చెక్కెరకు బదులు బెల్లం, తేనె మంచివేనా?

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ డైైట్ ఫాలో అవుతున్నారు. ఎంతలా డైట్ ఫాలో అయినా కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ నేటి రోజుల్లో చాలా మంది షుగర్ వ్యాధితో సఫర్ అవుతున్నారు. షుగర్ వ్యాధి వస్తే తీపి పదార్థాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తారు. తీపి పదార్థాలతో పాటు అసలు మనం తినే తిండి విషయంలోనే జాగ్రత్త వహించాలని అంతా చెబుతారు. అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు కనుక షుగర్ ఒకసారి అటాక్ అయితే […]

Share:

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ డైైట్ ఫాలో అవుతున్నారు. ఎంతలా డైట్ ఫాలో అయినా కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ నేటి రోజుల్లో చాలా మంది షుగర్ వ్యాధితో సఫర్ అవుతున్నారు. షుగర్ వ్యాధి వస్తే తీపి పదార్థాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తారు. తీపి పదార్థాలతో పాటు అసలు మనం తినే తిండి విషయంలోనే జాగ్రత్త వహించాలని అంతా చెబుతారు. అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు కనుక షుగర్ ఒకసారి అటాక్ అయితే దాని నుంచి మనం కోలుకోవడం చాలా కష్టం. అందుకోసమే షుగర్ వ్యాధి రాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. కొంత మంది ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కానీ షుగర్ అనేది అటాక్ అవుతుంది. అటువంటి సమయంలో ఎవరూ ఏమీ చేయలేరు. ఇలా చిన్న వయసులో షుగర్ అటాక్ కావడానికి మన లైఫ్ స్టైల్ కూడా ఒక కారణంగా ఉంటుంది. అందుకోసమే ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ను అలవాటు చేసుకోవాలని అంతా చెబుతారు. కానీ అందుకు కొంత మందికి సాధ్యపడదు. మనకు తెలిసో తెలియకో కావాలనో లేక అవసరం కొద్దో కొన్ని సార్లు జంక్ ఫుడ్ తింటూ ఉంటాం. షుగర్ అటాక్ అయిన వారు చెక్కెరను తీసుకోకూడదని చెబుతారు. అటువంటి వారు చెక్కెరకు బదులు తీపిగా ఉండే బెల్లం తీసుకోవచ్చని కొంత మంది చెబితే మాత్రం బెల్లం అనేది అస్సలు తీసుకోకూడదని దాని వలన అనేక దుష్ప్రయోజనాలు కలుగుతాయని అంతా చెబతారు. బెల్లం విషయంలో అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. వాటిని అనేక మంది వైద్యులు కొట్టి పారేస్తున్నారు. చెక్కెరకు బదులు బెల్లం తీసుకోవడం గురించి వైద్యులు ఏం చెబుతున్నారో ఓ సారి పరిశీలిస్తే.. 

అదనపు పోషకాలు పొందే అవకాశం

చెక్కెర ను తీసుకోవడం వలన అందులో ఉండే కేలరీలు మన శరీరానికి హాని చేస్తాయి. మనకు ఇది వరకే షుగర్ ఉన్నపుడు అదనపు కేలరీలను తీసుకోవడం చాలా ప్రమాదకరం. అందుకే కొంత మంది చెక్కెర స్థానంలో తేనె, బెల్లం లేదా బ్రౌన్ షుగర్‌ని జోడిస్తారు. అదనపు కేలరీలను పొందే బదులు అదనపు పోషకాలను పొందుతారు. అదనపు కేలరీలను పొందడం వలన మనకు హాని కలుగుతుంది. కానీ అదనపు పోషకాలు అనేవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కావున ఇలా అదనపు పోషకాలు పొందడం చాలా మంచిది. అంతే కాకుండా ఈ అదనపు పోషకాలు అనేవి మానవ రక్తంలో చక్కెర నిర్వహణకు కూడా మంచివని చాలా మంది నమ్ముతారు. కానీ కొంత మంది మాత్రం ఇలా చెక్కెరకు బదులు వేరేవి వాడడం మంచిది కాదని అపోహ పడతారు. 

ఇటువంటి అపోహల విషయంలో డాక్టర్లు కొన్ని సూచనలు చేస్తున్నారు. 

బ్రౌన్ షుగర్

బ్రౌన్ షుగర్ అనేది తెల్ల చక్కెర, దానికి తిరిగి జోడించిన మొలాసిస్. మొలాసిస్ రుచితో పాటు రిచ్ బ్రౌన్ కలర్‌ను అందిస్తుంది. ఇది తెల్ల చక్కెరతో పోలిస్తే కొంచెం ఎక్కువ ఖనిజాలు మరియు తేమను కలిగి ఉంది, అయితే ఈ రెండూ ఇప్పటికీ ప్రాథమికంగా సుక్రోజ్‌తో కూడి ఉంటాయి. బ్రౌన్ షుగర్ నుంచి మొలాసిస్ మెరిసే స్ఫటికాకార తెల్లని చక్కెరను ఏర్పరచడానికి వివిధ ప్రక్రియల ద్వారా తొలగించబడుతుంది.

తేనె 

తేనె అనేది దాని స్వచ్ఛమైన రూపంలో ఉన్నపుడు కొంత మొత్తంలో విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో అదనపు చక్కెరలు లేదా సంరక్షక సంకలనాలు ఉండవు. మరోవైపు, వాణిజ్యపరంగా విక్రయించబడే తేనెలో తరచుగా రుచులు, చక్కెర మరియు రంగులు వంటి అదనపు ప్రిజర్వేటివ్స్ ను జోడిస్తారు. అందుకే ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎవరైనా కస్టమర్లు ఈ తేనెను చూడగానే కొనేందుకు ఉత్సాహం చూపుతారు. వారి మార్కెటింగ్ కు కూడా ఇది తోడ్పడుతుంది. 

బెల్లం.. 

బెల్లం అనేది చెరకు రసాల నుంచి తయారు చేయబడుతుంది. తెల్ల చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఇది ప్రజాదరణను పొందింది. అందుకోసమే చాలా మంది తీయదనం కోసం చెక్కెరకు బదులు బెల్లాన్ని వాడతారు. ఇలా వాడడం మంచిదని కొంత మంది చెబుతుంటే కొంత మంది మాత్రం ఇది దుష్రయోజనాలను కలిగిస్తుందని వాదిస్తున్నారు. 

చెక్కెరకు బదులు తేనె లేదా బెల్లం తీసుకోవడం మంచిదేనా?

చాలా మంది చెక్కెరకు బదులుగా బెల్లం లేదా తేనెను తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం మంచిదని కొంత మంది చెబుతుంటే అంత మంచిది కాదని కొందరు వాదిస్తున్నారు. ఇలా చేయడం మంచిదా కాదా అనే విషయంలో అనేక అపోహలు ఉన్నాయి. తెల్లని చక్కెరకు బదులుగా బెల్లం లేదా తేనెను తీసుకోవడం వల్ల ఒకరి ఆహారంలో పోషకాలు స్వల్పంగా పెరుగుతాయి. అయినప్పటికీ, పోషకాహారాన్ని పెంచడం కోసం మాత్రమే ఆహారంలో అదనపు బెల్లం లేదా తేనె జోడించడం మంచిది కాదు. తక్కువ కేలరీల మూలాల నుంచి విటమిన్లు మరియు ఖనిజాలను పొందడం సాధారణంగా మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.