విటమిన్ డి సప్లిమెంట్స్ తో ఆ వ్యాధులు పరార్..

శరీరంలో ఎముకలు, దంతాలు, కండరాలను హెల్దిగా ఉంచడంలో విటమిన్ డిలక పాత్ర పోషిస్తుంది. పిల్లల్లో రాకెట్స్, ఎముకల సమస్యలు రాకుండా చేస్తుంది. కండరాల సమస్యలు, ఎముకుల నొప్పులు కూడా రాకుండా చేస్తుంది విటమిన్ డి. చాలామంది విటమిన్ డి కి సంబంధించిన ఆహారాలు తీసుకోలేక విటమిన్ డి సప్లిమెంట్స్ ను తీసుకుంటున్నారు. విటమిన్ డి సప్లిమెంట్స్ మన ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తాయో మనందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా పరిశోధకులు విటమిన్ డి సప్లిమెంట్స్ […]

Share:

శరీరంలో ఎముకలు, దంతాలు, కండరాలను హెల్దిగా ఉంచడంలో విటమిన్ డిలక పాత్ర పోషిస్తుంది. పిల్లల్లో రాకెట్స్, ఎముకల సమస్యలు రాకుండా చేస్తుంది. కండరాల సమస్యలు, ఎముకుల నొప్పులు కూడా రాకుండా చేస్తుంది విటమిన్ డి. చాలామంది విటమిన్ డి కి సంబంధించిన ఆహారాలు తీసుకోలేక విటమిన్ డి సప్లిమెంట్స్ ను తీసుకుంటున్నారు. విటమిన్ డి సప్లిమెంట్స్ మన ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తాయో మనందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా పరిశోధకులు విటమిన్ డి సప్లిమెంట్స్ వృద్ధులలో గుండెపోటు రాకుండా చేస్తుందని తెలిపారు. ఆ వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం వలన గుండె సంబంధిత సమస్యలను నివారించవచ్చని తాజా అధ్యయనం తెలిపింది. ఆస్ట్రేలియాకు చెందిన QIMR బోర్గో ఫర్ అనే వైద్య పరిశోధనా సంస్థ నిర్వహించిన డి హెల్త్ ట్రయల్ ఈ విషయాన్ని రుజువు చేసింది. ఐదు సంవత్సరాలుగా ప్రతినెలా క్రమం తప్పకుండా విటమిన్ డి సప్లమెంటు తీసుకుంటున్న వృద్ధులలో గుండెపోటు వంటి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం గణనీయంగా తగ్గిందని ఈ సర్వే చేసిన పరిశోధకులు తెలిపారు. వారి అధ్యయనంలో భాగంగా 60 నుంచి 84 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వృద్ధుల డేటాను సేకరించి పరిశీలించారు. ఈ అధ్యయనంలో మొత్తం 21 వేల మంది ఆస్ట్రేలియన్స్ పాలుపంచుకున్నారు. ఐదు సంవత్సరాల వ్యవధిలో యాదృచ్ఛికంగా నోటి ద్వారా విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకున్న వారికి గుండె జబ్బుల ప్రమాదం తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ ట్రయల్ కు సంబంధించిన ఫలితాలు బి.ఎన్.జే జర్నల్లో ప్రచురితం చేశారు. 

ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న అత్యధిక మరణాలకు ప్రధాన కారణాలలో కార్డియో వాస్కులర్ డిసీజ్ కూడా ఒకటి వయసు పెరిగే కొద్దీ దీర్ఘకాలిక వ్యాధులు చుట్టూ ముడతాయి. ఈ నేపథ్యంలో గుండె సంబంధిత సమస్యల బారిన పడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 17.9 మిలియన్ల మంది ప్రజలు కార్డియో వాస్కులర్ డిసీజ్ బారిన పడుతున్నారు. అంతేకాకుండా ఈ వ్యాధి బారిన పడి ఎంతోమంది వారి ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ఇందులో కరోనరీ హార్ట్ డిసీజ్, రుమాటిక్ హార్ట్ డిసీజ్  లతో నేటి యువత బాధపడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా చేసిన పరిశోధన ఫలితాలు హృద్రోగాలతో బాధపడుతున్న వారిలో ఆశాజనక ఫలితాలను పొందవచ్చు.

విటమిన్ డి అనేది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని గతంలోనూ అనేక అధ్యయనాలు తెలిపాయి. విటమిన్-డి స్థాయిలు ఎక్కువగా ఉన్న వ్యక్తులకు హృదయ సంబంధ వ్యాధులు సోకే అవకాశం కాస్త తక్కువగా ఉంటుందని కూడా పరిశోధనలలో తేలింది . అయితే గతంలోనూ అనేక  పరిశోధనలు  చేసిన ఇంకా స్పష్టత రాలేదు. విటమిన్ డి గుండె సంబంధిత సమస్యలను తగ్గించగలరని స్పష్టత ఇవ్వలేదు . అయితే కాజాగా చేసిన పరిశోధనలో మాత్రం విటమిన్ డి సప్లిమెంట్స్ గుండె జబ్బులను నివారించగలదని సూచించింది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు విటమిన్ డి సప్లిమెంట్స్ ఇవ్వడం వలన హృదయ సంబంధిత సమస్యలు తగ్గే అవకాశం ఉందని ఈ పరిశోధనలో తేలింది. విటమిన్ డి అనేది కొవ్వులో కరిగేది ఇది కాల్షియం పాస్వర్డ్ మెగ్నీషియం సోషల్ లో కీలక పాత్ర పోషిస్తుంది.  శరీర వాపులను తగ్గించడం రోగనిరోధక పనితీరు గ్లూకోజ్ జీవక్రియలోనూ, నాడీ కండరాల్ల ఆరోగ్యంలోనూ, విటమిన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఫలితంగా విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం వలన గుండె సమస్యలు తగ్గే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు తెలిపారు.