చీమలకు తిండి పెట్టడం వల్ల ఎటువంటి ఫలితాలుంటాయి

చీమలకు ఆహారం పెట్టడం వల్ల ఉద్యోగంలో వృద్ధి, పురోగతి కలుగుతాయి ఏ చీమలు శుభప్రదమైనవి హిందువులు ప్రతి జీవినీ గౌరవిస్తారు. దేవతలు భూమిపై ఉన్న అనేక జీవరాశుల రూపంలో  ఉంటారని భావిస్తారు. అలాగే ఈ జీవరాశులకు సేవ చేయడం మానవ ధర్మమని మనవాళ్ళు నమ్ముతారు. ఇలా భగవంతుని అనుగ్రహాన్ని పొందే సూక్ష్మజీవులలో చీమ ఒకటి. చీమలకు చాలా బలం ఉంటుందని అందరూ చెబుతారు. ఒక చీమ తనకంటే ఎన్నో రెట్లు ఎక్కువ బరువున్న వస్తువులను కూడా మోసుకుంటూ […]

Share:

చీమలకు ఆహారం పెట్టడం వల్ల ఉద్యోగంలో వృద్ధి, పురోగతి కలుగుతాయి

చీమలు శుభప్రదమైనవి

హిందువులు ప్రతి జీవినీ గౌరవిస్తారు. దేవతలు భూమిపై ఉన్న అనేక జీవరాశుల రూపంలో  ఉంటారని భావిస్తారు. అలాగే ఈ జీవరాశులకు సేవ చేయడం మానవ ధర్మమని మనవాళ్ళు నమ్ముతారు. ఇలా భగవంతుని అనుగ్రహాన్ని పొందే సూక్ష్మజీవులలో చీమ ఒకటి. చీమలకు చాలా బలం ఉంటుందని అందరూ చెబుతారు. ఒక చీమ తనకంటే ఎన్నో రెట్లు ఎక్కువ బరువున్న వస్తువులను కూడా మోసుకుంటూ వెళ్లగలదు. ఇక చీమలకు ఉన్న పట్టుదల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువగానే ఉంటుంది. 

ప్రతి ఒక్కరి ఇంట్లో చీమలు ఉంటాయి. చీమలను విష్ణుమూర్తికి చిహ్నంగా భావిస్తారు. అందుకోసమే చాలా మది చీమలను చంపాలన్నా కానీ ఆలోచిస్తుంటారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కట్టదు అని తెలుగులో పాపులర్ సామెత ఉంది.. ఇది మీకు తెలిసే ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి నల్ల చీమల సంబంధం గురించి చెప్పబడింది. చీమలకు తిండి పెట్టడం భగవంతుడిని సేవించడంతో సమానమని పెద్దలు అంటుంటారు. శ్రమశక్తికి, సమూహ శక్తికి ప్రతీకగా నిలిచే చీమలు ఎంతో శుభప్రదమైనవని చెబుతారు.

చీమలకు తిండి ఎందుకు పెట్టాలో చూద్దాం.

పద్మ పురాణంలో చీమలు భగవంతుడు శ్రీ హరికి ఇష్టమైన జీవులుగా వర్ణించబడ్డాయి. చీమలకు తిండి పెట్టడం ద్వారా ప్రతికూల ఆలోచనలు, దురదృష్టకర సంబంధాల నుండి విజయవంతంగా విముక్తి పొందవచ్చని చెప్పబడింది. అందువలన దేవతలకి ఆహారాన్ని సమర్పించడానికి ఒక సాధనంగా చీమలు ఉన్న చోట పిండిని వేస్తారు. చీమలకు పిండి మాత్రమే కాకుండా బెల్లం, చక్కెర కూడా తినిపిస్తారు. చీమలను దేవుడికి ప్రతిరూపాలుగా భావిస్తారు కాబట్టే వాటికి అవసరమైన తిండిని ఇచ్చి గౌరవిస్తుంటారు. 

నల్ల చీమలు శని దేవుడిని సూచిస్తాయి. శనివారం నల్ల చీమలకు పిండిని ఇవ్వడం ద్వారా శని దోషాన్ని తగ్గించి శనిదేవుని అనుగ్రహాన్ని పొందగలరు. శనివారం నాడు బియ్యపు పిండిని పంచదార లేదా బెల్లంతో కలిపి చీమలకు పెట్టడం ద్వారా శనిగ్రహ ప్రభావం వల్ల కలిగే ప్రతికూల పరిణామాల నుండి ఉపశమనం పొందవచ్చు.

బియ్యపు పిండిలో పంచదార కలిపి చీమలకు తినిపిస్తే వాటి దురదృష్టం నశించి ఋణం తీరిపోతుందని అంటారు. ఎవరైనా ఒక వ్యక్తి తనకు దేని వల్లనైనా ప్రమాదం ఉన్నట్లు భావిస్తే.. అలాంటి వ్యక్తి ప్రతిరోజు చీమలకు పిండిని చల్లడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

ఎవరి ఇంట్లోనైనా ప్రతికూల శక్తి కారణంగా రోజూ గొడవలు, వాగ్వాదాలు ఉంటే ఎండు కొబ్బరి తురుముకి పంచదార కలిపి చీమలకు తినిపించాలి.

ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరకకపోతుంటే, అటువంటి వారు బాదంపప్పు పొడిని చీమలకు తినిపించాలి. ఇలా తినిపిస్తే వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు పెరుగుతాయని అంటారు. చీమలకు పిండి లేదా ఏదైనా ఆహార పదార్థాన్ని ఇస్తున్నప్పుడు దానిని తొక్కకుండా జాగ్రత్త పడాలి. లేకుంటే మనకు ఆశించిన ఫలితం లభించదు. అంతే కాకుండా ప్రతికూల ఫలితం వచ్చే అవకాశం ఉంది.

నల్ల చీమలు అదృష్టాన్ని తెచ్చిపెడతాయని, ఎర్ర చీమలు దురదృష్టానికి చిహ్నమని అంటారు. ఇంట్లో నల్ల చీమలు కనిపించినప్పుడు శుభం జరుగుతుందని, ఎర్ర చీమలు కనిపిస్తే డబ్బు నష్టానికి చిహ్నమని భావిస్తారు.

ఇదండీ చీమలు మనకు చేసే మేలు.