Hug: ఆలింగ‌నంతో ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

స్నేహితులైన, బంధువులైన, మిత్రులందరికీ, ప్రేమకులు (Love), భార్యాభర్తలు ఆఖరికి శత్రువులైన (Enemy) సరే ఒక్క క్షణంలో మారిపోవడానికి ఎదుటివారిని హగ్ (Hug) చేసుకుంటే చాలు, వాళ్ళు ఎంతటి వారైనా మారిపోవాల్సిందే. శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో ఎదుటివారిని కౌగిలించుకొని మనస్ఫూర్తిగా మాట్లాడటం ద్వారా ఎంతటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది అని ఉంటుంది.. నిజానికి అది అక్షరాల నిజం.  హగ్ చేసుకోండి:  ఎదుటివారిని హగ్ (Hug) చేసుకోవడం అనేది.. ప్రేమ (Love), ఆప్యాయత మరియు మద్దతును వ్యక్తీకరించే అత్యంత […]

Share:

స్నేహితులైన, బంధువులైన, మిత్రులందరికీ, ప్రేమకులు (Love), భార్యాభర్తలు ఆఖరికి శత్రువులైన (Enemy) సరే ఒక్క క్షణంలో మారిపోవడానికి ఎదుటివారిని హగ్ (Hug) చేసుకుంటే చాలు, వాళ్ళు ఎంతటి వారైనా మారిపోవాల్సిందే. శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో ఎదుటివారిని కౌగిలించుకొని మనస్ఫూర్తిగా మాట్లాడటం ద్వారా ఎంతటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది అని ఉంటుంది.. నిజానికి అది అక్షరాల నిజం. 

హగ్ చేసుకోండి: 

ఎదుటివారిని హగ్ (Hug) చేసుకోవడం అనేది.. ప్రేమ (Love), ఆప్యాయత మరియు మద్దతును వ్యక్తీకరించే అత్యంత అందమైన మార్గాలలో ఒకటి. భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఏదైనా సంబంధం (Relation)లో, కౌగిలింత సాధారణమైనవి. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంలో కూడా సహాయపడతాయి. ఒకరినొకరు హగ్ (Hug) చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని సైన్స్ చూపిస్తుంది. ఇది మీకు మరియు మీ ఎదుట ఉన్న వ్యక్తికి మధ్య బంధాన్ని (Relation) బలపరుస్తుంది. ఇది మీ మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఆక్సిటోసిన్ పెరుగుతుంది, ఇది మీ గుండె (Heart) ఆరోగ్యానికి (Health) మంచిది. అలాగే, ఇది అధిక ఒత్తిడి స్థాయిల నుండి రక్షిస్తుంది అని సైకాలజిస్ట్ రాశారు. నిజానికి హగ్ (Hug) చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు గుర్తించారు. 

హగ్గింగ్ ఎండార్ఫిన్‌ల విడుదలలో సహాయపడుతుంది. దీనివల్ల మనకు ఉన్న ఎటువంటి నొప్పి నుండి అయినా సరే ఉపశమనం పొందుతుంది. అందుకే ఎదుటివారిని నొప్పి నుండి బయట పడేయడానికి.. తమకంటూ మేమున్నామని చెప్పడానికి హగ్ చేసుకోవడం మంచి మార్గం. 

మన అనుకున్న వారిన దగ్గర చేస్తుంది:

హగ్ (Hug) చేసుకోవడం అనేది మరొకరి సహవాసంలో సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుంది. దీని ద్వారా మనలో ఉన్న ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. మనం ఎంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ, ఎదుటివారు మనల్ని ఆప్యాయంగా హగ్ (Hug) చేసుకోవడం వల్ల స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందుతాము. ఇది బలమైన బంధం (Relation).. సాన్నిహిత్యంతో, ఆరోగ్యకరమైన (Health)  సంబంధానికి (Relation) నాంది పలుకుతుంది ఈ హగ్ (Hug). ఎదుట వారు ఎంత కఠిన మనుషులైనా సరే, మన చిరునవ్వుతో హగ్ (Hug) చేసుకుంటే కఠిన మనస్సు కూడా కరిగిపోతుంది. ముఖ్యంగా బంధాలు (Relation), ఆప్యాయతలు పెరుగుతాయి. 

మనం బాధలో ఉన్న ఎదుట వ్యక్తిని హగ్ (Hug) చేసుకోవడం వల్ల ఒంటరితనం అనుభూతిని సెకనులో దూరం చేస్తుంది. ఎదుటివారిని హగ్ (Hug) చేసుకోవడం వల్ల చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరైనా సరే.. తమకు ఒక అండ ఉందని భావిస్తారు. హగ్ (Hug) చేసుకోవడం అనేది మన శరీరం ఆక్సిటోసిన్ స్థాయిలను విడుదల చేయడంలో సహాయపడతాయి. ముఖ్యంగా మన గుండె (Heart) ఆరోగ్యాన్ని (Health) మెరుగుపరుస్తుంది. హగ్గింగ్ హృదయ స్పందన రేటును తగ్గించడంలో సహాయపడుతుంది మరియు మనల్ని ప్రశాంతంగా, మనసు తేలికగా అనుభూతి చెందుతుంది. అంటే ఎదుటివారు మన మీద చూపిస్తున్న ఆప్యాయత ప్రేమ (Love) మనకి స్పష్టంగా తెలియడం వల్ల  మనకి మనోధైర్యం పెరుగుతుంది. ప్రశాంతతకు దారి తీస్తుంది.

అందుకే ఎదుటివారిని ముఖ్యంగా మన అనుకున్న మన మిత్రులను, బంధువులను, స్నేహితులను, ఆఖరికి శత్రువులను (Enemy) కూడా మంచి మార్గంలో నడిపించేందుకు, వారి కఠిన మనసులను మార్చేందుకు, ఆప్యాయతను పంచడానికి, ప్రేమ (Love)ను గుర్తించేలా చేయడానికి ఒక ఆప్యాయంగా ఇచ్చే హగ్ చాలు.