స్కిన్ కేర్ కోసం అద్భుతమైన ఫలితాలిచ్చే అలోవెరా జెల్

చర్మానికి దివ్యౌషధం అలోవెరా, ప్రయోజనాలను తెలుసుకోండిస్కిన్ కేర్ కోసం పుష్కలమైన ప్రయోజనాలున్న అలోవెరా ఉపయోగించండి మన పెరటిలో, బాల్కనీలో పెరిగే అలోవెరా మొక్క మన చర్మ సంరక్షణకు అనేక ప్రయోజనాలను అందిస్తుందని మనం ఊహించి కూడా ఉండము. మీరు ఎలాంటి డబ్బు ఖర్చు చేయకుండా మీ చర్మాన్ని మెరిసేలా చేయాలనుకుంటే అలోవెరా జెల్ కంటే మెరుగైన ఎంపిక మరొకటి ఉండదు. అలోవెరా జెల్ అనేక మూలికలు, ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మీ చర్మం, జుట్టుకు సంబంధించిన […]

Share:

చర్మానికి దివ్యౌషధం అలోవెరా, ప్రయోజనాలను తెలుసుకోండి
స్కిన్ కేర్ కోసం పుష్కలమైన ప్రయోజనాలున్న అలోవెరా ఉపయోగించండి

మన పెరటిలో, బాల్కనీలో పెరిగే అలోవెరా మొక్క మన చర్మ సంరక్షణకు అనేక ప్రయోజనాలను అందిస్తుందని మనం ఊహించి కూడా ఉండము. మీరు ఎలాంటి డబ్బు ఖర్చు చేయకుండా మీ చర్మాన్ని మెరిసేలా చేయాలనుకుంటే అలోవెరా జెల్ కంటే మెరుగైన ఎంపిక మరొకటి ఉండదు. అలోవెరా జెల్ అనేక మూలికలు, ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మీ చర్మం, జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలను తొలగించడంలో ఇది సహాయకరంగా ఉంటుంది. ఈ మొక్కలో పారదర్శకమైన జెల్ ఉంటుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఎంజైమ్‌లు, సాలిసిలిక్ యాసిడ్, లిగ్నిన్, సపోనిన్ మరియు అమినో యాసిడ్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఇందులోని సహజ పోషకాలు చర్మానికి మాత్రమే కాకుండా మీ జుట్టు మృదుత్వం, షైన్ అందించడంలో సహకరిస్తుంది.

కలబందలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లకు చర్మపు మచ్చలు, అసమాన టోన్‌లను సరిచేయగల సామర్థ్యం ఉంది. అలోవెరా జెల్‌ని ఏ రకమైన చర్మానికి అయినా అప్లై చెయ్యడవచ్చు. ఇలా చేయడం వల్ల దాదాపు అన్ని చర్మ సమస్యల నుండి బయటపడవచ్చు. ఒక రకంగా ఇంట్లోనే అలోవెరాని ఉపయోగించి సెలూన్ లాంటి స్కిన్ కేర్ ట్రీట్‌మెంట్‌ను పొందవచ్చు. మీరు అలోవెరా జెల్‌ను అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. అలోవెరాకు సంబంధించిన మరిన్ని ప్రయోజనాలను ఇప్పుడు మనం చూద్దాం.

సహజమైన మాయిశ్చరైజర్

అలోవెరా జెల్ సహజసిద్దమైన మాయిశ్చరైజింగ్ లోషన్‌గా పనిచేస్తుంది. అలోవెరాలో సుమారు 95% నీరు ఉంటుంది. దీనిలోని జెల్ చర్మానికి హైడ్రేటింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. అలోవెరాలోని మూలకాలు చర్మంలో తేమను పోనియ్యకుండా పనిచేస్తాయి. దీంతో ముఖం తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది. అలాగే పొడి బారడాన్ని నివారించడంలో, ముఖంపై ఆయిల్ రాకుండా నియంత్రించడంలో గొప్పగా పనిచేస్తుంది. జెల్‌ను మాయిశ్చరైజర్‌గా ఉపయోగించడం వల్ల కొల్లాజెన్, ఎలాస్టిన్ ఫైబర్స్ రెండింటినీ పెంచడంలో సహాయపడుతుంది. ఈ ప్రోటీన్ స్కిన్ టోన్ కాపాడుతుంది. సున్నితమైన, జిడ్డుగల చర్మం ఉండేవారికి ఇది అద్భుతమైన మాయిశ్చరైజర్‌ అని చెప్పవచ్చు.

స్కిన్ రిపేరింగ్

అలోవెరా జెల్ సహజమైన స్కిన్ హీలర్‌గా పనిచేస్తుంది. కాలుష్యం, ఒత్తిడి కారణంగా చర్మం రంగు కోల్పోయి నిర్జీవంగా మారినట్లయితే రాత్రి పడుకునే ముందు అలోవెరా జెల్‌ తో మసాజ్ చేయడం వల్ల తిరిగి మునుపటి కాంతిని ముఖంలో మళ్లీ పొందవచ్చు.
మొటిమలు మటుమాయం

అలోవెరా జెల్ యాంటీ బ్యాక్టీరియల్‌గా కూడా పనిచేస్తుంది. అలోవెరాని కొన్ని రోజులు కంటిన్యూగా వాడితే ముఖంపై ఉండే మొటిమలన్నీ ఆటోమేటిక్‌గా మాయమవుతాయి.

సన్‌బర్న్‌ను తొలగించడంలో సాయం


అలోవెరాలో అలోసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది సన్‌బర్న్ వల్ల కలిగే టైరోసినేస్‌ను రాకుండా చేస్తుంది. దీంతో స్కిన్‌ని సూర్యుడి నుంచి టాన్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. మీరు ఎక్కువగా బయట తిరిగే వారైతే అలోవెరా జెల్ క్రమం తప్పకుండా ముఖానికి అప్లయి చేయడం ఉత్తమం.
పిగ్మెంటేషన్‌ను తొలగిస్తుంది
శరీరంలో అదనపు మెలనిన్ కారణంగా పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది. దీని వల్ల శరీరంపై డార్క్ స్పాట్స్ వస్తాయి. అలోవెరాలో మెలనిన్ ఉత్పత్తిని నియంత్రించే శక్తి ఉంది. ఇది మచ్చలను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఇందులో ఉండే అలోసిన్ హైపర్‌పిగ్మెంటేషన్ ప్రభావాలను తగ్గిస్తుంది. మీ ముఖం యొక్క సహజ కాంతిని తిరిగి తెస్తుంది. మీ ముఖంపై మచ్చలు, మొటిమలు వస్తున్నట్లయితే అలోవెరాతో వాటిని దరిచేరకుండా చేయవచ్చు.