ఎన్నో లాభాలు ఉన్న వాటర్ బర్త్ అంటే ఏంటి?

జీవితంలో తల్లిదండ్రులగా మారడం ఒక వరంగా భావిస్తూ ఉంటారు కదండీ. అయితే పిల్లలకు జన్మనిచ్చేటప్పుడు, అదేవిధంగా డెలివరీ అనంతరం కూడా తల్లికి, బిడ్డకి ఎటువంటి బాధ, నొప్పి లేకుండా, సురక్షితంగా ఆనందంగా ఉండాలి అంటే, ఈ వాటర్ డెలివరీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు డాక్టర్లు.  వాటర్ డెలివరీ అంటే ఏంటి:  ఈ వాటర్ డెలివరీ అనేది చాలా సురక్షితమని ఇటీవల డాక్టర్లు చాలామంది తమ పేషెంట్లకు సిఫారీస్ చేస్తున్నారు. బయట దేశాలలో ఇప్పటికే వాడుకలో […]

Share:

జీవితంలో తల్లిదండ్రులగా మారడం ఒక వరంగా భావిస్తూ ఉంటారు కదండీ. అయితే పిల్లలకు జన్మనిచ్చేటప్పుడు, అదేవిధంగా డెలివరీ అనంతరం కూడా తల్లికి, బిడ్డకి ఎటువంటి బాధ, నొప్పి లేకుండా, సురక్షితంగా ఆనందంగా ఉండాలి అంటే, ఈ వాటర్ డెలివరీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు డాక్టర్లు. 

వాటర్ డెలివరీ అంటే ఏంటి: 

ఈ వాటర్ డెలివరీ అనేది చాలా సురక్షితమని ఇటీవల డాక్టర్లు చాలామంది తమ పేషెంట్లకు సిఫారీస్ చేస్తున్నారు. బయట దేశాలలో ఇప్పటికే వాడుకలో ఉన్న వాటర్ డెలివరీ పద్ధతి, తల్లి, బిడ్డ క్షేమానికి ఎంతో సురక్షితంగా పనిచేస్తుంది అంటున్నారు. అసలు ఈ వాటర్ డెలివరీ అంటే ఏంటి? డాక్టర్లు దీన్ని ఎందుకు సిఫారిస్ చేస్తున్నారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 9 నెలలు నిండిన తల్లికి డెలివరీ చేసేందుకు చాలా మంది ఫ్రీ డెలివరీ అని సర్జరీ అని కొన్ని రకాలుగా డెలివరీ నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమానికి, తల్లికి ఎటువంటి నొప్పి బాధ తెలియకుండా ఉండేందుకు, డెలివరీ అనేది వాటర్ లో నిర్వహిస్తారు. అంతే కాకుండా ఈ వాటర్ డెలివరీ అనేది చాలా వరకు సురక్షితం. డెలివరీ అనంతరం కూడా తల్లికి కలిగే ఎటువంటి నెప్పుల నుంచి ఉపశమనం అనేది చాలా త్వరగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వాటర్  డెలివరీ ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి అంటున్నారు డాక్టర్లు అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.. 

వాటర్ వాటర్  డెలివరీ ప్రయోజనాలు: 

ప్రసవ సమయంలో తల్లి, బిడ్డ ఇద్దరికీ అనేక ప్రయోజనాలను అందిస్తుందని వాటర్ బర్త్ నిపుణులు నమ్ముతారు. డాక్టర్ కవిత కోవి ప్రయోజనాల గురించి వివరించారు:

నొప్పి ఉపశమనం – వాటర్ బర్త్ ప్రాథమిక ప్రయోజనాల్లో ఒకటి, తల్లిపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా గోరువెచ్చని నీరు ప్రసవ సమయంలో సహజ నొప్పి ఉపశమనాన్ని అందిస్తుంది, విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది, అంతేకాకుండా తల్లికి డెలివరీ సమయంలో ఆందోళనను తగ్గిస్తుంది. ఈ వాటర్ డెలివరీ సమయంలో, తల్లి కండరాలపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది ప్రసవ పురోగతిని సులభతరం చేస్తుంది. సౌకర్యవంతమైన డెలివరీకి వీలు కల్పిస్తుంది. 

మెరుగైన రక్త ప్రసరణ – వాటర్ డెలివరీ విధానం నిజానికి చక్కని రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది, ఇది తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. వెచ్చని నీరు రక్త నాళాలు విస్తరిస్తుంది, గర్భాశయ కండరాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, ఈ విధానం ద్వారా తల్లి బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఆరోగ్యంగా ఉంటారు. 

సహజ నొప్పి నివారిణి- ఇటీవల చాలా మంది డెలివరీ కి వచ్చిన మహిళలు ఫార్మాలాజికల్ నొప్పి నుంచి బయటపడి ఎందుకు మందులు కన్నా వాటర్ డెలివరీను ఎంచుకుంటున్నారు. నీటి ఇమ్మర్షన్ ఎండార్ఫిన్ల విడుదలను ప్రేరేపిస్తుంది, అంటే ఇదే సహజ నొప్పి నివారిణిగా పని చేస్తుంది, ప్రసవ సమయంలో మరింత రిలాక్స్డ్గా ఉండేందుకు ఈ పద్ధతి ప్రోత్సహిస్తుంది. మందులు వాడకం అనేది లేకపోవడం వల్ల తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ సైడ్ ఎఫెక్ట్స్ వంటి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

స్మూత్ ట్రాన్సిషన్ – వాటర్ బర్త్ ప్రాసెస్లో, డెలివరీ సమయంలో ముఖ్యంగా బేబీ స్మూత్ ట్రాన్సిషన్ కి సహాయపడుతుంది. ఇది శిశువుకు సుపరిచితమైన మరియు సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా బిడ్డ స్వతహాగా శ్వాస తీసుకోవడానికి కూడా ఈ పద్ధతి ఎంతగానో సహాయపడుతుంది. 

మెరుగైన బంధం – వాటర్ డెలివరీ విధానంలో తల్లి మరియు బిడ్డ మధ్య లోతైన సంబంధాన్ని ప్రోత్సహిస్తుంది. పోషణ మరియు నిర్మలమైన వాతావరణం సులభతరం చేస్తుంది. ముఖ్యంగా డెలివరీ అనంతరం తల్లి, బిడ్డ క్షేమంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఎటువంటి నొప్పి, బాధ లేకుండా అనురాగంతో ఉండేందుకు ఈ వాటర్ డెలివరీ పద్ధతి ఎంత మేలు అంటున్నారు డాక్టర్లు.