డేటింగ్ యాప్స్ వాడుతున్నారా?

ఈరోజు ,రేపు ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే ఆన్లైన్ డేటింగ్ యాప్ లు విపరీతంగా పుట్టుకు వస్తున్నాయి. స్వైప్ చేస్తే చాలు పార్టనర్ దొరుకుతారు అని ప్రకటనలు కూడా ఇస్తున్నారు. ఇక ఈ డేటింగ్ యాప్ లకు యువతలో క్రేజ్ కూడా బాగా పెరిగింది. కానీ డేటింగ్ యాప్ లతో కొంత మంది యువతీ యువకులు కష్టాలు కొని తెచ్చుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. 2017 నుండి 2021 సంవత్సరం వరకూ అంటే 4 ఏళ్లలో దాదాపు […]

Share:

ఈరోజు ,రేపు ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే ఆన్లైన్ డేటింగ్ యాప్ లు విపరీతంగా పుట్టుకు వస్తున్నాయి. స్వైప్ చేస్తే చాలు పార్టనర్ దొరుకుతారు అని ప్రకటనలు కూడా ఇస్తున్నారు. ఇక ఈ డేటింగ్ యాప్ లకు యువతలో క్రేజ్ కూడా బాగా పెరిగింది. కానీ డేటింగ్ యాప్ లతో కొంత మంది యువతీ యువకులు కష్టాలు కొని తెచ్చుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. 2017 నుండి 2021 సంవత్సరం వరకూ అంటే 4 ఏళ్లలో దాదాపు 6000 మంది డేటింగ్ యాప్ వలన మోస పోయాము అని కంప్లైంట్ చేశారు. ఇంకా కంప్లైంట్ చేయని వారి సంఖ్య ఎంత ఉందో అధికారిక లెక్కలేదు. ఒక సర్వే ద్వారా తెలిసిన విషయం ఏంటంటే డేటింగ్ యాప్ ద్వారా కలిసిన వారిలో 33% మంది హరజ్మెంట్ కు గురయ్యారు అని తెలిసింది. ఇటువంటి సమయంలో డేటింగ్ యాప్ వాడుతున్న వారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిది. 

మ్యాచ్ అయిన వెంటనే డేట్ కు పిలవవద్దు : మీరు ఏదైనా డేటింగ్ యాప్ లో ఎవరైనా చాటింగ్ చేయడం మొదలు పెడితే వెంటనే డేట్ కు ప్లాన్ చేయవద్దు. ఎవరు ఎలాంటి వారో తెలియకుండా డేట్ కు వెళ్ళడం ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో తెలియదు. 

డేట్ కి ముందు వీడియో కాల్ మాట్లాడండి : మీరు ఒకవేళ యాప్ లో పరిచయం అయిన వారితో డేట్ కు వెళ్ళడానికి నిర్ణయించుకుంటే అంతకు ముందే ఒకటి రెండు సార్లు అయినా వీడియో కాల్ లో మాట్లాడుకోవడం మంచిది. వారి ప్రొఫైల్ లో పెట్టిన ఫోటో వారిదే నా కాదా అని తెల్సుకోవడానికి మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే వారి స్వభావం కూడా అర్థం చేసుకోవచ్చు. 

ఏదైనా పబ్లిక్ ప్లేస్ లో మీటింగ్ ఏర్పాటు చేసుకోండి : ఆన్లైన్ పార్టనర్ ను కలిసేటట్టు అయితే కాఫీ షాప్, రెస్టారెంట్, పార్క్ ల లాంటి పబ్లిక్ ప్లేస్ లు ఎంచుకోవడం ఉత్తమం. 

మొదటి మీటింగ్ లకు మీ వ్యక్తిగత ట్రాన్స్పోర్ట్ ఎంచుకోండి : మొదటి సారి మీట్ అవుతున్న అప్పుడు పికప్ లేదా డ్రాప్ చేయమని మీ పార్టనర్ ను అడగవద్దు. మీ సొంత ట్రాన్స్పోర్ట్ ను ఉపయోగించుకోవడం చాలా అవసరం. మీ అడ్రస్ లేదా వర్క్ ప్లేస్ గురించి ఆన్లైన్ లో పరిచయం అయిన వాళ్ళ అందరికీ తెలియాల్సిన అవసరం లేదు అని గుర్తు ఉంచుకోండి. 

డేట్ కి వెళ్ళే ముందు మీకు బాగా నమ్మకం అయిన వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి : ఎవరికి తెలియకుండా ఆన్లైన్ లో పరిచయం అయిన వారితో డేట్ కు వెళ్ళడం చాలా ప్రమాదకరం. మీకు బాగా నమ్మకం అయిన వారితో ఎక్కడికి వెళ్తున్నారు, ఎంత సమయానికి వస్తారు అనే కనీస విషయాలు అయినా చెప్పడం మంచిది. 

నెంబర్ ఇచ్చే ముందు ఆలోచించండి : ఆన్లైన్ లో పరిచయం అవ్వగానే కొత్త వారికి మీ ఫోన్ నెంబర్ మరియు పర్సనల్ డీటైల్స్ ఇవ్వకండి. కొన్ని రోజులు మాట్లాడి మీకు ఇబ్బంది లేదు అనిపిస్తెనే మీ ఫోన్ నెంబర్ ను షేర్ చేయండి. దానికి కావాల్సిన సమయం తీసుకోండి, తొందర పడవద్దు. 

మీ సహజ ప్రవృత్తి ను నమ్మండి : ఎవరైనా మీకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే మీకు వెంటనే ఆ విషయం అర్ధం అవుతుంది. ఏమీ కాదులే అని మాత్రం దాట వేయకండి. మీకు ఇబ్బంది కలిగినా లేదా అభద్రతా భావం కలిగినా వెంటనే వచ్చేయండి. 

డేట్ కు వెళ్తే ఎక్కువగా మద్యం సేవించవద్దు : ఒకవేళ మీకు మద్యం అలవాటు ఉండి మీరు డేట్ కి వెళ్ళినప్పుడు మద్యం ఆఫర్ చేస్తే లిమిట్ లో మాత్రమే తీసుకోండి. అతిగా మద్యం సేవించడం వలన ఎదుటి వారు మనతో ఎలా ప్రవర్తిస్తున్నారు అని మనకు తెలియదు. వీలైనంత వరకూ మద్యాన్ని ముట్టుకోకుండా ఉండడం చాలా మంచిది.