అల్జీమర్స్ వ్యాధి: ఈ వ్యాధి రావడానికి ముఖ్యమైన కారణాలు ఇవే..

అల్జీమర్స్ అంటే మెదడులోని కణాలు చనిపోతుండడం వల్ల వచ్చే నాడీ సంబంధిత వ్యాధినే మనం అల్జీమర్స్ అని అంటాము.  దీనివల్ల జ్ఞాపకశక్తి , ఆలోచనా సామర్థ్యం రెండూ దెబ్బతింటాయి.  ఇటీవల జరిగిన సంఘటనలు లేదా విషయాలను మర్చిపోవడంతో మొదలై క్రమంగా పెరిగి చివరికి తాను ఎవరో కూడా తెలియని స్థాయికి ఈ మతిమరుపు సమస్య విస్తరిస్తుంది. ఈ అల్జీమర్స్ సమస్యనే మతిమరుపు అని కూడా అంటారు.. ముఖ్యంగా 65 సంవత్సరాలు దాటిన ప్రతి 9 మందిలో ఒకరు […]

Share:

అల్జీమర్స్ అంటే మెదడులోని కణాలు చనిపోతుండడం వల్ల వచ్చే నాడీ సంబంధిత వ్యాధినే మనం అల్జీమర్స్ అని అంటాము.  దీనివల్ల జ్ఞాపకశక్తి , ఆలోచనా సామర్థ్యం రెండూ దెబ్బతింటాయి.  ఇటీవల జరిగిన సంఘటనలు లేదా విషయాలను మర్చిపోవడంతో మొదలై క్రమంగా పెరిగి చివరికి తాను ఎవరో కూడా తెలియని స్థాయికి ఈ మతిమరుపు సమస్య విస్తరిస్తుంది. ఈ అల్జీమర్స్ సమస్యనే మతిమరుపు అని కూడా అంటారు.. ముఖ్యంగా 65 సంవత్సరాలు దాటిన ప్రతి 9 మందిలో ఒకరు ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. కేవలం వృద్ధులకు మాత్రమే పరిమితమైంది మాత్రం కాదు.

పలు సందర్భాలలో 40, 50 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తులలో కూడా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది.. అయితే ఈ సమస్య ఈ వయసు వారికి రావడానికి కారణం అధిక ఒత్తిడి , మానసిక కృంగుబాటు, మహిళల్లో అయితే మోనోపాజ్ వంటి లక్షణాలు ఎక్కువగా కనిపించినప్పుడు ఈ వ్యాధి కనబడుతుంది.. మెదడులో జరిగే మార్పులు దానిని దెబ్బతీసే పరిణామాల కారణంగా ఈ సమస్య వస్తుంది. ఈ వ్యాధి ముదిరినకొద్దీ ఆలోచించడం ఆపేస్తారు.  తినడం, మాట్లాడడం, సాధారణ స్థితి, వంటి సహజ సామర్ధ్యాలను కోల్పోతారు. అలాగే వయసు పైబడిన కొందరిలో అనివార్యంగా ఈ సమస్య వస్తుందని చెప్పాలి. ఈ సమస్య రావడానికి అత్యంత ప్రభావితమైన ఐదు కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం..

ఇకపోతే ఈ మధ్యకాలంలో చాలా మంది తమకు తెలియకుండానే ముక్కు లోపల వేలు పెట్టి శుభ్రం చేయడంలో ఆలోచించకుండా నిమగ్నం అవుతూ ఉంటారు.  ఇలా అలవాటుగా ఉన్నా లేదా ముక్కు తీయడం అనేది మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది అప్పుడు ఈ వ్యాధికి కారణం అవుతుంది. తరచూ ముక్కు తీయడం అనేది అల్జీమర్స్ వ్యాధికి కారణం కావచ్చు. ఎందుకంటే ఇది నాసిక కుహరాన్ని దెబ్బతీస్తుంది. ఆపై బ్యాక్టీరియా ఘ్రాణ నాడి ద్వారా మెదడులోకి ప్రవేశిస్తుంది. ఇది వాసనకు బాధ్యత వహిస్తుంది. ఘ్రాణ నాడి ద్వారా మెదడు యొక్క హిప్పో క్యాంపస్ కు ప్రత్యక్ష మార్గాన్ని కలిగి ఉంటుంది.  ఇది జ్ఞాపకశక్తి మరియు అభ్యాసానికి కీలకము నాసిక కుహరంలో దీర్ఘకాలిక మంట, ఎక్కువగా ముక్కు తీయడం వల్ల హిప్పో క్యాంపస్ ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. ఫలితంగా మెదడు కణాలు దెబ్బతీస్తుంది. అంతేకాదు అల్జీమర్స్ వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు అవిలాయిడ్ ఫలకాలు మరియు టౌ టాంగిల్స్ వంటి అసాధారణ ప్రోటీన్లు పేరుకు పోవడానికి దారితీస్తుంది.

ఇదే కాదు ఈ అల్జీమర్స్ వ్యాధి రావడానికి కారణం నిద్ర సరిపోకపోవడం.. మెదడు ఆరోగ్యంలో నిద్ర కీలకపాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇది మెదడు విశ్రాంతి తీసుకోవడానికి, రీఛార్జ్ చేయడానికి అలాగే జ్ఞాపకాలను ఏకీకృతం చేయడానికి అనుమతిస్తుంది. లేదా నిద్ర సరిపోకపోవడం అనేది జ్ఞాపకశక్తి కోల్పోవడానికి దారితీస్తుంది. ఫలితంగా అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.

నిశ్చలమైన జీవనశైలి:

వ్యాయామం తక్కువచేసే వారిలో లేదా శారీరక శ్రమ లేకుండా నిశ్చల జీవనశైలిని పాటించే వ్యక్తులలో కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. రెగ్యులర్ గా శారీరక వ్యాయామం చేయడం వల్ల మెదడుకు రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. ఇది కొత్త కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఎప్పుడైతే పనిచేయకుండా శరీరానికి విశ్రాంతి ఇస్తామో అప్పుడు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.

దీర్ఘకాలిక ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఒంటరితనం వంటి కారణాల వల్ల కూడా అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.