షుగర్ పేషెంట్లకు అరటిపండ్లు ఆరోగ్యకరమా? హానికరమా? ఇక్కడ తెలుసుకోండి

అరటిపండ్లలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుందని అంటారు. షుగరు వ్యాధిపై వాటి ప్రభావం ఏమిటి? ఎలా ఉంటుంది? షుగరు వ్యాధి ఉన్నవాళ్ళు వాటిని తినవచ్చా? తినకూడదా? అనే ప్రశ్నలు ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. మధుమేహం, డయాబెటిస్, షుగర్ వ్యాధి ఇవన్నీ దాని పేర్లు.  సాధారణంగా వంశపారంపర్యంగా, లేదా అస్తవ్యస్తమైన జీవనశైలి, లేదా ఆహారపు అలవాట్ల వల్ల  వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా షుగర్ పేషెంట్ల సంఖ్య పెరుగుతుందనేది వాస్తవం. మన ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం వల్లనే ఈ వ్యాధి బారిన […]

Share:

అరటిపండ్లలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుందని అంటారు. షుగరు వ్యాధిపై వాటి ప్రభావం ఏమిటి? ఎలా ఉంటుంది? షుగరు వ్యాధి ఉన్నవాళ్ళు వాటిని తినవచ్చా? తినకూడదా? అనే ప్రశ్నలు ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉన్నాయి.

మధుమేహం, డయాబెటిస్, షుగర్ వ్యాధి ఇవన్నీ దాని పేర్లు.  సాధారణంగా వంశపారంపర్యంగా, లేదా అస్తవ్యస్తమైన జీవనశైలి, లేదా ఆహారపు అలవాట్ల వల్ల  వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా షుగర్ పేషెంట్ల సంఖ్య పెరుగుతుందనేది వాస్తవం. మన ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం వల్లనే ఈ వ్యాధి బారిన పడుతున్నవాళ్ళు పెరుగుతున్నారనడానికి ఇదే నిదర్శనం. సాధారణంగా ఈ షుగరు వ్యాధిని నియంత్రించడానికి ఆరోగ్యకరమైన ఆహారం, కొన్ని మంచి అలవాట్లు చాలా అవసరం. ఈ వ్యాధి ఉన్నవాళ్ళకు తీపి పదార్థాలే పెద్ద విలన్లు. షుగర్ వ్యాధి ఉన్న రోగులకు తరచుగా ఏమి తినాలో ఏది తినకూడదో, లేదా నియంత్రించాలో తెలియకపోవడం చాలా పెద్ద సమస్యగా ఉంటుంది. అరటిపండ్లలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుందని అంటారు. షుగరు వ్యాధిపై వాటి ప్రభావం ఏమిటి? ఎలా ఉంటుంది? షుగరు వ్యాధి ఉన్నవాళ్ళు వాటిని తినవచ్చా? తినకూడదా? అనే ప్రశ్నలు ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉన్నాయి.

GI ఇండెక్స్ 

డయాబెటిక్ రోగులకు, ఏదైనా ప్రొడక్ట్ తీసుకునే ముందు దాని గ్లైసెమిక్ ఇండెక్స్‌‌(GI)ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా పదార్థంలో GI ఇండెక్స్ తక్కువగా ఉన్నట్లయితే షుగర్ పేషెంట్లు షుగర్ పరంగా నియమిత మోతాదులో ఆ ఆహార పదార్థాన్ని తీసుకోవచ్చు.

అరటిపండ్ల మాటకొస్తే, వాటిలో మెగ్నీషియం, ఫైబర్, విటమిన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవాళ్ళు అరటిపండ్లను తినవచ్చు, అయితే ముందుగా వారి రక్తంలోని చక్కెర స్థాయిలను పరీక్షించాలి. అరటిపండ్లలో GI స్కోర్‌ తక్కువగా ఉంటుంది కాబట్టి, షుగర్ రోగులు ఎక్కువగా పండిన వాటి కంటే ఉడికించిన పచ్చి అరటికాయలు , లేదా కొద్దిగా పండిన అరటిపండ్లను తినవచ్చు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, అరటిపండ్లలో ఫ్రక్టోజ్, అంటే పండ్లలో ఉండే చక్కెర, తక్కువగా ఉంటుంది. ఒక రకమైన పండ్లను షుగర్ బాధితులు తినవచ్చు. కానీ, డయాబెటిస్ ఉన్న పిల్లలు మాత్రం రక్తంలో చక్కెర పెరిగిన తర్వాత అరటిపండ్లను తినకూడదు.

అరటిపండును సరైన మోతాదులో తీసుకోవడం అంటే ఏమిటి?

ఒకవేళ మీకు రక్తంలో షుగరు నియంత్రణలో ఉంటే గనక వారానికి రెండు లేదా మూడుసార్లు అరటిపండ్లను తినవచ్చు. అయితే, దీని కంటే ఎక్కువ అరటిపండ్లు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది, ఇది సమస్యలకు దారితీస్తుంది. కానీ బాగా మగ్గిన అరటిపండ్లు తినడం మంచిది కాదని గుర్తుంచుకోండి, ఎందుకంటే అలా చేస్తే ఆ పండు యొక్క GI స్థాయి పెరుగుతుంది. పండిన అరటిపండ్లలో GI రేటింగ్‌ 50 ఉంటుంది. అయితే పచ్చి అరటిపండ్లలో అది 30 మాత్రమే.  అందువల్ల, మధుమేహం ఉన్నవారికి పచ్చివి (ఉడికించిన పచ్చి లేదా కచ్చా అరటికాయలు అంటే, కూర రూపంలో) లేదా కొద్దిగా మాగిన అరటిపండ్లను తినడం మంచిది.

ఉదయాన్నే గానీ, సాయంత్రం  గానీ తినవచ్చు

మధుమేహం ఉన్నవారు అరటిపండ్లను ఉదయాన్నే అల్పాహారంలో తినడం మంచిది. అరటిపండ్లలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఉదయాన్నే దీనిని తినడం వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. ఇది జీర్ణవ్యవస్థకు ఒక వరం. 

డయాబెటిస్ ఉన్నవాళ్ళకి అరటి పండు మంచిదా కాదా అనే మీ సందేహం తీరిందనుకుంటాను! GI ఇండెక్స్ గురించి తెలిసింది కాబట్టి నిరభ్యంతరంగా అరటిపండ్లను తినేయండి. 

కానీ మితంగానే సుమా! ఈ మాట మరచిపోకండి!