మీరు సరిగా నిద్రపోతున్నారా?

నిద్ర మానవ ఆరోగ్యంలో అత్యంత ప్రముఖమైన ఘట్టం. మన శారీరక మరియు  మానసిక శ్రేయస్సును కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సమకాలీన సమాజంలో మంచి నాణ్యమైన నిద్రను సాధించడం చాలా మంది వ్యక్తులకు సవాలుగా మారిపోయింది. ఒత్తిడి, ఎక్కువగా ఎదో ఒక స్క్రీన్ నీ చుస్తూండడం, ఫోన్స్ వాడటానికి అలవాటు పడిపోవడం, టైంకి తినకపోవడం వంటివి మన మానసిక ఆరోగ్యం పైన ప్రభావం చూపుతాయి. ఇది తరచుగా మన సహజ నిద్ర విధానాలకు అంతరాయం కలిగిస్తుంది మరియు […]

Share:

నిద్ర మానవ ఆరోగ్యంలో అత్యంత ప్రముఖమైన ఘట్టం. మన శారీరక మరియు  మానసిక శ్రేయస్సును కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

సమకాలీన సమాజంలో మంచి నాణ్యమైన నిద్రను సాధించడం చాలా మంది వ్యక్తులకు సవాలుగా మారిపోయింది. ఒత్తిడి, ఎక్కువగా ఎదో ఒక స్క్రీన్ నీ చుస్తూండడం, ఫోన్స్ వాడటానికి అలవాటు పడిపోవడం, టైంకి తినకపోవడం వంటివి మన మానసిక ఆరోగ్యం పైన ప్రభావం చూపుతాయి. ఇది తరచుగా మన సహజ నిద్ర విధానాలకు అంతరాయం కలిగిస్తుంది మరియు మొత్తం  శారీరక ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. 

తగినంత నిద్ర లేకపోవడం వలన శరీరంపై చాలా ప్రభావం పడుతుంది ఇది దృష్టిని తగ్గించడం, జ్ఞాపకశక్తి లోపాలు మరియు సామర్ధ్యాలు బలహీనపడటానికి దారితీస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గి అంటువ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ రోజులు నిద్ర లేకపోతే ఒబేసిటీ, డయాబెటిస్ మరియు కార్డియోవాస్క్యూలర్, వివిధ ఆరోగ్య సమస్యలు అధికంగా వచ్చే ప్రమాదం ఉంది. మొత్తంమీద, స్థిరంగా తక్కువ నిద్రపోవడం వలన శారీరక ఆరోగ్యం మరియు మానసిక స్థితి రెండింటినీ బలహీనపరుస్తుంది.

“బాడీ టిష్యూస్ మరమత్తులు, మెమరీ కన్సాలిడేషన్, హార్మోన్ రేగులషన్, ఆరోగ్యంన్నీ, మానసిక స్థితిని మొత్తం శరీరాన్ని కాపాడుకోవడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. తగినంత నిద్ర మెరుగైన ఏకాగ్రత, మానసిక స్థితి స్థిరత్వం మరియు పటిష్టమైన రోగనిరోధక వ్యవస్థకు దోహదం చేస్తుంది. సరైన పోషకాహారాన్ని తీసుకోవడం, రాత్రిపూట సమయానికి నిద్రపోవడం వలన మరింత శక్తివంతమైన జీవితాన్ని పొందవచ్చు.” అని ఆయుర్వేద డాక్టర్లు చెబుతున్నారు. 

మంచి నిద్ర కోసం అవసరమైన టిప్స్ 

1.నిద్ర సమయం : అస్తమించే సూర్యుడితో నిద్రపోండి మరియు ఉదయించే సూర్యుడితో మేల్కొనండి.

2.తినే సమయం : మీ భోజన సమయాన్ని కాస్త ముందుగా ఉండేలా చుస్కుకోండి (అంటే నిద్రపోవడానికి 2 లేదా 3 గంటల ముందు). రాత్రి 7 గంటల తరువాత ఆహారాన్ని తీసుకోకండి, అర్థరాత్రి తినడం వంటివి చేయకండి, వీలైనంత వరుకు అల్పాహారం నుంచి దూరంగా ఉండండి. 

3.స్మార్ట్ ఫోన్ కి దూరంగా ఉండటం : ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం మానుకోండి మరియు రాత్రి 8:30-9 గంటల తర్వాత బ్లూ లైట్‌కి దూరంగా, ఎందుకంటే అవి మీ సహజ నిద్రాలకు భంగం కలిగిస్తాయి. 

4.నిద్రా స్థితి : ఎడమ వైపు పడుకోవడం మంచిది అని ఆయుర్వేద నిప్పులు సిఫార్సు చేస్తున్నారు ఎందుకంటే ఇది గుండెల్లో మంటను నివారించడం, జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చెయ్యడం మరియు గురకను తగ్గించడం వంటి ప్రయోజనాలను అందిస్తుంది.

5.మధ్యాహ్నం వేళ నిద్ర : వేసవికాలంలో తప్ప పగటిపూట నిద్రపోవడం మంచిది కాదు. ఎందుకంటే ఇది కఫా మరియు పిట్టా దోషాల సమతుల్యతకు భంగం కలిగిస్తుంది, ఇది శారీరక కొవ్వును పెంచడానికి దారితీస్తుంది.

మీ కోసం నిద్ర గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ : 

1.సగటున మనం నిద్రలో రెండు గంటలు కలలు కంటూ ఉంటాము.

2. 18 నుండి 64 సంవత్సరాల వయస్సు గల వారికి ఆరు నుండి ఏడు గంటల పాటు నిద్ర అవసరం. 65 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలకు ఏడు నుండి ఎనిమిది గంటలు అవసరం.

3.ఉదయాన్నే మంచం మీద నుంచి లేవడానికి కష్టమయ్యే స్థితిని డైసానియా అంటారు. 

4.ఆహార లేమి కంటే నిద్ర లేమి మిమ్మల్ని ఎక్కువ అనారోగ్యానికి గురి చేస్తుంది.

5.స్లీప్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏమిటంటే ప్రతీ 100 మందిలో సగటున 15 మందికి నిద్రలో నడిచే అలవాటు ఉంటుందట.