అమ్మో! వీటిమీద ఇంత బ్యాక్టీరియా ఉంటుందా…?

వీటి మీద టాయిలెట్ సీట్ మీద ఉన్న బ్యాక్టీరియా కన్నా అధిక బ్యాక్టీరియా ఉంటుంది. మీరు ముట్టుకుంటున్న వస్తువు టాయిలెట్ సీట్ కన్నా అద్వానమైనదని మీకు తెలుసా. మీరు రోజు చేతిలో పట్టుకుని తిరుగుతున్న కొన్ని వస్తువుల మీద టాయిలెట్ సీట్ మీద ఉన్న బ్యాక్టీరియా కన్నా అధిక బ్యాక్టీరియా ఉన్నట్లు ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. రోజువారి ఉపయోగిస్తున్న ఎన్నో వస్తువులు ఇప్పుడు టాయిలెట్ సీట్ కన్నా అద్వానం అని తెలిస్తే, మీరు కచ్చితంగా ఆశ్చర్య పోవడంతో […]

Share:

వీటి మీద టాయిలెట్ సీట్ మీద ఉన్న బ్యాక్టీరియా కన్నా అధిక బ్యాక్టీరియా ఉంటుంది. మీరు ముట్టుకుంటున్న వస్తువు టాయిలెట్ సీట్ కన్నా అద్వానమైనదని మీకు తెలుసా. మీరు రోజు చేతిలో పట్టుకుని తిరుగుతున్న కొన్ని వస్తువుల మీద టాయిలెట్ సీట్ మీద ఉన్న బ్యాక్టీరియా కన్నా అధిక బ్యాక్టీరియా ఉన్నట్లు ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. రోజువారి ఉపయోగిస్తున్న ఎన్నో వస్తువులు ఇప్పుడు టాయిలెట్ సీట్ కన్నా అద్వానం అని తెలిస్తే, మీరు కచ్చితంగా ఆశ్చర్య పోవడంతో పాటు అసహ్యించుకుంటారు. 

మనం టాయిలెట్ సీటు శుభ్రంగా ఉంచుకోవడానికి ఎన్నో రకాల కెమికల్ యూస్ చేసి వాష్ చేస్తూ ఉంటాము కదా. కొన్ని వస్తువులు మనకి తెలియకుండానే అద్వానంగా మారే పరిస్థితి ఉంటుంది. మన ఇంటిని ఎంత అందంగా ఉంచాలనుకున్నా సరే, మనకి తెలియకుండానే కొన్ని వస్తువుల కారణంగా బ్యాక్టీరియాతో నిండిపోతుంది. మన ప్రతిరోజు ముట్టుకుంటున్న వస్తువు బ్యాక్టీరియాతో నిండి పోయిందని తెలిస్తే మీరు ఏమైపోతారు!

ఇప్పుడు అలాంటి కొన్ని వస్తువుల గురించి తెలుసుకుందాం: 

తలదిండు/ పిల్లో కవర్లు:

 అవునండి మీరు వింటున్నది నిజమే. నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, వారం రోజులకు మించి ఉతకుండా ఉంచిన పిల్లో కవర్ మీద టాయిలెట్ సీట్ మీద ఉన్న బ్యాక్టీరియాతో కంపేర్ చేస్తే 17,000 అధికమైన ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. కాబట్టి, ఎప్పటికప్పుడు పిల్లో కవర్స్ వాష్ చేసుకుని నీటుగా ఉంచుకోవడం ఎంతో ఉత్తమం. 

ఫోన్: 

ఈ వస్తువుని మనం ప్రతిరోజు మన చేతుల్లోనే క్షణం కూడా తీరిక లేకుండా చూస్తూ ఉంటా. అంతేకాకుండా టచ్ స్క్రీన్ మీద టచ్ చేస్తూ వినోదాన్ని ఆస్వాదిస్తాం. కానీ అదే సమయంలో మన చేతులు బ్యాక్టీరియాని ఆస్వాదిస్తున్నాయని మీకు తెలుసా? అవునండి మీరు విన్నది నిజమే, మీ మొబైల్ ఫోన్ మీద టాయిలెట్ సీట్ మీద ఉన్న బ్యాక్టీరియా కంటే పది రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా అనేది ఉంటుందట. కాబట్టి ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్ బ్యాక్టీరియా బారిన పడకుండా ఉండాలంటే ఒక క్లాత్ తీసుకుని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం ఎంతో ఉత్తమం. 

కీబోర్డ్: 

మనం రోజులో కనీసం ఏడు గంటల పాటు వర్క్ చేస్తూ ఉంటాం. ఆ ఏడు గంటలకు మనం లాప్టాప్ ముందు కూర్చుని కీబోర్డ్ మీద పని చేస్తాం కదా, అటువంటి కీబోర్డ్ మీద ఇంచుకి మూడు వేల రకాల బ్యాక్టీరియా చొప్పున ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ అరేజోనా నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఉపయోగించే కీబోర్డ్ మనం ఎప్పుడు బ్రష్ తో క్లీన్ చేసుకోవడం, వ్యాక్యూమ్ క్లీనర్ తో క్లీన్ చేసుకోవడం చేస్తే మంచిది. 

రిమోట్ కంట్రోల్: 

టీవీ చూడాలన్న ఏసీ ఆన్ చేయాలన్న, ఇప్పుడున్న టెక్నాలజీ తో ఏ ఎలక్ట్రానిక్ వస్తువుని ఉపయోగించాలన్న సరే రిమోట్ కంట్రోల్ అవసరం ఎంతైనా ఉంది. మరి అలాంటి రిమోట్ కంట్రోల్ మీద ఇంచుకి 200 రకాల బ్యాక్టీరియాలు ఉన్నట్టు తేలింది. కాబట్టి మనం వాడే ప్రతి రిమోట్ కంట్రోల్ ను కూడా శుభ్రం చేసుకోవడం ఉత్తమం. 

డోర్ హ్యాండిల్స్: 

తలుపు తెరవాలన్నా వెయ్యాలన్న డోర్ హ్యాండిల్స్ వాడటం కామన్. ప్రతి ఒక్కరు ముట్టుకునే హ్యాండిల్స్ మీద ఎన్నో రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి. ముఖ్యంగా పబ్లిక్ టాయిలెట్స్ బాత్రూమ్ డోర్ హ్యాండిల్స్ మీద అత్యధిక బ్యాక్టీరియా ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. కాబట్టి, వాష్ రూమ్ కి వెళ్ళిన ప్రతిసారి మన చేతిని శుభ్రంగా హ్యాండ్ వాష్ తో శుభ్రపరచుకోవడం తప్పనిసరి. 

రిఫ్రిజిరేటర్ డోర్స్: 

మనం కూరగాయలు పెట్టడానికి ఎలాంటి వస్తువులైన ప్రిజర్వ్ చేసుకోవడానికి మనం ఫ్రిడ్జ్ ఎల్లప్పుడూ యూస్ చేస్తూనే ఉంటాం. కాబట్టి మనం ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయడానికి చేతులతో ముట్టుకుంటాం అప్పుడు డోర్ మీద ఉన్న అనేక బ్యాక్టీరియాలో మన చేతికి అంటుకోవడం జరుగుతుంది. ఫ్రిడ్జ్ ని ఎప్పటికప్పుడు తుడుచుకోవడం, కూరగాయని శుభ్రంగా కడిగి ఫ్రిజ్లో పెట్టడం లాంటివి చేయాలి. లేదంటే కూరగాయలకు ఉన్న బ్యాక్టీరియా కూడా ఫ్రిడ్జ్ లోపల ఉండిపోయి అధిక బ్యాక్టీరియాగా మారే అవకాశం కూడా ఉంది.