ఉపవాసం ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేయకండి 

ఉపవాసం చేసేటప్పుడు చాలామంది కొన్ని కొన్ని తప్పులు చేస్తారు దానివల్ల ఉపవాసం చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం కన్నా ఎక్కువ నష్టమే జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉపవాసం చేసేటప్పుడు ఎలాంటివి గుర్తు పెట్టుకోవాలి? ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? ఏ సమయంలో తినాలి ఏ సమయంలో తినకూడదు అలాంటివి ఇప్పుడు చూద్దాం..  ఉపవాసం ప్రత్యేకత:  ప్రతి సంవత్సరంలో వచ్చే ఈ ఉపవాస కార్యక్రమం ఎంతో ప్రత్యేకమైనది. శ్రావణ మాసం సంవత్సరంలో అత్యంత పవిత్రమైన సమయాలలో ఒకటిగా చెప్పుకుంటూ ఉంటారు. […]

Share:

ఉపవాసం చేసేటప్పుడు చాలామంది కొన్ని కొన్ని తప్పులు చేస్తారు దానివల్ల ఉపవాసం చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం కన్నా ఎక్కువ నష్టమే జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉపవాసం చేసేటప్పుడు ఎలాంటివి గుర్తు పెట్టుకోవాలి? ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? ఏ సమయంలో తినాలి ఏ సమయంలో తినకూడదు అలాంటివి ఇప్పుడు చూద్దాం.. 

ఉపవాసం ప్రత్యేకత: 

ప్రతి సంవత్సరంలో వచ్చే ఈ ఉపవాస కార్యక్రమం ఎంతో ప్రత్యేకమైనది. శ్రావణ మాసం సంవత్సరంలో అత్యంత పవిత్రమైన సమయాలలో ఒకటిగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం, శ్రావణ మాసం చాలా ప్రత్యేకం ఎందుకంటే పందొమ్మిది సంవత్సరాల తర్వాత, ఈ సంవత్సరం శ్రావణ మాసం అనేది సుమారు రెండు నెలల పాటు జరుపుకుంటారు. ప్రతి శుభ కార్యం జరిగే మాసం ఇది. ఈ మాసంలో మనం ఉపవాసం ఉండి, శివుడిని మరియు పార్వతి దేవిని ఆరాధిస్తే, వారు మనకు శ్రేయస్సు మరియు సంతోషాన్ని ప్రసాదిస్తారని నమ్ముతారు. ఈ సమయంలో పరమశివుడు మరియు పార్వతి దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ మాసంలో, మంగళ గౌరీ వ్రతం అని పిలువబడే పార్వతీ దేవి కోసం ప్రతి మంగళవారం ఉపవాసం పాటిస్తారు. 

ఉపవాసంలో తీసుకోవలసిన జాగ్రత్తలు: 

ఈ రెండు పవిత్రమైన మాసాలలో మనం ఉపవాసం పాటించేటప్పుడు, మనం అనారోగ్యానికి గురికాకుండా లేదా వ్రతంలో తప్పులు చేయకుండా చూసుకోవడానికి కొన్ని జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం.. 

అతిగా తినడం: ఉపవాసం చేసిన అనంతరం అతిగా ఆహారం తినడం అనేది చాలా పెద్ద పొరపాటు. ఇది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది మరియు మనల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. శ్రావణ మాసం ప్రశాంతంగా, భక్తితో గడపాలి. ఈ సమయంలో మనం అనారోగ్యం బారిన పడకుండా ఉండాలి. అందుకే ఉపవాసం చేసిన తర్వాత, ముందుగా ఎక్కువ నీరు ఉండే పదార్థాలు తీసుకోవాలి. తర్వాత అల్పాహారం తీసుకుంటే చాలా ఉత్తమం. అందుకే చాలామంది పళ్ళు పలహారంలతోనే తమ ఉపవాసాన్ని ముగిస్తారు.

ఉల్లి, వెల్లుల్లి: శ్రావణ మాసంలో ఉల్లి, వెల్లుల్లి తినడం పూర్తిగా నిషిద్ధం. ఉపవాసం ఉంచడంలో భాగంగా, మనం ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అందుకే శ్రావణ మాసంలో మనం చేసుకునే వంటకాలలో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా ఉండేలా చూసుకోవాలి.

వేయించిన ఆహారం: ఈ శ్రావణమాస సమయంలో మనం ఎక్కువగా వేపిన కూరగాయలతో చేసిన వంటలు తినకపోవడమే మంచిది. అంతేకాకుండా పొటాటో చిప్స్, ఆయిల్ ఫుడ్కి దూరంగా ఉండడం ఉత్తమం. ఎందుకంటే ఉపవాస సమయంలో మన పొట్ట పాడయ్యే అవకాశం ఉంది. శ్రావణమాసం సాఫీగా జరగాలంటే వేయించిన ఆహారానికి దూరంగా ఉండటం మేలు.

షుగర్: ఉపవాసంలో ఉండేటప్పుడు చక్కెర కోరికలు కలగడం సహజం. వ్రతం సమయంలో చక్కెర పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు. అయినప్పటికీ, ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఉపవాసం అనంతరం తీపి పదార్థాలు తింటే షుగర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే.

ఉపవాసం అంటే చాలామంది ఆకలితో ఉండడం అనుకుంటారు. ఆకలితో ఎక్కువసేపు ఉండడం కూడా మంచిది కాదు అని చాలామంది భావిస్తారు. కాకపోతే శ్రావణమాసంలో ఉపవాసాలు ఉండటం వల్ల శరీరానికి నిరోధక శక్తి పెంపొందించుకోవడానికి సరైన సమయం అని అర్థం. ఈ శ్రావణమాసంలో ఉపవాసాలు ఉండడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది