జుట్టు కోసం ఈ ప్రొడక్ట్స్ వాడండి…

ప్రస్తుత రోజుల్లో ముఖారవిందం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో జట్టు ఆరోగ్యం కోసం అంతే ట్రై చేస్తున్నారు. జట్టు నలుపురంగులో చాలా అట్రాక్టివ్ గా కనిపించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. తాము సక్సెస్ కావడం కోసం అనేక కొత్త ప్రొడక్టులను కనుగొంటున్నారు. తమ ఫైనల్ రిజల్ట్ బాగుండాలని చాలా తాపత్రయపడుతున్నారు. ఇలా జట్టును ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం కోసం ఈ కింది ప్రొడక్టులను వాడాలని చాలా మంది సూచిస్తున్నారు. వీటిని వాడిన వారు కూడా వీటి […]

Share:

ప్రస్తుత రోజుల్లో ముఖారవిందం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో జట్టు ఆరోగ్యం కోసం అంతే ట్రై చేస్తున్నారు. జట్టు నలుపురంగులో చాలా అట్రాక్టివ్ గా కనిపించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. తాము సక్సెస్ కావడం కోసం అనేక కొత్త ప్రొడక్టులను కనుగొంటున్నారు. తమ ఫైనల్ రిజల్ట్ బాగుండాలని చాలా తాపత్రయపడుతున్నారు. ఇలా జట్టును ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం కోసం ఈ కింది ప్రొడక్టులను వాడాలని చాలా మంది సూచిస్తున్నారు. వీటిని వాడిన వారు కూడా వీటి గురించి మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. అలా జట్టు ఆరోగ్యం కోసం దోహదం చేసే ఆ ప్రొడక్టులేంటో ఓ సారి మీరు కూడా చూసేయండి. 

ఈ ప్రొడక్టులు మార్కెట్లో చాలా సులభంగా దొరుకుతాయి. వీటిని కొనుగోలు చేసేందుకు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేకుండా పలు ఈ కామర్స్ వెబ్ సైట్లలో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓ సారి లుక్కేస్తే… 

  1. హెయిర్ మాస్క్: హెయిర్ మాస్క్ అనేది ఇంటెన్సివ్ కండీషనింగ్ ట్రీట్మెంట్ చేస్తూ పొడి జట్టుతో అద్భుతాలు చేస్తాయి. కావున వీటిని చాలా మంది వాడేందుకు ఆసక్తి చూపుతారు. ఈ మాస్కుల్లో అనేక రకాల పోషకాలు అందుబాటులో ఉంటాయి. ఇవి మీ జట్టును సున్నితంగా చేయడం మాత్రమే కాకుండా మెరిసేలా కూడా చేస్తాయి. ఈ మాస్క్ ను పెట్టి 15-30 నిమిషాల వరకు అలా మీ జట్టును వదిలేయండి. ఆ తర్వాత వాష్ చేసుకుంటే మీ జట్టు చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. 
  2. షాంపూ: మనకు మార్కెట్లో ఎన్నో రకాల షాంపూలు కనిపిస్తాయి. ప్రతి రోజు మనం చాలా రకాల షాంపూలను చూస్తాం. కానీ ఎటువంటి షాంపూను కొనుగోలు చేయాలనే విషయంలో తర్జన భర్జన పడుతుంటాం. ఎందుకంటే చాలా రకాల షాంపూలలో కెమికల్స్ ఉంటాయి. అవి మీ జట్టుకు అనారోగ్యాన్ని కలుగజేస్తాయి. అందుకోసమే ఏ షాంపూ పడితే ఆ షాంపూను మనం వాడకుండా మంచి నాణ్యమైన షాంపూనే ఎంచుకోవాలి. ఎటువంటి పారాబెన్ లు లేని షాంపూని మనం ఎంచుకోవాలి. ఇందులో ఒక ప్రత్యేకమైన కార్బోహైడ్రేట్ కాంప్లెక్స్ ఉంటుంది. ఇది మీ జట్టును సాఫ్ట్ గా శుభ్రపర్చడం మాత్రమే కాకుండా తేమను తిరిగి అందిస్తుంది. మీ జట్టు షైనింగ్ వచ్చేలా చేస్తుంది. కావున మంచి హైడ్రేటెడ్ షాంపూని ఉపయోగించడం చాలా ముఖ్యం. అలా కాకుండా ఇష్టం వచ్చిన విధంగా ఏ షాంపూ పడితే ఆ షాంపూని వాడితే మన జట్టు అనారోగ్యంగా తయారవుతుంది.
  3. కండీషనర్: కండీషనర్ అనేది మీ జట్టుకు ఒక గేమ్ చేంజర్ లా పని చేస్తుంది. హెయిర్ మాస్క్ ను ఉపయోగించేందుకు కండీషనర్ ను తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇది మీ జట్టుకు మంచి హైడ్రేషన్ ను అందిస్తుంది. కండీషనర్ వల్ల వచ్చిన హైడ్రేషన్ చాలా సేపటి వరకు ఉంటుంది. ఇందులో అనేక రకమైన పోషకాలు ఉంటాయి. అవి జట్టు కుదుళ్లకు బలాన్ని ఇస్తాయి. మీ జట్టుకు కండీషనర్ ను అప్లై చేసిన తర్వాత కొన్ని నిమిషాల పాటు దానిని అలాగే వదిలేయండి. మీ జట్టును తర్వాత క్లీన్ చేయండి. కండీషనర్ చేసే మ్యాజిక్ ను మీరు చూస్తారు.
  4. సీరం: హెయిర్ సీరంలు చాలా లైట్ గా ఉంటాయి. తక్షణం హైడ్రేషన్ అవసరం అయితే వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిని జట్టుకు అప్లై చేసిన వెంటనే జట్టు హైడ్రేటెడ్ గా అవుతుంది. ఈ సీరంలు మీ జట్టును బలోపేతం చేయడం మాత్రమే కాకుండా అవి జట్టును మరింత షైన్ గా మెరిసేలా చేస్తాయి. చాలా స్మూత్ ఫీలింగ్ ను మీకు కలిగేలా చేస్తాయి. మీరు పొల్యూషన్ లో తిరిగినా కానీ మీ జట్టును పాడవకుండా ఈ సీరమ్స్ కాపాడతాయి.

కేవలం ఈ ప్రొడక్టులు మాత్రమే కాకుండా నేడు ఆన్ లైన్ లో అనేక ప్రొడక్టులు అందుబాటులో ఉంటున్నాయి. ఏ ప్రొడక్టు తీసుకున్నా అందులో వేటిని ఉపయోగించారనే సమాచారం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత దానిని వాడాలి. అలా కాకుండా ఆదరాబాదరాగా వాడితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.