గోధుమ గ‌డ్డి జ్యూస్.. ఎన్ని లాభాలో తెలుసా?

ప్రస్తుతం ఉన్న ఉరుకులు పరుగులు జీవితంలో చాలా మంది ఆరోగ్య విషయాన్ని పక్కన పెడుతున్నారు. సమయానికి తినకపోవడం, ఎక్కువగా షుగర్ పదార్థాలు తినడం, పిండి పదార్థాలు ఎక్కువగా తినడం, బయట జంక్ ఫుడ్, సమయాన్ని పాటించకపోవడం డయాబెటిస్ రావడానికి ముఖ్యకారకాలు. ఒక్కసారి డయాబెటిస్ వచ్చిందంటే జీవితాంత కాలం మోస్తూ ఉండాలంటారు చాలామంది. అయితే డయాబెటిస్ నివారించేందుకు మన లివర్ ని డిటాక్సింగ్ చేసుకోవడం ద్వారా కూడా నివారించవచ్చని రీసెర్చ్ చెప్తుంది. అయితే ఇటీవల జరిగిన మరో రీసెర్చ్ […]

Share:

ప్రస్తుతం ఉన్న ఉరుకులు పరుగులు జీవితంలో చాలా మంది ఆరోగ్య విషయాన్ని పక్కన పెడుతున్నారు. సమయానికి తినకపోవడం, ఎక్కువగా షుగర్ పదార్థాలు తినడం, పిండి పదార్థాలు ఎక్కువగా తినడం, బయట జంక్ ఫుడ్, సమయాన్ని పాటించకపోవడం డయాబెటిస్ రావడానికి ముఖ్యకారకాలు. ఒక్కసారి డయాబెటిస్ వచ్చిందంటే జీవితాంత కాలం మోస్తూ ఉండాలంటారు చాలామంది. అయితే డయాబెటిస్ నివారించేందుకు మన లివర్ ని డిటాక్సింగ్ చేసుకోవడం ద్వారా కూడా నివారించవచ్చని రీసెర్చ్ చెప్తుంది. అయితే ఇటీవల జరిగిన మరో రీసెర్చ్ ద్వారా మన శరీరంలో ఉండే టీ సెల్స్ డయాబెటిస్ నివారణకి కూడా సహాయపడతాయని తేలింది. మరి ఇప్పుడు ఆ విషయాలు ఏంటో తెలుసుకుందామా.. 

గోధుమ గ‌డ్డితో లివర్ డిటాక్సేషన్: 

ప్రతిరోజూ గోధుమ గ‌డ్డి అంటే గోధుమ ల నుంచి వచ్చే మొలకలతో కూడిన పచ్చ గడ్డి అని చెప్పుకోవచ్చు. అయితే ప్రొద్దున్నే లేవగానే ఈ వీట్ గ్రాస్ శరీరంలో ఆహారం ద్వారా గాని, ముఖ్యంగా జ్యూస్ గానే తీసుకుంటే కనుక మన ఆరోగ్యం మెరుగు పడుతుందంటూ అంతేకాకుండా, మన శరీరంలో డయాబెటిస్ బ్లడ్ ప్రెషర్ లాంటివి కంట్రోల్లో ఉంటాయని తేలింది. 

ముఖ్యంగా వీట్ గ్రాస్ లో విటమిన్స్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, అమినో ఆసిడ్స్ అంతేకాకుండా అలాగే ఎన్నో రకాల న్యూట్రియన్స్ ఉండడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే అల్పాహారం తీసుకోక ముందే మనం వీట్ గ్రాస్ జ్యూస్ లా చేసుకుని తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. 

ముఖ్యంగా మన లివర్ కి సంబంధించిన టాక్సిక్ లెవెల్స్ కూడా తగ్గించే మంచి గుణం వీట్ గ్రాస్ లో ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా వీట్ గ్రాస్ లో ఉండే కోలైన్, అలాగే అనేక రకాలైన మినరల్ కంటెంట్ ఉండడం ద్వారా లివర్ డిటాక్సింగ్ అనేది ఈజీగా జరుగుతుంది. ముఖ్యంగా హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్లకు వీట్ గ్రాస్ అనేది ఒక స్వచ్ఛమైన మెడిసిన్ ల పనిచేస్తుంది. ముఖ్యంగా మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ని దూరం చేసి హయ్ బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది.

టి సెల్స్ తో నివారణ: 

చిన్నవయసు నుండే అంటే బాల్యం లేదా యుక్తవయస్సులోనే టైప్ 1 డయాబెటిస్ కంప్లైంట్ వినిపిస్తుంది, వీరికి జీవితకాల ఇన్సులిన్ అవసరం కచ్చితంగా ఉంటుంది. ఇలాంటి టైప్ 1 డయాబెటిస్ రావడాన్ని ఆలస్యం చేయడానికి రోగనిరోధక వ్యవస్థ నాశనం అవసరం ఆయన సెల్స్ ని నాశనం చెయ్యకుండా చికిత్స ఆమోదించబడినప్పటికీ, అవసరం ఉన్న పేషంట్స్ లని గుర్తించడం సవాలుగా ఉంది. యాంటీ-ఐలెట్ యాంటీబాడీస్‌పై ఆధారపడే సాంప్రదాయ పద్ధతులు ఆటో ఇమ్యూన్ పురోగతిని అంచనా వేయడంలో నమ్మదగినవి కాదని తేలింది. టైటన్ టైప్ 1 డయాబెటిస్ అభివృద్ధిలో టి సెల్స్ కణాల కీలక పాత్ర పోషిస్తాయని నొక్కి చెప్పారు. 

రీసెర్చ్ ప్రకారం చెప్పాలంటే, టేటన్ టీం ఆటో ఇమ్యూన్ ప్రోటీన్లు మరియు ఇన్సులిన్ పదార్ధాల మిశ్రమం లాగా  ఉండే ప్రోటీన్ కాంప్లెక్స్‌లను నిర్మించింది, ఇవి ప్రత్యేకమైన సిడి4 టి సెల్స్లో తమకు తామే ప్రతిరక్షక ప్రతిస్పందనను, అంటే రోగాన్ని తగ్గించే ప్రక్రియను ప్రేరేపిస్తాయి. ఈ కాంప్లెక్స్‌లను ఎరగా ఉపయోగించి, వారు రక్త నమూనాల నుండి యాంటీ ఇన్సులిన్ సిడి4 టి సెల్స్ లను పట్టుకున్నారు. ఇలా సేకరించిన టి సెల్స్లో జన్యు మార్పులు, వాటి వలన సంభవించే ప్రోటీన్ ఎలా పనిచేస్తాయో అనాలసిస్ ద్వారా, ఈ  యాంటీ-ఐలెట్ ఆటో ఇమ్యూనిటీతో ప్రమాదంలో ఉన్న రోగులను గుర్తించడానికి పరిశోధకులు వర్గీకరణ అల్గోరిథంను అభివృద్ధి చేశారు.