అల్బేనియాకు టూరిస్టుల వరద..

కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినింది. దీంతో పర్యాటకం మీదే ఆధారపడే చాలా దేశాలు ఆర్థికంగా నష్టపోయాయి. చాలా హోటళ్లు మూతపడిపోయాయి. వేల మంది ఉపాధి దెబ్బతినింది.కరోనా తర్వాత కూడా పర్యాటకం స్పీడ్‌గా అభివృద్ధి చెందలేదు. జనాలు బయటకి రావడానికి భయపడ్డారు. ఒక సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం ఊపందుకుంటుంది. ఆయా దేశాలు విదేశీయల రాకతో కళకళలాడుతున్నాయి.  తాజాగా అల్బేనియాకు పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. అల్బేనియాకు ఇటలీ నుంచి ఎక్కువగా టూరిస్టులు వస్తుంటారు. […]

Share:

కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినింది. దీంతో పర్యాటకం మీదే ఆధారపడే చాలా దేశాలు ఆర్థికంగా నష్టపోయాయి. చాలా హోటళ్లు మూతపడిపోయాయి. వేల మంది ఉపాధి దెబ్బతినింది.కరోనా తర్వాత కూడా పర్యాటకం స్పీడ్‌గా అభివృద్ధి చెందలేదు. జనాలు బయటకి రావడానికి భయపడ్డారు. ఒక సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం ఊపందుకుంటుంది. ఆయా దేశాలు విదేశీయల రాకతో కళకళలాడుతున్నాయి. 

తాజాగా అల్బేనియాకు పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. అల్బేనియాకు ఇటలీ నుంచి ఎక్కువగా టూరిస్టులు వస్తుంటారు. ఫ్లైట్‌లలో, షిప్‌లలో ఇక్కడకు వస్తుంటారు. టూరిస్టుల సంఖ్యభారీగా పెరిగింది. ఎంతలా అంటే రెస్టారెంట్‌లో ఫుడ్‌ దొరకని పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఓ రెస్టారెంట్‌కు వచ్చిన ఇటాలీయన్లు మెనులోని ఫుడ్‌ ఆర్డర్‌‌ చేయగా, ఓ వెయిటర్‌‌ వచ్చి, ఇక్కడ మీరు ఆర్డర్‌‌ చేసిన ఫుడ్‌ లేదని చెప్పాడు. మీరు ఆర్డర్ చేసిన ఫుడ్‌ మాత్రమే కాదు… మెనులో ఉన్న ఏ ఐటెమ్‌ కూడా లేదని, మొత్తం ఫుడ్‌ అయిపోయిందని ఆ వెయిటర్‌‌ వారికి క్షమాపణ చెప్పాడు. ఇక్కడకు వచ్చిన ఇటాలీయన్లు ప్రతి ఐటెమ్‌  తినేశారు. మళ్లీ ఇటాలియన్లు అల్బేనియాను ఆక్రమించుకున్నారు అని ఆ వెయిటర్‌‌ జోక్‌ చేశాడు.గ్రీక్‌ బార్డర్‌‌కు సమీపంలో దక్షిణాన ఉన్న సరండా ప్రాంతానికి వేల సంఖ్యలో ఇటాలీయన్‌ పర్యాటకులు వచ్చారు. 

ఈ సందర్భంగా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కొన్నేళ్ల పాటు ముస్సోలినీ ఆధ్వర్యంలో ఇటలీ ఫాసిస్ట్ పాలన అల్బేనియాను ఆక్రమించుకోవడాన్ని కొందరు గుర్తుచేశారు. 

ఇటాలీయన్లే ప్రధాన భాగం…

బాల్కన్‌ ద్వీపకల్పంలో ఉన్న చిన్న దేశం అల్బేనియా. ఇక్కడ ఎనిమిది దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్న, పెరుగుతున్న పర్యాటక వాణిజ్యంలో ఇటాలియన్లే ప్రధాన భాగం, బలం, బలగం. వీరి రాకతో అల్బేనియాలో ఏటా కొన్ని వేల కోట్ల ఆదాయం పర్యాటకం రూపంలో వస్తుంది. అల్బేనియాలో గతేడాది జీడీపీలో 20 శాతం వాటాను కలిగి ఉంది. ఈ సంఖ్య 2023లో మరింత పెరిగే అవకాశం ఉందని పర్యాటక మంత్రి మిరెలా కుంబారో తెలిపారు.

ఇటాలియన్లు అడ్రియాటిక్ సముద్రం మీదుగా 80 కిలోమీటర్ల (50 మైళ్లు) దూరం నుంచి రాయితీ విమానాలు (డిస్కాంట్‌ ఫ్లైట్‌), ఫెర్రీ (షిప్‌లు, ఓడలు) ద్వారా అల్బేనియాకు వస్తుంటారు. ఇటాలియన్లు, ఇతర యూరోపియన్లు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. అల్బేనియాలో ఉన్న నేచురల్‌ ఇసుక బీచ్‌లు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు టూరిస్టులను కట్టిపడేస్తాయి. అందుకే చాలా మంది దీనిని పర్యాటక డెస్టినేషన్‌ ప్రాంతం అని అంటారు. ఇటలీ, ఫ్రాన్స్‌ వంటి దేశాల నుంచి హాలీడే వెకేషన్‌ కోసం ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ధరలు తక్కువగా ఉండటడం కూడా పర్యాటకులను ఆకర్షించడానికి ఓ కారణమని ఆ దేశ అధికారులు పేర్కొంటున్నారు.

‘‘సంవత్సరాల నుంచి మేము అల్బేనియా గురించి విన్నాం. మంచి బీచ్‌లతో పాటు తక్కువ ధరలు ఇక్కడున్నాయని తెలిసింది. అందుకే ఈ సంవత్సరం ఫ్రెండ్స్‌ తో కలిసి ఇక్కడికి వచ్చాం” అని ఇటాలీయన్‌ టూరిస్ట్ డానియోలా అనే వ్యక్తి చెప్పాడు.

‘‘ప్రస్తుతం ఇక్కడ 80 శాతం మంది విదేశీయలు ఉన్నారు. మిగిలిన వారు అల్బేనియన్లు ఉన్నారు” అని సరండా సమీపంలోని బీచ్‌ మేనేజర్‌‌  అరోరా మార్క్‌ అన్నాడు.

2022లోని ఇదే నెలతో పోలిస్తే ఈ జులైలో పర్యాటకుల సంఖ్య 25 శాతంపెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. 2023 సంవత్సరంలో మొదటి ఏడు నెలల్లో 5.1 మిలియన్లకు పైగా విదేశీయులు  ఇక్కడకు వచ్చారు. అందులో 4,30,000 మంది ఇటాలియన్లు ఉన్నారు. ఇది గతేడాది కంటే 50 శాతం ఎక్కువ. ఇదే సమయంలో గతేడాది 3.9 శాతంగా ఉంది. 

తక్కువ ఖర్చు చేసే వారు అక్కర్లేదు..

అల్బేనియాలో నాణ్యమైన పర్యాటకులు కలిగి ఉండటానికి కృషి చేస్తోంది అని పర్యాటక మంత్రి కుంబారా తెలిపారు. తక్కువ రోజులు ఉండి, ఖర్చు చేయని పర్యాటకులు  మిలియన్ల మంది వచ్చినా మాకు అవసరం లేదు అని ఆమె అన్నారు. అల్బేనియాలో కమ్యూనిస్ట్ నియంత ఎన్వర్‌‌ హోక్షా ఆధ్వర్యంలో దాదాపు దాదాపు 50 ఏండ్లుగా ఈ దేశం ఒంటరిగా ఉంది. ఈ సమయంలో ఎవరూ దేశం విడిచి వెళ్లలేదు. అలాగే, విదేశీ పర్యాటకులను నిషేధించారు. 

జులైలో అల్బేనియాలో 10 వేల మంది ఇటాలియన్లు వచ్చారని, అందులో ప్రధాన మంత్రి జార్జియా కూడా ఉన్నారు. అక్కడి రెస్టారెంట్లు, హోటళ్లలో తిని పారిపోయిన స్వదేశీయులు బిల్లు కూడా ఆమె చెల్లించింది. ఆమె చేసిన పనికి సరడాలోని రెస్టారెంట్‌ యజమానులు స్వాగతించారు.