ఫేషియ‌ల్ మసాజ్ వల్ల కలిగే అద్భుతమైన లాభాలు ఇవే..!

ఫేషియ‌ల్ మసాజ్ ద్వారా మన ముఖ చర్మ సౌందర్యం అత్యంత కాంతివంతంగా తయారు చేసుకోవడానికి పనికొస్తుందనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ పురాతన పద్దతి ఇప్పుడు ఎంతో ప్రాచుర్యం లో ఉంది. లక్షలాది మంది ఈ పద్దతి ని అనుసరించి తమ ముఖ సౌందర్యాన్ని పరిరక్షించుకుంటున్నారు. స్కిన్ ఎక్స్పర్ట్స్ కూడా ఫేసియల్ ప్రక్రియ ని డైలీ రొటీన్ గా పరిగణించాల్సిందిగా చెప్తున్నారు. ఇలా చెయ్యడం వల్ల చర్మం ఎంతో ఆరోగ్యం గా అలాగే ప్రకాశవంతంగా తయారు […]

Share:

ఫేషియ‌ల్ మసాజ్ ద్వారా మన ముఖ చర్మ సౌందర్యం అత్యంత కాంతివంతంగా తయారు చేసుకోవడానికి పనికొస్తుందనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ పురాతన పద్దతి ఇప్పుడు ఎంతో ప్రాచుర్యం లో ఉంది. లక్షలాది మంది ఈ పద్దతి ని అనుసరించి తమ ముఖ సౌందర్యాన్ని పరిరక్షించుకుంటున్నారు. స్కిన్ ఎక్స్పర్ట్స్ కూడా ఫేసియల్ ప్రక్రియ ని డైలీ రొటీన్ గా పరిగణించాల్సిందిగా చెప్తున్నారు. ఇలా చెయ్యడం వల్ల చర్మం ఎంతో ఆరోగ్యం గా అలాగే ప్రకాశవంతంగా తయారు అవుతుంది. అయితే ఈ ఫేసియల్ మసాజ్ ని చేయించుకోవడానికి మనం ఎక్కువగా సెలూన్లను సందర్శిస్తుంటాము, కొంతమంది ఎందుకులే అంత ఖర్చు చెయ్యడం అని వీటి మీద అంత ఆసక్తి చూపించరు. కానీ ఇప్పుడు ఫేషియ‌ల్ మసాజ్ మన ఇంట్లోనే స్వయంగా చేసుకోవచ్చు, అంత సౌలభ్యం ఇప్పుడు దొరుకుంటుంది. దీనివల్ల బోలెడంత సమయం, మరియు ఖర్చు మిగులుతుంది. ఇది ఇలా ఉండగా ఫేషియ‌ల్ వల్ల కలిగే లాభాలను కొన్ని ఎక్సక్లూసివ్ గా మీ కోసం అందిస్తున్నాము చూడండి.

1) చర్మానికి రక్తప్రసరణ పెరుగుతుంది :

కొంతమందికి ముఖం కాంతివంతంగా లేదని తెగ బాధపడిపోతూ ఉంటారు. అలా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా?, చర్మం లో రక్త ప్రసరణ జరగకపోవడం వల్లే. ఫేసియల్ మసాజ్ చెయ్యడం వల్ల స్కిన్ సెల్స్ లో రక్త ప్రసరణ జరిగి, తగిన పోషణ లభించి ఉత్తేజ పరుస్తాయి. అందువల్ల యవ్వనం ఉట్టిపడే చర్మం మీ సొంతం అవుతుంది.

2) చర్మం పై ఉండే మచ్చలను కనపడకుండా చేస్తుంది :

ఫేషియ‌ల్ వల్ల కలిగే మరో అద్భుతమైన ప్రయోజనం ఇది. చాలా మంది చర్మ మడతలు , పైన్ లైన్స్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. తమ ముఖం చూపించుకోవడానికే కూడా ఇష్టపడరు. అలాంటి వారు తరచూ ఫేషియ‌ల్ చేసుకోవడం వల్ల మడతలు మరియు పైన్ లైన్స్ పూర్తిగా తొలగిపోతాయి. కళ్ళ చుట్టూ లగే నోటి చుట్టూ కలిగే మడతలను నివారించొచ్చు.

3) కొలాజెన్ ఉత్పత్తి :

మన చర్మం లో కొలాజెన్ తగ్గడం వల్ల చర్మం ఎన్నో సమస్యలకు గురి అవుతుంది. కాంతివంతం తగ్గిపోయే సంగతి పక్కన పెడితే కొత్త కొత్త వ్యాధులు ఈ కొలాజాన్ తగ్గుదల వల్ల సంభవిస్తాయి. తరచూ ఫేషియ‌ల్ చేసుకోవడం వల్ల ఈ కొలాజెన్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. తద్వారా చర్మ సమస్యలు మొత్తాన్ని మన అధిగమించొచ్చు.

4) చర్మం లోని ఎలాస్టిసిటీ ని పెంచుతుంది :

ఈ సహజసిద్ధమైన పద్దతి వల్ల మన చర్మం లోని ఎలాస్టిసిటీ బాగా పెరుగుతుంది. అంటే మన చర్మం బాగా బిగువుగా తయారు అవ్వుతుంది అన్నమాట. తద్వారా ఎప్పటికీ యవ్వనం గా కనిపిస్తాము. మన సినిమా ఇండస్ట్రీ లో ఉండే హీరో,హీరోయిన్ల చర్మ సౌందర్య రహస్యం ఇదే.

5) కళ్ళ క్రింద క్యారీ బ్యాగ్స్ ని అరికట్టుతుంది :

వాటర్ రిటెన్షన్ లేకపోవడం వల్ల మన కళ్ళ క్రింద క్యారీ బ్యాగ్స్ మరియు నల్లని మచ్చలు ఏర్పడుతాయి. ఇది మన దేశం లో అత్యధిక మందిని వేధించే సమస్య. అయితే ఈ అద్భుతమైన మసాజ్ ప్రక్రియ కర్ణం గా వాటర్ రిటెన్షన్ ని అరికట్టొచ్చు. కళ్ళ క్రింద క్యారీ బ్యాగ్స్ ని అలాగే నల్లని మచ్చలను అరికట్టొచ్చు. 

6 ) చర్మాన్ని డీ టాక్సిఫై చేస్తుంది :

మన చర్మం లో ప్రతీ రోజు టాక్సిన్స్ మనకి తెలియకుండానే పేరుకుపోతుంటాయి. కాలుష్యం తో నిండిపోయిన ఈ పర్యావరణం లో ఇలాంటివి జరగడం సహజ సిద్దమైనవే. అందువల్ల తరచూ మన చర్మం ని టాక్సిన్స్ నుండి పరిరక్షించుకోవడం అవసరం. అందుకు ఫేషియ‌ల్ మసాజ్ చేయించుకోవడం తప్పనిసరి. అంతే కాకుండా మొటిమ సమస్యల నుండి కూడా మనం తప్పించుకోవచ్చు.