మొదటి చపాతీని ఆవుకి తినిపించడం వల్ల కలిగే ప్రయోజనాలు

మొదటి చపాతీ ఎప్పుడూ ఆవుకే ఎందుకు పెడతారుదైవానికి సమర్పించే నైవేద్యానికి సంబంధించిన వివరాలు హిందూ మతంలో గోవుకు తల్లి హోదా ఇవ్వబడింది. అందుకే ఆవును గో మాత అని సంబోధిస్తారు. పురాతన కాలం నుండి ఋషులు, మునుల నుంచి పెద్దపెద్ద రాజుల వరకు ఆవులను పెంచేవారు. ఇక హిందూ శాస్త్రాల ప్రకారం గోవులకు సేవ చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని విశ్వాసం.  ఆవును దేవుడిగా భావిస్తారు. పద్మ పురాణం ప్రకారం 33 కోట్ల మంది దేవుళ్లు, దేవతల […]

Share:

మొదటి చపాతీ ఎప్పుడూ ఆవుకే ఎందుకు పెడతారు
దైవానికి సమర్పించే నైవేద్యానికి సంబంధించిన వివరాలు

హిందూ మతంలో గోవుకు తల్లి హోదా ఇవ్వబడింది. అందుకే ఆవును గో మాత అని సంబోధిస్తారు. పురాతన కాలం నుండి ఋషులు, మునుల నుంచి పెద్దపెద్ద రాజుల వరకు ఆవులను పెంచేవారు. ఇక హిందూ శాస్త్రాల ప్రకారం గోవులకు సేవ చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని విశ్వాసం. 

ఆవును దేవుడిగా భావిస్తారు. పద్మ పురాణం ప్రకారం 33 కోట్ల మంది దేవుళ్లు, దేవతల ఆత్మలు ఆవు శరీరంలో ఉంటాయని గాఢంగా విశ్వసిస్తారు. అందుకే మనం మొదటి రోటీ(రొట్టె)ని ఆవుకి తినిపిస్తే దేవతలందరికీ ఆహారం అందించినట్టని గ్రంధాలలో చెప్పబడింది. ఇలా చేయడం వల్ల సకల దేవతల అనుగ్రహం లభించి కుటుంబ సామరస్యం, శ్రేయస్సు, సకల సంతోషాలు ఆ కుటుంబానికి సిద్ధిస్తాయని పెద్దలు చెబుతారు. మీరు దేవునికి నైవేద్యం సమర్పించినా లేదా గోమాతకి మొదటి రోటీని తినిపించినా రెండింటి ఫలితం ఒకటేనని మత గ్రంధాలలో చెప్పబడింది. అందుకే ఆవుకి రొట్టె, మేత ఇవ్వడం హిందూ మతంలో ఒక పవిత్రమైన చర్యగా ప్రశంసించబడింది.

గోవుకు రోటీ తినిపించడం వల్ల కలిగే ప్రయోజనాలు 

పద్మ పురాణంలో  ఆవు భూమిపై ఉన్న దేవతలకు చిహ్నమని వర్ణించబడింది. ఉదయం పూట పూజ చేయడం కుదరని పక్షంలో వంటగదిలో చేసే మొదటి చపాతీ, లేదా అన్నాన్ని  ఆవుకి తినిపించడం ద్వారా 33 కోట్ల దేవతలకు పూజించిన ఫలితం లభిస్తుంది.

‘ ఆవు అంటే కామధేనువు, అది మనిషి యొక్క అన్ని ఆకాంక్షలను సంతృప్తిపరుస్తుంది’ అని వేదాలలో పేర్కొన్నారు. అందువల్ల ఉదయం పూట చేసిన మొదటి రొట్టెను ఆవుకు పెట్టడం వల్ల అది మనకున్న అన్ని కోరికలను తీర్చి వరాలను ప్రసాదిస్తుందని చెబుతారు.

కుటుంబ శాంతి కోసం

కుటుంబంలో తరచుగా గొడవలు జరుగుతూ ఉంటే కుటుంబ శాంతి కోసం మీరు ప్రతిరోజూ ఉదయం మొదటి రోటీ లేదా మొదటి ముద్దను ఆవుకు తినిపించాలి. దీని వల్ల తరచూ జరిగే గొడవలు తగ్గి శాంతి నెలకొంటుందని నమ్ముతారు. గోమాతకి ఆహారం అందించడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి నెలకొనడంతో పాటు దేవతలు కూడా సంతోషంగా ఉంటారు.

ఆవుకి అన్నం తినిపించే ఇల్లు ధనమయమవుతుంది. గోవును సేవించే ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అదేవిధంగా ఆవుకు బెల్లం తినిపిస్తే ఇంటిలో సుఖం, శాంతి లభిస్తుంది. ఆవుకు పచ్చని పచ్చిక బయళ్లలో ఆహారం ఇచ్చినప్పుడు బుధుడి అనుగ్రహం లభించి మానవుడు అదృష్టాన్ని పొందుతాడు. అలాగే రొట్టెలలో శనగపప్పు, బెల్లం కలిపి ఆవుకు చేతితో తినిపించినప్పుడు బృహస్పతి శాంతించబడతాడు. కూర్చున్న ఆవుకి రోటీ, బెల్లం తినిపించడం మరింత శ్రేయస్కరం. ఆవుకు రోజూ రొట్టెలు తినిపించే వ్యక్తి యొక్క ప్రస్తుత తరాలతో పాటు భవిష్యత్ తరాలు కూడా పుణ్యాన్ని పొందుతాయని మరియు బాధలు నుండి రక్షించబడతాయని చెబుతారు.

గ్రహాల శాంతి కోసం

ఎవరి జాతకంలో అయితే శని లేదా రాహువు, కేతువు వంటి గ్రహాల దోషాలు ఉంటాయో, ఆ వ్యక్తి తన ఇంట్లో చేసిన మొదటి రోటిని ఆవుకి తినిపించడం వల్ల గ్రహాలు శాంతిస్తాయని మరియు దోషాల ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు.

చూశారుగా.. మనకు గోమాత వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో, ఆలస్యం చెయ్యకుండా వెంటనే ఈ విషయాన్ని మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు షేర్ చెయ్యండి