నడుము నొప్పికి కారణాలు ఇవే కావచ్చు

ఎంతోమంది ఆడవాళ్ళ నుంచి మగవారి వరకు, చిన్న నుంచి పెద్ద వరకు చాలామంది అనేక రకాల నడుము నొప్పులతో బాధపడుతున్నారు. వీటికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ, ఒక్కో రకమైన నడుము నొప్పికి ఒక్కో రకమైన ఉపశమనం కలిగించే మంచి ఉపాయాలు ఈరోజు తెలుసుకుందాం.. అంతకన్నా ముందు నడుం నొప్పి ఎందుకు వస్తుంది అనే దాని గురించి ఒకసారి తెలుసుకుందాం.. నడుము నొప్పికి కారణాలు:  • ఎక్కువసేపు కూర్చోవడం, పిల్లలను ఎత్తడం లేదా అతిగా వ్యాయామం చేయడం వంటి […]

Share:

ఎంతోమంది ఆడవాళ్ళ నుంచి మగవారి వరకు, చిన్న నుంచి పెద్ద వరకు చాలామంది అనేక రకాల నడుము నొప్పులతో బాధపడుతున్నారు. వీటికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ, ఒక్కో రకమైన నడుము నొప్పికి ఒక్కో రకమైన ఉపశమనం కలిగించే మంచి ఉపాయాలు ఈరోజు తెలుసుకుందాం.. అంతకన్నా ముందు నడుం నొప్పి ఎందుకు వస్తుంది అనే దాని గురించి ఒకసారి తెలుసుకుందాం..

నడుము నొప్పికి కారణాలు: 

• ఎక్కువసేపు కూర్చోవడం, పిల్లలను ఎత్తడం లేదా అతిగా వ్యాయామం చేయడం వంటి రోజువారీ కారకాలు సాధారణ వెన్నునొప్పికి ఏ అవకాశం ఉంది

• ముఖ్యంగా వాటర్ ఫాల్స్ వంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నీటిలో తగిలిన కొన్ని గాయాలు కూడా వెన్నునొప్పికి దారితీస్తాయని నిపుణులు చెప్పారు.

• వెన్నెముక ఎముకల మధ్య కుషన్‌లుగా పనిచేసే ఇంటర్‌వెర్టెబ్రల్ డిస్క్‌లతో సమస్యలు, వాటి మధ్యలో క్రాక్ రావడం వల్ల లేదా ఉబ్బినప్పుడు అసౌకర్యాన్ని కలిగిస్తాయి, దీని కారణంగా నరాలు కాస్త మధ్యలో కాస్త నలగడం వల్ల మరియు వెన్ను మరియు కాలు నొప్పిని కలిగించవచ్చు.

• మనం పెద్దయ్యాక, వెన్నెముకలోని వివిధ ప్రాంతాలను ప్రభావితం చేస్తూ, డిజెనరేటివ్ డిస్క్ డిసీజ్ మరియు లంబార్ ఆర్థరైటిస్ వంటి వేర్-అండ్-టియర్ పరిస్థితులు కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు

• వెన్నెముక మరియు పొత్తికడుపును కలుపుతున్న కీళ్లలో వాపు, సాక్రోయిలిటిస్ అని పిలుస్తారు, ఇది నడుము నొప్పినే కాకుండా, పై కాళ్ళలో నొప్పిని కూడా కలిగిస్తాయి. 

ఇలా నడుము నొప్పి తగ్గించుకోండి: 

1. అయితే చాలామంది బెడ్ రెస్ట్ తీసుకుంటే నడుము నొప్పి తగ్గిపోతుందని అనుకుంటుంటారు. కానీ ఎక్కువసేపు పడుకోవడం కూడా నడుముని ఇబ్బంది కలిగించే విషయం అంటున్నారు నిపుణులు. అయితే సరైన మెడిటేషన్ వాడడం ద్వారా దీర్ఘకాలిక నడుం నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది అంటున్నారు. 

2. ముఖ్యంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, యోగా చేయడం వంటివి చేస్తూ ఉంటే మన వెన్నుముక బలపడి నడుం నొప్పి వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వెన్నుముక చుట్టూ ఉండే మజిల్స్ స్ట్రెంత్ పెరగడానికి వ్యాయామం బాగా పనిచేస్తుంది. కానీ వ్యాయామ సమయాలను మనం సరిగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. అతిగా వ్యాయామం చేసినా సరే నడుము నొప్పికి కారణం అంటున్నారు నిపుణులు. 

3. మరీ ఎక్కువ దీర్ఘకాలిక నడుమునొప్పి వచ్చినట్లయితే, వాటికి ఖచ్చితంగా మునుపు యాక్సిడెంట్లో తగిలిన గాయాలు అవ్వచ్చు, సరిగ్గా నిటారుగా కూర్చోకపోవడం, స్ట్రెస్ ఎక్కువగా ఉండటం వంటివి కారణాలు కావచ్చు. అయితే వీటన్నిటికీ మనం తప్పకుండా సర్జరీ మాత్రమే సరైన మార్గం అనుకుంటే పొరపాటే, ప్రతి నడుము నొప్పికి సర్జరీ అనేది మార్గం కాదు కాబట్టి, నాన్ సర్జరీ ట్రీట్మెంట్స్ ముందుగా ప్రయత్నించి చూడాలి, ఒకవేళ అది కుదరకపోతే అప్పుడు స్పెషలిస్ట్ ద్వారా సర్జరీ వరకు వెళ్లొచ్చు.

నడుము నొప్పి కేసులు ఎందుకు ఎక్కువయ్యాయి: 

ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడడం, వంగడం లేదా ఎత్తడం వంటి వృత్తిపరమైన పనుల కారణంగా వెన్నునొప్పి రావడం సాధారణ విషయమని YLDలను ఇది ఆపాదించింది. ప్రపంచవ్యాప్తంగా వైకల్యం మరియు గణనీయమైన సామాజిక మరియు ఆర్థిక భారం ఉన్నప్పటికీ, ప్రపంచ ఆరోగ్య ఎజెండాలో, వెన్ను నొప్పులకు శాశ్వత పరిష్కారం, అంతేకాకుండా వెళ్ళినొప్పి ఈ సమస్యలను తగ్గించే క్రమం ఇందులో కనిపించడం లేదని PHFI యొక్క దండోనా చెప్పారు.

భారతదేశంలో, నొప్పిని తాగించుకోవడానీకి ప్రజలు అనుసరించే మార్గాలను డాక్యుమెంట్ చేయడంలో మనం పెట్టుబడి పెట్టాలి. ఇలా చేయడం ద్వారా జనాభాలో నడుము నొప్పి నివారణ వ్యూహాలను రూపొందించడం, కార్యాలయాల పనుల కారణంగా వచ్చే వెన్నునొప్పిని తగ్గించడం, తగిన పునరావాస సేవల లభ్యతను సులభతరం చేస్తాయి, అని చెప్తున్నారు నిపుణులు.