బ్యాలెన్స్‌డ్ ఫుడ్ తింటున్నప్పటికీ బరువు పెరుగుతున్నారా?

చాలామంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని రోజు వారు ఆహారంగా తీసుకుంటున్నప్పటికీ తెలియకుండానే బరువు పెరుగుతూ ఉంటారు నిజానికి బ్యాలెన్స్‌డ్ డైట్, అదే విధంగా పోషకాలతో నిండిన ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఆరోగ్యానికి ఎంతో మేలు. అయితే ఆహారం తీసుకుంటున్నప్పటికీ అధికంగా బరువు పెరుగుతున్నామని మీరు గమనించినట్లయితే తప్పకుండా ఈ టెస్టులు చేయించుకోవడం కంపల్సరీ అంటున్నారు నిపుణులు.  థైరాయిడ్ టెస్ట్:  మెటబాలిజంని రెగ్యులేట్ చేసేందుకు థైరాయిడ్ గ్లాండ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ అనేది సరైన యాక్టివ్ గా […]

Share:

చాలామంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని రోజు వారు ఆహారంగా తీసుకుంటున్నప్పటికీ తెలియకుండానే బరువు పెరుగుతూ ఉంటారు నిజానికి బ్యాలెన్స్‌డ్ డైట్, అదే విధంగా పోషకాలతో నిండిన ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఆరోగ్యానికి ఎంతో మేలు. అయితే ఆహారం తీసుకుంటున్నప్పటికీ అధికంగా బరువు పెరుగుతున్నామని మీరు గమనించినట్లయితే తప్పకుండా ఈ టెస్టులు చేయించుకోవడం కంపల్సరీ అంటున్నారు నిపుణులు. 

థైరాయిడ్ టెస్ట్: 

మెటబాలిజంని రెగ్యులేట్ చేసేందుకు థైరాయిడ్ గ్లాండ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ అనేది సరైన యాక్టివ్ గా లేనట్లయితే అది మెటాబాలిజంని తగ్గిస్తుంది. అలా జరిగినప్పుడు సగటు మనిషి బరువు అధికంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. మీరు ఆరోగ్యకరమైన డైట్ ఫాలో అవుతూ, పుష్కలమైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటున్నప్పటికీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవారికి బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే ఒకవేళ అనుమానం వస్తే గనుక థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం తప్పనిసరి. 

ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్ట్: 

శరీరంలో ఉండే సెల్స్ అనేవి ఇన్సులిన్ కి రెస్పాన్స్ అవ్వలేని పరిస్థితుల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఒక లోపం ఏర్పడుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. దీనికి కారణంగా, శరీరంలో ఎక్కువ శాతం కొవ్వు చేరుకుంటుంది. కొవ్వు ఎప్పుడైతే చేరుకోవడం మొదలైందో, అప్పటి నుంచి శరీర బరువు అనేది అధికంగా పెరుగుతూ వెళ్తుంది. కాబట్టి మనం ఎటువంటి ఆహారం తీసుకున్న, మనం డైట్ లో ఉన్నప్పటికీ మన శరీర బరువు పెరగడానికి గల కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయి కూడా ఉండొచ్చు, కాబట్టి తక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటున్నప్పటికీ, బరువు పెరుగుతున్నట్లు మీరు గమనించినట్లయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఒక టెస్ట్ చేయించుకోవడం మంచిది. 

హార్మోన్ ఇమ్ బాలన్స్: 

చాలామందిలో హార్మోన్ ఇమ్ బాలన్స్ కారణంగా కూడా అధిక వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కార్టిసోల్, లెఫ్ట్ఇన్, గ్రహలిన్ అదేవిధంగా సెక్స్ హార్మోన్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ వంటి హార్మోన్ ఇమ్ బాలన్స్ అనేది శరీర బరువు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మనం రోజు వారి తీసుకునే ఆహారం తో సంబంధం లేకుండా, మన శరీర బరువు అధికంగా మారినప్పుడు మనం తప్పకుండా హార్మోన్ ఇమ్ బాలన్స్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. 

ఫుడ్ సెన్సిటివిటీ టెస్ట్: 

మనం తీసుకుంటున్న ఆహారం తక్కువ మొత్తంలో ఉంటున్నప్పుడు, అధిక బరువు పెరిగినప్పుడు, మనం కచ్చితంగా ఫుడ్ సెన్సిటివిటీ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఇది కూడా బరువు పెరగడానికి గల కారణం అవ్వచ్చు. మనకి తెలియకుండానే కొన్ని ఆహార పదార్థాలు తినడం కారణంగా మన శరీరంలో వాటర్ కంటెంట్ నిలువ ఉండిపోతుంది. దీనివల్ల కూడా మన శరీరం టెంపరరీ బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం ఏ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో మనమే గమనించుకోవాలి. మనకి తెలియకుండానే మనకి పడని ఫుడ్ తినేస్తూ ఉంటాం, దీని కారణంగా అధిక బరువు పెరుగుతాం. 

జీర్ణశక్తిని మెరుగుపరిచే గట్: 

మనం ఏవైతే ఆహార పదార్థాలు తింటున్నామో వాటిని జీర్ణించేందుకు మన జీర్ణ వ్యవస్థలో, గట్ అనే సూక్ష్మజీవి ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుందట. అంటే అది ఒక మంచి బ్యాక్టీరియా వంటిది. అటువంటి మంచి బాక్టీరియా లోపం కారణంగా కూడా మన శరీర మెటబాలిజం తగ్గి, పోషకాలు వున్న ఆహారాల నిల్వలు తగ్గి, మన బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు తెలియకుండానే మీరు బరువు పెరుగుతున్నట్లు అనిపిస్తే, వ్యాయామం చేసినప్పటికీ, ఆరోగ్యకరమైన డైట్ ఫుడ్ తింటున్నప్పటికీ, బరువు అధికంగా పెరుగుతుంటే ఇటువంటి టెస్టులు చేయించడం ఎంతో ఆవశ్యకం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.