని నాకే తెలుసు.. అంతా నాకే తెలుసు అనుకోవడం పొరపాటు. అది చిన్న విషయం అయినా పెద్ద విషయం అయినా.. మీకంటే చిన్నవారు చెప్పినా కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రపంచం వేగంగా మారుతుంది. కొత్త నైపుణ్యాలు అలవర్చుకోవాలి. రేపు అనేది చాలా వేగంగా వస్తుంది. కానీ సక్సెస్ మాత్రం అంత సులువు కాదు మీ జ్ఞానాన్ని పెంచుకోవడం, ప్రత్యేక నైపుణ్యాలు కలిగి ఉండడం చాలా ముఖ్యం. అది నిరంతర సాధన ద్వారా సాధ్యమవుతుంది. 

చురుకుదనం

 మీరు పని చేసే ఆఫీస్ లో మీరు యాక్టివ్ గా ఉండాలి. అందరినీ పలకరిస్తూ ఉండాలి. మీకు మీ బాస్ తో పాటు మీ కొలీగ్స్ కూడా ఏవైనా పనులు అప్పగిస్తే సంతోషంగా స్వీకరించండి. అలాగే ఆ పనులను మీరు చేయలేకపోతే నిరభ్యంతరంగా వారికి ఉన్న విషయాన్ని చెప్పేయాలి. కొన్ని కొన్ని సార్లు ఎక్స్ట్రాగా పనిచేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు కూడా తప్పించుకోకుండా యాక్టివ్ గా ఉంటూ బాస్ దగ్గర మంచి మార్కులు కొట్టేసే విధంగా పనిచేయాలి. అందరి తల్లో నాలుక లాగా మీరు మారాలి. ఓ మూల ఉండే వస్తువు లాగా కాకుండా అందరికీ పనికొచ్చే వస్తువు లాగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి.

విమర్శ నుంచి ప్రశంస:

ప్రతిసారి ప్రశంసలే కాదు అప్పుడప్పుడు విమర్శలు కూడా ఉంటాయి. మనం చేసే పనిలో కానీ మన ఆఫీస్ లో బాస్, కొలీగ్స్ ఎవరైనా సరే మిమ్మల్ని ఒక్కొక్కసారి విమర్శించవచ్చు. ఆ విమర్శలను కూడా మీరు సానుకూలంగా తీసుకోవాలి. వాటిని పాజిటివ్ మైండ్ సెట్ తో ఆలోచించాలి. ఒకవేళ నిజంగా అది మీ ఎదుగుదలకు అడ్డం అయితే కచ్చితంగా సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. మిమ్మల్ని విమర్శించిన వారితోనే ప్రశంసించే లాగా చేసుకోవాలి అదే మీ గొప్పతనం. 

సొల్యూషన్ మీరే..

కొన్ని కొన్ని సార్లు ఆఫీసులో పేస్టతరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని కొన్ని నిర్ణయాలు వెంటనే తీసుకోక తప్పదు.ఆ సమస్యకు సంబంధించిన కొంత సమాచారాన్ని సేకరించి మీ పై అధికారి ఇవ్వండి. ఆ నిర్ణయాలు తీసుకునే సమయంలో మీ బాస్ కి మీరు సహాయపడాలి. అవసరమైతే ఆ బాధ్యతలను కూడా మీ భుజాల మీద వేసుకొని వాటిని చేసి చూపించాలి.  సమస్య ఏదైనా సరే సొల్యూషన్ కోసం అందరూ మీ వైపే చూసేలాగా మిమ్మల్ని మీరు మలుచుకోవాలి. మీ యాటిట్యూడ్ ఇలా కనుక ఉంటే ఎక్కడికి వెళ్లినా మీదే పై చేయి. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, మరే ఇతర ఏదైనా సరే.