లేవ‌గానే నిమ్మ ర‌సం తాగి చూడండి

నిమ్మ ర‌సం వల్ల మన విటమిన్ సి పెరుగుతుంది, దీని టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇవి కాకుండా దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మ ర‌సంలో తేనె కలుపుకొని తాగితే మన బాడికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇంకా ఇలా లెమన్ వాటర్ తేనె కలుపుకొని తాగడం వల్ల మన శరీరంలో పవర్ అనేది పెరుగుతుంది. ఇంకా మన బాడీలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. దివ్య […]

Share:

నిమ్మ ర‌సం వల్ల మన విటమిన్ సి పెరుగుతుంది, దీని టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇవి కాకుండా దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మ ర‌సంలో తేనె కలుపుకొని తాగితే మన బాడికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇంకా ఇలా లెమన్ వాటర్ తేనె కలుపుకొని తాగడం వల్ల మన శరీరంలో పవర్ అనేది పెరుగుతుంది. ఇంకా మన బాడీలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.

దివ్య గోపాల్ అనే న్యూట్రిషనిస్ట్ లెమన్ వాటర్ వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి చెప్పింది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

లెమన్ వాటర్ హెల్త్ బెనిఫిట్స్: 

1.హైడ్రేషన్ పెరుగుతుంది: 

డిహైడ్రేషన్ బారిన పడే వాళ్ళకి లెమన్ వాటర్ అనేది ఒక మంచి సొల్యూషన్. ఇది డిహైడ్రేషన్ నితక్షణమే పోగొడుతుంది. దీనివల్ల మన డైజేషన్ సిస్టం పవర్ కూడా పెరుగుతుంది. దీనివల్ల మన స్కిన్ హెల్తీగా మారుతుంది.

2.విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది: 

లెమన్ లో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి మన శరీర సెల్ డామేజ్ నుంచి కాపాడుతుంది. దీనివల్ల మన స్కిన్ చాలా గ్లోయింగ్ గా మారుతుంది.

3.డైజేషన్ పవర్ పెరుగుతుంది: 

లెమన్ లో డైజేషన్ జ్యూసెస్ ఉంటాయి, ఇవి మన డైజేషన్ పవర్ ని పెంచుతాయి. లెమన్ జ్యూస్ తాగడం వల్ల బ్లోటింగ్ సమస్య నుంచి బయటపడతాం. వేడినీళ్లలో లెమన్ కలుపుకొని తాగడం వల్ల మన డైజేషన్ బాగా జరుగుతుంది.

4.బరువు తగ్గుతాం: 

లెమన్, హనీ కలుపుకొని తాగడం వల్ల మన శరీర బరువు అనేది తగ్గుతుంది. దీనివల్ల మన మెడబాలిజం పెరుగుతుంది. శరీరంలో ఉన్న అదనపు కొవ్వు తగ్గుతుంది.

5.హార్ట్ హెల్దీగా మారుతుంది: 

లెమన్ వాటర్ తాగడం వల్ల హార్ట్ హెల్దీగా మారుతుంది. ఇందులో పొటాషియం  ఉంటుంది ఇది మన హార్ట్ ని హెల్దీగా మారేలా చేస్తుంది. లెమన్ జ్యూస్ తాగడం వల్ల మన బాడికి కావాల్సినవన్నీ అందుతాయి.

6.స్కిన్ మెరుస్తుంది: 

లెమన్ వాటర్ తాగడం వల్ల మన స్కిన్ మెరుస్తుంది. ఇందులో సి విటమిన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి

ఇవి మన స్కిన్ గ్లో అయ్యేలా చేస్తాయి. 

7.కిడ్నీలో స్టోన్స్ రాకుండా చేస్తుంది: 

లెమన్ లో ఉండే సిట్రిక్ యాసిడ్ అనే పదార్థం కిడ్నీలో స్టోన్స్  పెరగకుండా చేస్తుంది.

8.పళ్ళని రక్షిస్తుంది: 

లెమన్ జ్యూస్ అనేది పళ్ళని మంచి కండిషన్ లో ఉంచేందుకు ఉపయోగపడుతుంది. లెమన్ వాటర్ 

చాలా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి.

9.ఇమ్యూనిటీని పెంచుతుంది: 

లెమన్ వాటర్ మీ శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. సి విటమిన్ వల్ల మీ శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. కోల్డ్, ఫ్లూ రాకుండా మీ ఇమ్యూనిటీ మిమ్మల్ని కాపాడుతుంది.

10.శరీరం పీహెచ్ లెవెల్ ని రక్షిస్తుంది: 

లెమన్ వాటర్ మీ శరీరాన్ని ఆల్కలైజ్ చేస్తుంది. దానివల్ల మీ శరీరం పీహెచ్ లెవెల్ బ్యాలెన్స్ అవుతుంది.

దీనివల్ల మీరు హెల్తీగా ఉంటారు.

11.ఒత్తిడి తగ్గుతుంది: 

లెమన్ వాటర్ తాగడం వల్ల మీ శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది. మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

లెమన్ వాటర్ ని ఏ టైంలో తాగితే బాగుంటుంది?

లెమన్ వాటర్ ని ఎంప్టీ స్టమక్ తో తాగితే బాగుంటుంది. ఇలా తాగడం వల్ల మీ బాడికి కావలసిన ప్రయోజనాలన్నీ అందుతాయి.

లెమన్ వాటర్ వేడి నీళ్లతో తాగాలా ?చల్లటి నీళ్లతో తాగాలా ?

వేడినీళ్లతో తాగడం చలినీళ్లతో తాగడం అనేది మీ ప్రిఫరెన్స్ ని బట్టి ఉంటుంది. దేనితో తాగినా మన బాడికి కావాల్సిన బెనిఫిట్స్ అన్ని అందుతాయి.

లెమన్ వాటర్ తాగడం మొదలు పెట్టేటప్పుడు కొద్ది మోతాదులో తాగుతూ మొదలుపెట్టాలి, తర్వాత క్రమంగా డోస్ పెంచాలి. అలా కాకుండా ఒకేసారి ఎక్కువ డోస్ తాగితే ఎసిడిటీ సమస్య రావచ్చు. అందుకే తక్కువ డోస్ తో మొదలు పెట్టండి.