మెనోపాజ్ తరువాత రక్తస్రావం అయితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయట…

మెనోపాజ్ అంటే మహిళల్లో నెలసరి ఆగిపోయే దశ. సాధారణ పరిస్థితిలో వరుసగా ఏడాది పాటు నెలసరి రాకపోతే వారు మెనోపాజ్ దశలోకి అడుగు పెట్టారని అర్థం. అయితే ఈ సమయంలోనే కొంతమందికి అప్పుడప్పుడూ రక్తస్రావం కనిపిస్తుంది. మరి నెలసరి ఆగిపోయినా బ్లీడింగ్ అవుతుంది అంటే.. అది ఖచ్చితంగా ఏదో ఒక ప్రమాదకరమైన వ్యాధి, లేదంటే.. సమస్యకు గురి చేస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిక నేర్చుకున్నారు.  అందుకే ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలని వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని, […]

Share:

మెనోపాజ్ అంటే మహిళల్లో నెలసరి ఆగిపోయే దశ. సాధారణ పరిస్థితిలో వరుసగా ఏడాది పాటు నెలసరి రాకపోతే వారు మెనోపాజ్ దశలోకి అడుగు పెట్టారని అర్థం. అయితే ఈ సమయంలోనే కొంతమందికి అప్పుడప్పుడూ రక్తస్రావం కనిపిస్తుంది. మరి నెలసరి ఆగిపోయినా బ్లీడింగ్ అవుతుంది అంటే.. అది ఖచ్చితంగా ఏదో ఒక ప్రమాదకరమైన వ్యాధి, లేదంటే.. సమస్యకు గురి చేస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిక నేర్చుకున్నారు.  అందుకే ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలని వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని, అందుకు కారణమయిన సమస్య ఏమిటో తెలుసుకొని.. ఆదిలోనే ఆ సమస్యకి చెక్ పెట్టచ్చని చెబుతున్నారు లేదంటే.. దానివల్ల ఇతర అనారోగ్యాలకు దారి తీసే ప్రమాదం ఉందని అంటున్నారు. మరి ఇంతకీ మెనోపాజ్ తర్వాత వెజైనల్ బ్లీడింగ్ ఎందుకు అవుతుంది? ఎలాంటి లక్షణాలు కలిగిస్తాయి. ఎలాంటి చికిత్స ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

మెనోపాజ్ రాకముందు నెల నెల చికాకు పెట్టే రుతుస్రావం మెనోపాజ్ తర్వాత అంతులేని భయాన్ని తెచ్చిపెడుతుంది.. పీరియడ్స్ పూర్తిగా ఆగిపోయిన తర్వాత అప్పుడప్పుడు రక్తస్రావం కనిపించడాన్ని తేలికగా తీసుకోవడానికి వీల్లేదు.. ఎందుకంటే మెనోపాజ్ తర్వాత కనిపించే రక్తస్రావానికి సాధారణ కారణాలు మొదలుకొని ప్రమాదకరమైన క్యాన్సర్ కూడా కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. 

పోస్ట్ మెనోపాజ్ బ్లీడింగ్ అంటే.. పీరియడ్స్ రావడం ఆగిపోయిన ఒక సంవత్సరం తర్వాత బ్లీడింగ్ అయ్యింది అంటే అది ఖచ్చితంగా పోస్ట్ మెనోపాజ్.. రుతుస్రావం రావడం ఆగిపోయిన ఒక సంవత్సరం తర్వాత భార్యాభర్తలు కలిసిన తరువాత బ్లీడింగ్ అయింది అంటే కచ్చితంగా వెళ్లి వైద్యులను సంప్రదించి తగిన సలహాలతో పాటు టెస్టులను కూడా చేయించుకోవాలి. పోస్ట్ మెనోపాజ్ బ్లీడింగ్‌ కొన్నిసార్లు క్యాన్సర్ వల్ల కూడా అవ్వచ్చు. అదే టెస్టులు చేయించి ఆ విషయాన్ని ముందుగానే తెలుసుకుంటే.. క్యాన్సర్‌ను ఆరంభంలోనే అంతం చేయొచ్చు. 

పోస్ట్ మెనోపాజ్ అనేది హార్మోన్స్ అసమతుల్యత వలన చిన్న చిన్న కణితులు యుటెరస్  లైనింగ్ లోపల తయారవడం, ఏదైనా పోస్ట్ మెనోపాజ్ ఇన్ఫెక్షన్ అయి ఉండడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. హార్మోనల్ రీప్లేస్మెంట్ ధెరపి చేయించుకోవడం వల్ల ఆస్పరిన్ టాబ్లెట్స్, బ్లడ్ డిన్నర్ టాబ్లెట్స్ ఉపయోగించడం వలన వాళ్లకి ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గటం వలన కూడా ఈ సమస్య వస్తుంది.

పోస్ట్ మెనోపాజ్ అంటే, పెద్దవయసు వారికే క్యాన్సర్ ప్రమాదం ఉంటుందా అంటే 20 నుంచి 30 సంవత్సరాల లోపు వారికి కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేకపోలేదు. వీరికి ఎండోమెట్రియా క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది.‌ మెనోపాజ్ అయిపోయిన తర్వాత బ్లీడింగ్ అయితే కనుక ఖచ్చితంగా వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు సూచనలను తీసుకోవాలి.

మెనోపాజ్‌కు ముందు శరీరం మార్పులకు లోనవుతుంది. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వేగంగా తగ్గిపోతుంది. ఈ సమయంలో మహిళల్లో పలు లక్షణాలు గమనించవచ్చు.మూడ్ స్వింగ్స్, తరచుగా ఆకలి వేయడం, అకస్మాత్తుగా జుట్టు రాలిపోవడం, మొటిమలు రావడం, శరీరంపై భాగంలో వేడెక్కెడం వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. క్రమపద్ధతిలో హార్మోన్లు తగ్గిపోతే ఈ లక్షణాలు తక్కువగా ఉంటాయని రుజుతా దివాకర్ చెప్పారు.