రోజూ టీ త్రాగే అలవాటు ఉందా?

మన భారతీయులందరికీ ఉదయం మరియు సాయంత్రం ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు, మన బిజీ లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని టీ తాగితే వచ్చే సంతోషాన్ని మాటల్లో వివరించలేము.  స్ట్రెస్ లో ఉన్న మన మెదడుకి టీ ఒక కప్పు ఇంధనంలా ఉపయోగపడుతుంది. మనలో చాలా మంది దీన్ని కిక్ ఇచ్చే ఒక పానీయంలా చూస్తారు. ఛాయ్ తీసుకోవడం విపరీతంగా అలవాటు ఉన్నవారికి ఒక్కరోజు తాగకపోయిన నీరశించిపోతారు.  అయితే ఏ అలవాటైనా సరే […]

Share:

మన భారతీయులందరికీ ఉదయం మరియు సాయంత్రం ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు, మన బిజీ లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని టీ తాగితే వచ్చే సంతోషాన్ని మాటల్లో వివరించలేము.  స్ట్రెస్ లో ఉన్న మన మెదడుకి టీ ఒక కప్పు ఇంధనంలా ఉపయోగపడుతుంది. మనలో చాలా మంది దీన్ని కిక్ ఇచ్చే ఒక పానీయంలా చూస్తారు. ఛాయ్ తీసుకోవడం విపరీతంగా అలవాటు ఉన్నవారికి ఒక్కరోజు తాగకపోయిన నీరశించిపోతారు. 

అయితే ఏ అలవాటైనా సరే అదుపులో ఉంటే పరవాలేదు, కానీ మితిమీరితే ఇబ్బందులు తప్పవు. టీ నీ ఎప్పుడో ఒకసారి ఒక సిప్ వెయ్యడంలో తప్పే లేదు, కానీ అదే పనిగా తాగితే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. మరి మన రోజువారీ జీవితంలో టీ కి ఇంతలా  అలవాటు పడిపోయాము కదా ఉన్నట్టుండి దాన్ని మానివేయడం మంచిదేనా? అంతెందుకు ఒక నెల రోజులు టీ నీ తాగకుండా ఉంటే ఏమి జరుగుతుంది? దీని కోసం చాలామంది ఎక్స్పర్ట్స్ ఎన్నో చెప్పారు ఇప్పుడు అవి ఏమిటో తెలుసుకుందాం! 

1.ఒక నెల రోజులపాటు టీ తీసుకోవడం మానేస్తే మన శరీరానికి కెఫిన్ తగ్గుతుంది, ఎన్నో ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నాయి మరియు మంచి నిద్ర కూడా వస్తుంది, పరోక్షంగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

2.టీ నీ ఒకేసారి ఎక్కువగా తాగితే మూత్రవిసర్జన వ్యవస్థ మీద చాల ప్రభావాన్ని చూపిస్తుంది మరియు మొత్తానికి మానివేయడం వల్ల డీహైడ్రేషన్ సమస్యలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 

3.టీ తాగడం వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ తగ్గుతాయి, తద్వారా మన శరీరంలో కణాలు ఆరోగ్యవంతంగా ఉంటాయి, జీర్ణ సంబంధిత వ్యాధులు మరియు కొన్ని రకాల కాన్సర్ లు రాకుండా ఉంటాయి. 

4.చాలా మందికి, టీ కేవలం పానీయం కాదు; ఇది రోజువారీ దిన చర్యల్లో ఒక భాగం, టీని మానేయడం వలన ఈ దినచర్యలలో మార్పులకు దారితీయవచ్చు మరియు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. 

5.టీ లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇది వివిధ ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంటుంది, టీని పూర్తిగా తగ్గించిన తరువాత మీ శరీరానికి పండ్లు, కూరగాయలు, ఇతర పానీయాలు మరియు యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి. 

6.గ్రీన్ టీ  బరువు తగ్గడానికి సంబందించిన మూలికలతో ముడిపడి ఉంటుంది, దీన్ని  వదులుకోవడం వలన జీవక్రియలో మరియు ఆకలి నియంత్రణలో మార్పులు రావొచ్చు. 

7.టీ తాగడం తగ్గించడం  జీర్ణ సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది, ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగటం అలవాటు ఉన్న వారిలో కొంతమందికి  స్టొమక్ లైనింగ్‌ సమస్యలు మరియు చికాకు వంటివి రావొచ్చు. 

8.టీ నీ ప్రతీ రోజు స్వీకరిస్తే దంతాల మీద మచ్చలు వంటివి ఏర్పడతాయి. టీ తాగడం మానడం ప్రకాశవంతమైన చిరునవ్వుకు మరియు మెరుగైన దంత ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.

9.కొంతమందికి టీ తీసుకోవడం వల్ల వారికి ఓర్పు మరియు విశ్రాంతి లభిస్తుంది, కాబట్టి దానిని విడిచిపెట్టడం వల్ల సౌకర్యం మరియు సంతృప్తి కోల్పోవడం వంటి మానసిక మార్పులకు దారితీయవచ్చు.

టీ లో అధికంగా కెఫీన్ ఉంటుంది, గర్భిణీ లేదా పాలిచ్చే స్త్రీలు టీ నీ తీసుకోవడం తగ్గించాలి, ఎందుకంటే అది పిండం అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది మరియు తల్లి పాల ద్వారా శిశువులకు పంపబడుతుంది. ఐరన్-డెఫిషియన్సీ అనీమియా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే టీలోని టానిన్లు ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తాయి.