వేసవిలో బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్ బర్న్ చేయడానికి ఉపయోగపడే రకరకాల టీ ఆప్షన్స్

అటువంటి ఆరోగ్యకరమైన టీ ఆప్షన్స్ మీ కోసం..  1. పుచ్చకాయ తొక్కల టీ పుచ్చకాయ తొక్కలతో టీ తయారు చేయడానికి, తొక్క నుండి ఆకుపచ్చని భాగాన్ని చిన్న ముక్కలుగా కత్తిరించాలి. ఈ తొక్కలను 10-15 నిమిషాల పాటు నీటిలో వేసి మరిగించాలి. నీరు కొద్దిగా గులాబీ రంగులోకి మారేవరకు మరిగించాలి. అదనపు రుచి కోసం, ఆరోగ్య ప్రయోజనాల కోసం దీనిలో తాజా పుదీనా ఆకులను కూడా వేయవచ్చు. కాగిన తర్వాత, పుచ్చకాయ తొక్కలను, పుదీనా ఆకులను వడకట్టి […]

Share:

అటువంటి ఆరోగ్యకరమైన టీ ఆప్షన్స్ మీ కోసం.. 

1. పుచ్చకాయ తొక్కల టీ

పుచ్చకాయ తొక్కలతో టీ తయారు చేయడానికి, తొక్క నుండి ఆకుపచ్చని భాగాన్ని చిన్న ముక్కలుగా కత్తిరించాలి.

ఈ తొక్కలను 10-15 నిమిషాల పాటు నీటిలో వేసి మరిగించాలి. నీరు కొద్దిగా గులాబీ రంగులోకి మారేవరకు మరిగించాలి. అదనపు రుచి కోసం, ఆరోగ్య ప్రయోజనాల కోసం దీనిలో తాజా పుదీనా ఆకులను కూడా వేయవచ్చు.

కాగిన తర్వాత, పుచ్చకాయ తొక్కలను, పుదీనా ఆకులను వడకట్టి చల్లబరచాలి. వేసవిలో రిఫ్రెషింగ్ పానీయంగా మార్చడానికి దీనిలో ఐస్ క్యూబ్‌లను వేసుకుంటే సరిపోతుంది.

పుచ్చకాయ తొక్కల టీ యొక్క ప్రయోజనాలు

దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది మీ జీవక్రియను పెంచడంలో, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. 

2. గ్రీన్ టీ

గ్రీన్ టీలో ఆరోగ్యకరమైన బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. కొవ్వును తగ్గిస్తాయి, శరీరానికి యాంటీఆక్సిడెంట్లను సరఫరా చేస్తాయి, ఇవి కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గ్రీన్ టీ మెదడును వృద్ధాప్యం నుండి కాపాడుతుంది. నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. టైప్ 2 డయాబెటిస్‌ను నివారిస్తుంది. హృదయ సంబంధ వ్యాధులు వచ్చే  ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

3. బ్లూ టీ

బ్లూ టీ, పేరుకు తగ్గట్టే  క్లిటోరియా టెర్నేటియా మొక్క యొక్క పువ్వుల నుండి తయారు చేయబడిన నీలం రంగు కలిగిన పానీయం. 

ఈ టీ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది, చర్మాన్ని ఆకర్షణీయంగా మారుస్తుంది. జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. 

బ్లూ టీలో ఎపిగాల్లోకాటెచిన్ గాలేట్, అలాగే ఫ్లేవనాయిడ్స్, టానిన్లు, పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ, రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి.

4. హెర్బల్ టీ

హెర్బల్ టీలలో అనేక రకాలున్నాయి. వేటికవే ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిస్తాయి. అత్యంత ప్రసిద్ధ హెర్బల్ టీలలో కొన్ని మీకోసం:

– చమోమీల్ టీ: 

ఇది నెలసరి సమయంలో వచ్చే నొప్పి, కండరాల నొప్పులను తగ్గించడానికి, నిద్ర, విశ్రాంతిని మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.

– రూయిబోస్ టీ: 

ఇది రక్తపోటును, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇది జుట్టును బలంగా, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, అలెర్జీల నుండి ఉపశమనం అందిస్తుంది.

– పెప్పరమింట్ టీ: 

ఇందులో మెంథాల్ ఉంటుంది, ఇది కడుపు నొప్పిని తగ్గిస్తుంది. మలబద్ధకం, ప్రేగులలో వచ్చే వ్యాధులపై పనిచేస్తుంది. ఈ టీ వెరైటీ టెన్షన్ తలనొప్పి, మైగ్రేన్‌ల నుండి నొప్పి ఉపశమనాన్ని కూడా అందిస్తుంది.

– అల్లం టీ: 

ఇది మార్నింగ్ సిక్‌నెస్‌తో పోరాడటానికి సహాయపడుతుంది, దీర్ఘకాలిక అజీర్ణానికి చికిత్స చేయడానికి, ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల కలిగే కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

– మందార టీ: 

ఇది రక్తపోటు, కొవ్వు స్థాయిలను తగ్గిస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అనారోగ్యకరమైన స్వీట్‌లను తినాలనే కోరికలను దూరం చేస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా కూడా నిరోధించవచ్చు.