PCOS ఉంటే.. గర్భం రావడానికి సరైన వయస్సు ఏంటో తెలుసుకుందాం

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) అనేది సంతానోత్పత్తికి సంబంధించిన హార్మోన్ల సమస్య. మీకు PCOS ఉంటే.. మీ శరీరంలో ఆండ్రోజెన్ అనే హార్మోన్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.  PCOS కారణంగా పీరియడ్స్ సరిగ్గా రాకపోవచ్చు. సహజంగా గర్భం వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. PCOSతో అండాశయం యొక్క బయటి అంచున అనేక చిన్న చిన్న సంచులు అభివృద్ధి చెందుతాయి. వీటిని సిస్ట్‌లు అంటారు. చిన్న ద్రవంతో నిండిన తిత్తులలో అపరిపక్వఅండాలు ఉంటాయి. వీటిని ఫోలికల్స్ […]

Share:

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) అనేది సంతానోత్పత్తికి సంబంధించిన హార్మోన్ల సమస్య. మీకు PCOS ఉంటే.. మీ శరీరంలో ఆండ్రోజెన్ అనే హార్మోన్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.  PCOS కారణంగా పీరియడ్స్ సరిగ్గా రాకపోవచ్చు. సహజంగా గర్భం వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.

PCOSతో అండాశయం యొక్క బయటి అంచున అనేక చిన్న చిన్న సంచులు అభివృద్ధి చెందుతాయి. వీటిని సిస్ట్‌లు అంటారు. చిన్న ద్రవంతో నిండిన తిత్తులలో అపరిపక్వఅండాలు ఉంటాయి. వీటిని ఫోలికల్స్ అంటారు. దీంతో ఫోలికల్స్ క్రమం తప్పకుండా అండాలను విడుదల చేయవు.

PCOS అనేది ఇది ఆడవారికి ఒక ప్రమాదం లాంటిది. దీంతో భారతదేశంలోని ప్రతి 5గురిలో ఒక మహిళ ఈ PCOS తో బాధపడుతోంది. ఇది పునరుత్పత్తి మరియు సంతానోత్పత్తిపై చాలా చిక్కులను కలిగిస్తుంది. ఎందుకంటే ఇది పిల్లలను కనే వయస్సులో ఉన్న మహిళలకు సంభవిస్తుంది. పిసిఒఎస్‌తో బాధపడటం వలన పీరియడ్స్ సరిగా రాకపోవడం, హార్మోన్లకు అంతరాయాలు కలిగించడం, ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, ఈ సమస్యతో బాధపడే స్త్రీలు గర్భం దాల్చడానికి కూడా ఇబ్బంది పడతారు. ఒక్కోసారి దీని తీవ్రత వల్ల అనేక సంతానోత్పత్తి సమస్యలను కూడా కలిగిస్తుంది. కొన్ని పరిశోధనలు ప్రకారం..  చాలా మంది మహిళలు ఈ సమస్య గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనే వరకు తమకు PCOS ఉందని గ్రహించలేరు.  

PCOS సంతానోత్పత్తిని సహజంగా గర్భం వచ్చే అవకాశాలను ఎందుకు ప్రభావితం చేస్తుంది?

PCOS అనేది.. హార్మోన్ల రుగ్మత, ఇది గర్భాశయంలో తిత్తులు ఏర్పడటానికి దారితీస్తుంది. ఇది గర్భవతిని పొందడం కష్టతరం చేస్తుంది, ఎందుకంటే తిత్తులు అండాశయాల నుండి అండాల విడుదలకు ఆటంకం కలిగిస్తాయి. ఇక హార్మోన్ల అసమతుల్యత సాధారణం కంటే.. అండాల కౌంట్ యొక్క పెరుగుదల ఫోలికల్ బ్రేక్‌డౌన్‌కు దారితీస్తుంది. ఇది గర్భవతి అయిన తర్వాత కూడా స్త్రీల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. PCOS, ఊబకాయం వంటి ఇతర సమస్యలతో బాధపడుతున్న స్త్రీలు గర్భం దాల్చడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. కొన్ని అధ్యయనాలు కూడా..  పిసిఒఎస్ కలిగిన వారు..  గర్భవతి అయిన తర్వాత కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నాయి.

పిల్లలు కావాలనుకునే మహిళలకు ఈ సమస్య ఉన్నట్లయితే, సహజంగా గర్భం దాల్చడం సాధ్యం కాదు.  ఒక మహిళ వయస్సు 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నట్లయితే వారికి  PCOS మరిన్ని సమస్యలు కలిగిస్తాయని  నిపుణులు సూచిస్తున్నారు. అనగా.. 32 ఏళ్ల తర్వాత సంతానోత్పత్తి స్థాయిలు క్షీణించడం ప్రారంభిస్తాయి, ఇక 37 ఏళ్ల తర్వాత సంతానోత్పత్తి స్థాయి క్షీణత మరింత పెరుగుతుందని అన్నారు.  పిసిఒఎస్‌తో బాధపడుతున్న మహిళలకు సహజంగా గర్భం దాల్చడానికి అత్యధిక అవకాశాలు 35 ఏళ్లలోపులోనే ఉంటాయని అన్నారు. ప్రాథమిక పారామితులు అదుపులో ఉన్నట్లయితే, ఒక సంవత్సరంలోపు గర్భధారణ జరుగుతుంది. అయినప్పటికీ, ఒక జంట ఈ సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటే, వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇక పిసిఒఎస్‌తో బాధపడుతున్న 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న స్త్రీలకు సంతానోత్పత్తి చికిత్సల సహాయం అవసరం కావచ్చు.

PCOS ఉన్నవారిలో, గర్భధారణ అవకాశాలను పెంచడానికి ఏమి చేయాలి?

పిసిఒఎస్‌ ఉన్నవారు, గర్భవతి కావడం సుదీర్ఘమైన, ఎంతో భయంకరమైన మార్గం. గర్భం కోసం కొంతమంది మహిళలకు కృత్రిమ సహాయం (IVF లేదా IUI) అవసరం. అయితే, కొన్ని పరిష్కారాలు, చిట్కాలు స్త్రీ తనంతట తానుగా గర్భవతి కావడానికి సహాయపడతాయి.

  • బరువు తగ్గడం
  • మంచి ఆహారం మరియు జీవనశైలిని అనుసరించడం
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం
  • తరచుగా సెక్స్ చేయడం (ఐదు రోజుల అండోత్సర్గము వరకు)
  • అండోత్సర్గ సమయాలను పర్యవేక్షించడం (మీకు పీరియడ్స్ అరుదుగా ఉంటే) మరియు తదనుగుణంగా లైంగిక సంపర్క సమయాన్ని నిర్ణయించడం
  • వైద్యుల సలహా మేరకు సంతానోత్పత్తి మందులు తీసుకోవడం
  • మీకు PCOS ఉన్నప్పుడు చూడవలసిన గర్భం యొక్క సంకేతాలు

పిసిఒఎస్‌ ఉన్నవారిలో కనిపించే మొదటి లక్షణం.. సక్రమంగా పీరియడ్స్ రాకపోవడం లేదా తక్కువ సమయంలోనే  పీరియడ్స్ రావడం. దీంతో గర్భం యొక్క సంకేతాలను గుర్తించడం స్త్రీలకు మరింత కష్టతరం అవుతుంది. మీరు గర్భం ధరించడానికి ప్రయత్నిస్తుంటే అండోత్సర్గము జరిగే రోజులను ట్రాక్ చేయడం కూడా కష్టం. అటువంటి స్థితిలో గర్భం ధరించామేమోనని అనుమానం వచ్చినప్పుడు.. PCOS మరియు గర్భధారణ లక్షణాల మధ్య తేడాను గుర్తించడంలో సహాయపడే కొన్ని ముందస్తు సంకేతాలు ఇక్కడ ఉన్నాయి

  • అలసట పెరగటం
  • వక్షోజాలలో పుండ్లు పడడం
  • తలనొప్పి
  • మూడ్ స్వింగ్స్ పెరగడం
  • నడుము నొప్పి

గర్భం దాల్చే అవకాశాలు మరియు దానికోసం తీసుకోవలసిన చర్యల గురించి తెలుసుకోవడానికి సంబంధిత వైద్యుడిని సంప్రదించండి.