వెల్లకిలా పడుకోవడం నడుముకు, భుజాలకు, ముఖానికి కూడా మంచిదట.

క్రమం తప్పకుండా ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో మంచి నిద్ర కూడా అంతే ముఖ్యం. చాలా తక్కువ మంది మాత్రమే నిద్రపోయేటప్పుడు శరీర భంగిమను జాగ్రత్తగా చూసుకుంటారు. అటువంటి పరిస్థితిలో, నిద్రపోయేటప్పుడు తప్పు శరీర భంగిమ కారణంగా, చాలా మందికి శరీరంలోని వివిధ భాగాలలో నొప్పి ఉంటుంది. వీరిలో చాలామంది మెడ, భుజం, వెన్నునొప్పితో బాధపడుతుంటారు. కాబట్టి, నిద్రించడానికి సరైన మార్గం మరియు అది ఎందుకు ముఖ్యమో తెలుసుకోండి.  మనం ఏ భంగిమలో పడుకుంటే మంచిది? మనం […]

Share:

క్రమం తప్పకుండా ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో మంచి నిద్ర కూడా అంతే ముఖ్యం.

చాలా తక్కువ మంది మాత్రమే నిద్రపోయేటప్పుడు శరీర భంగిమను జాగ్రత్తగా చూసుకుంటారు. అటువంటి పరిస్థితిలో, నిద్రపోయేటప్పుడు తప్పు శరీర భంగిమ కారణంగా, చాలా మందికి శరీరంలోని వివిధ భాగాలలో నొప్పి ఉంటుంది. వీరిలో చాలామంది మెడ, భుజం, వెన్నునొప్పితో బాధపడుతుంటారు. కాబట్టి, నిద్రించడానికి సరైన మార్గం మరియు అది ఎందుకు ముఖ్యమో తెలుసుకోండి. 

మనం ఏ భంగిమలో పడుకుంటే మంచిది?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర చాలా అవసరం. రోజంతా హుషారుగా పని చేయగలగాలంటే రాత్రిపూట హాయిగా నిద్రపోవాలి. కానీ సరైన భంగిమలో పడుకోకపోతే శరీరానికి తగినంత విశ్రాంతి దొరకదు. ఇక భంగిమ వల్ల మనకు అనేక ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందువల్లే సరైన భంగిమలో పడుకోవడంచాలా అవసరం. 

అందువల్ల, హాయిగా నిద్ర పోవాలంటే సరైన భంగిమలో పడుకోవాలి. వెన్ను, పొట్ట బలంగా ఉండాలి. కొందరికి వెల్లకిలా పడుకోవడం ఇష్టం అయితే, మరికొందరికి బోర్లా పడుకుని నిద్రపోవడం ఇష్టంగా ఉంటుంది. బోర్లాగా కాకుండా, వెల్లకిలా పడుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. 

వెల్లకిలా పడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం

వెల్లకిలా  పడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

వెల్లకిలా పడుకోవడం వల్ల  వెన్నెముకకి విశ్రాంతి కలిగి, వెన్నునొప్పి తగ్గుతుంది. నడుము, వెన్ను నొప్పి ఉన్నవారు రాత్రిపూట వెల్లకిలా పడుకొని విశ్రాంతి తీసుకోవాలి. నడుముపై పడే ఒత్తిడి తగ్గించడానికి మోకాళ్ల కింద తలగడ పెట్టుకుంటే మంచిది.

ముఖంపై ముడతలు తగ్గుతాయి

వెల్లకిలా పడుకోవడం వల్ల ముఖంలోని కండరాలు రిలాక్స్ అవుతాయి. నిజానికి, మనం బోర్లా పడుకొని నిద్రపోతున్నప్పుడు, మన ముఖాన్ని దిండుపై పెట్టడం వల్ల ముఖంలో ఉండే నూనెలు బయటకు వస్తాయి. ఫలితంగా, చర్మం ముడతలు పడి, నిర్జీవంగాను, పొడిగాను కనిపిస్తుంది. అదే వెల్లకిలా పడుకొని నిద్రిస్తే, వృద్ధాప్యం వల్ల వచ్చే ముడతలు రావడం తగ్గుతుంది. అంటే, బోర్లా పడుకుంటే మనకి సహజంగా ముడతలు వచ్చే వయసు కంటే ముందే ముడతలు వచ్చేస్తాయి. అలాగే, వెల్లకిలా పడుకుంటే సహజంగా ముడతలు వచ్చే వయసు కంటే కూడా ఆలస్యంగా వస్తాయన్నమాట. 

భుజం నొప్పి నుండి ఉపశమనం

స్పాండిలైటిస్, లేదా దీర్ఘకాలికంగా భుజం నొప్పి ఉన్నవాళ్ళు, ఎప్పుడూ వెల్లకిలానే నిద్రపోవాలి. చాలా తక్కువ ఎత్తు ఉన్న దిండును మెడ కింద పెట్టుకోవాలి. వెల్లకిలా పడుకున్నప్పుడు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల భుజం, కండరాలు రిలాక్స్ అవుతున్నట్లు మీకే తెలుస్తుంది. ఎటువంటి నొప్పి ఉన్నా కానీ ఇలా పడుకోవడం వల్ల వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. కావున వెల్లకిలా పడుకోవడం అలవర్చుకోవాలి. 

వెల్లకిలా నిద్రపోవడం ఎవరికి మంచిది కాదు?  

వెల్లకిలా పడుకొని విశ్రాంతి తీసుకోవడం అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, వైద్యుడు కొంతమంది రోగులను కొన్ని పరిస్థితులలో అలా పడుకోకూడదని చెప్పవచ్చు. గుండె జబ్బులు, ఉన్నవారు,  స్థూలకాయంతో బాధపడుతున్నవారు, దీర్ఘకాలిక శ్వాసకోశ రుగ్మత ఉన్నవాళ్ళు వెల్లకిలా పడుకొని నిద్రపోవడం మంచిది కాదని డాక్టర్లు సూచిస్తారు. వెల్లకిలా పడుకోవడం గురక సమస్య ఉన్నవాళ్ళకి కూడా మంచిది కాదు. కావున పైన పేర్కొన్న ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు వెల్లకిలా పడుకోవడం అంత మంచిది కాదు. 

అయితే ఇలాంటివి ఏవైనా చేసే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. సొంతంగా నిర్ణయాలు తీసుకుని ఏదైనా కొత్త విషయాలు ఆరోగ్యం విషయంలో చేయడం మానేయాలి. 

Tags :