కూరకి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. అందానికి అందం అందించే కొత్తిమీర గురించి తెలుసుకోవాల్సిందే..

ఇంటి పెరట్లోనూ బాల్కనీలోని కుండీలో కాసిన్ని ధనియాల గింజలు వేస్తే కొత్తిమీర దండిగా పెరుగుతుంది. మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకునేటప్పుడు చివరిగా కొత్తిమీర కట్ట లేకపోతే ఆ సంచిలో ఏదో లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇక వంటగది అంతా వెలవెల బోతుంది. పచ్చడిని, సాంబారైనా, గుత్తొంకాయ కూర అయినా కొత్తిమీర వేయకపోతే రుచించదు. కొత్తిమీర కూరకి అందాన్ని ఆకర్షణను మాత్రమే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా ఎంతో మేలు చేస్తుంది. కొత్తిమీర ఆకులు తింటే ఎలాంటి […]

Share:

ఇంటి పెరట్లోనూ బాల్కనీలోని కుండీలో కాసిన్ని ధనియాల గింజలు వేస్తే కొత్తిమీర దండిగా పెరుగుతుంది. మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకునేటప్పుడు చివరిగా కొత్తిమీర కట్ట లేకపోతే ఆ సంచిలో ఏదో లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇక వంటగది అంతా వెలవెల బోతుంది. పచ్చడిని, సాంబారైనా, గుత్తొంకాయ కూర అయినా కొత్తిమీర వేయకపోతే రుచించదు. కొత్తిమీర కూరకి అందాన్ని ఆకర్షణను మాత్రమే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా ఎంతో మేలు చేస్తుంది. కొత్తిమీర ఆకులు తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆరోగ్యానికి కొత్తిమీర..

1. కొత్తిమీర ఆకులు తింటే కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ, సి , యాంటీ ఆక్సిడెంట్లు, ఫాస్ఫరస్ విజన్ డిజార్డర్స్ ని తగ్గిస్తుంది. కంటిమీద ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇందులో ఉండే బీటా కెరోటిన్ వల్ల వయసు పెరగడంలో వచ్చే డిజనరేటివ్ ఎఫెక్ట్స్ ని కొత్తిమీర రివర్స్ చేయగలదు. కండ్లకలక రాకుండా ప్రివెంట్ చేస్తుంది. కొత్తిమీర తింటే కంటికి చాలా మంచిది. 

2. ఇప్పుడంటే పళ్ళని టూత్ పేస్ట్ తో కడుక్కుంటున్నాం. కానీ మన పెద్దవాళ్లు ధనియాలు నమ్మిలేవారు యాంటీ సెప్టిక్ టూత్ పేస్ట్ లో తప్పనిసరిగా కొత్తిమీర ఉంటుంది. కొత్తిమీర తినడం వల్ల నోటి దుర్వాసనను, నోటి పుండ్లను పోగుడుతుంది.

3. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు కొత్తిమీరని తింటే మంచిదని డాక్టర్స్ చెబుతున్నారు. హార్ట్ ఎటాక్,  స్ట్రోక్స్ రాకుండా చేస్తుందని చెబుతున్నారు. కొత్తిమీర ఆకులు నమలడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ కరుగుతుంది. అంతేకాకుండా డయాబెటిక్ లెవెల్స్ ని కూడా నియంత్రణలో ఉంచుతుంది. 

4. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి న్యూరో డిజనరేటివ్ డిసీజెస్ ని ప్రివెంట్ చేస్తాయి. తరచూ కొత్తిమీర తీసుకుంటే క్యాన్సర్, అల్జీమర్స్ వంటి సమస్యలను నయం చేస్తుంది. ఆస్టియోపోరాసిస్ వ్యాధులతో బాధపడుతున్న వారు కొత్తిమీర తీసుకోమని వైద్యులు తరచూ చెబుతున్నారు. ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండటానికి కొత్తిమీర మంచి ఫుడ్ గా సలహా ఇస్తున్నారు. ఇంకా బోన్ డీగ్రేడేషన్, బోన్ రీ గ్రోత్ కి కొత్తిమీర మేలు చేస్తుంది. 

5. కొత్తిమీరలో ఉండే ఎసోర్బిక్ యాసిడ్, పామిటిక్ యాసిడ్, లైనోలిక్ యాసిడ్, స్టెరిక్ యాసిడ్ హార్మోన్స్ ను సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. ఫలితంగా మెనుస్ట్రువల్ సైకిల్ సక్రమంగా ఉండటమే కాకుండా నొప్పులు రాకుండా చేస్తుంది. 

అందానికి కొత్తిమీర:

1. కొత్తిమీర ఆకులను మెత్తగా నలిపి ఆ మిశ్రమాన్ని పెదవుల పైన రుద్దితే పెదవులపై పేరుకుపోయిన డెడ్ స్కిన్ స్కేల్ ని రిమూవ్ చేసి పెదాలను మృదువుగా, మెరిసేలా చేస్తుంది. కొత్తిమీర జ్యూస్ లో ఒక చెంచా నిమ్మరసం కలిపి రోజు రాత్రి నిద్రపోయే ముందు పెదాలకు రాసి నిద్రపోవాలి. ఇలా వారం రోజులపాటు చేస్తే మృదువైన ఎర్రటి పెదాలు మీ సొంతం.

2. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కొత్తిమీర ఎంతో మేలు చేస్తుంది. కొత్తిమీరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్, డిస్ ఇంఫేక్టెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి మీ చర్మంపై ఉన్న జిడ్డుని పోగొట్టి కాంతివంతం చేస్తుంది. కొత్తిమీర రసాన్ని మీ ముఖానికి రాసుకొని 15 నిమిషాల పాటు ఉంచి ఆ తరువాత చల్లటి నీటితో కడిగేస్తే మీ అందం రెట్టింపు అవుతుంది. 

3. కొత్తిమీర రసంలో అలోవెరా జెల్ కలిపి మీ ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడిగేస్తే మీ ముఖం ముడతలు పడకుండా వృద్ధాప్య ఛాయలు తొలగిపోయేలా చేస్తుంది.

4. యాక్నే, బ్లాక్ హెడ్స్ ఉన్నవారు కొత్తిమీర ఆకుల రసంలో నిమ్మరసం కలిపి రాస్తే ఈ సమస్య నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.