నొప్పి నివారణకు 7 వంటింటి చిట్కాలు

ఈ రోజుల్లో మోకాళ్లు, కీళ్ల నొప్పులు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. ఒకప్పుడు వయసు పెరిగే కొద్దీ ఈ నొప్పులు వచ్చేవి, కానీ ఇప్పుడు మూడు పదుల వయసులో కూడా ఈ సమస్య వస్తుంది. కూర్చోలేరు, కూర్చుంటే లేవలేరు, కీళ్లనొప్పుల సమస్య ఉన్నవారికి చేతులపై నొప్పులు, భుజాల నొప్పులు, కండరాల నొప్పులు ఉన్నవారికి ఇప్పుడు చెప్పుకోబోయే చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. మన వంటింట్లోనే దొరికే ఈ చిట్కాలతో అన్ని రకాల నొప్పులనూ నయం చేయవచ్చు. అది ఎలాగో […]

Share:

ఈ రోజుల్లో మోకాళ్లు, కీళ్ల నొప్పులు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. ఒకప్పుడు వయసు పెరిగే కొద్దీ ఈ నొప్పులు వచ్చేవి, కానీ ఇప్పుడు మూడు పదుల వయసులో కూడా ఈ సమస్య వస్తుంది. కూర్చోలేరు, కూర్చుంటే లేవలేరు, కీళ్లనొప్పుల సమస్య ఉన్నవారికి చేతులపై నొప్పులు, భుజాల నొప్పులు, కండరాల నొప్పులు ఉన్నవారికి ఇప్పుడు చెప్పుకోబోయే చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. మన వంటింట్లోనే దొరికే ఈ చిట్కాలతో అన్ని రకాల నొప్పులనూ నయం చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

లావెండర్‌ ఆయిల్‌

లావెండర్‌ ఆయిల్‌తో మీకు నొప్పి ఉన్న చోట మసాజ్‌ చేస్తే.. నొప్పి నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. లావెండర్‌ ఆయిల్‌లో ఉండే.. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా తిమ్మిరులు త్వరగా తగ్గుతాయి. ఈ ఆయిల్‌తో మసాజ్‌ చేస్తే మీకు మంచి రిజల్ట్స్‌ ఉంటాయి. ఈ నూనె  నొప్పి, సంకోచాలకు మధ్యవర్తిత్వం వహించే ప్రోస్టాగ్లాండిన్‌లను రిలాక్స్‌ చేస్తుంది. లావెండర్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేస్తే మీ కండరాలు రిలాక్స్‌ అవుతాయి. కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి.. ఇలా అన్ని రకాల నొప్పులను తగ్గించడానికి లావెండర్ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది.

ఒరెగానో ఆయిల్:

ఒరెగానో ఆకులు 23 రకాల చెడు బ్యాక్టీరియా అంతు చూస్తాయి. కూరల్లో, ఫ్లైల్లో ఈ ఆకుల్ని కొద్దిగా వేసుకుంటే చాలు… ఇవి పొట్టలోకి వెళ్లి… అక్కడి విష వ్యర్థాలను తరిమేస్తాయి. ఒరెగానో ఆకుల నుంచీ తైలం  కూడా తీస్తున్నారు. దాన్ని కూడా రకరకాల రోగాలు నయం చేసేందుకు వాడుతున్నారు. ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్న చోట, ఈ తైలాన్ని రాస్తే, ఫలితం కనిపిస్తుంది.

అల్లం

అల్లంలో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అర్థరైటిస్‌తో బాధపడేవారు అల్లం తీసుకుంటే, కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు తగ్గిస్తుంది. అల్లం తీసుకుంటే శరీరంలో అధికంగా ఉన్న యూరిక్‌ యాసిడ్ తగ్గుతుంది. అల్లం నూనెను కీళ్లపై మసాజ్‌ చేస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

పసుపు 

ప్రతి ఒక్కరి వంటింట్లోనూ పసుపు ఉంటుంది. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇందులో ఉండే కర్కుమిన్ నేచురల్‌ పెయిన్‌ కిల్లర్‌లా పనిచేస్తుంది. కీళ్ల నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి, ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక చెంచా పసుపు కలిపి తాగితే మంచిది. కీళ్ల వద్ద పసుపు నూనెతో మర్దనా చేసినా చక్కటి ఉపశమనం కలుగుతుంది. 

పిప్పర్‌మింట్‌ ఆయిల్‌

పిప్పర్‌మింట్‌ ఆయిల్‌ మనం ఎక్కువగా తలనొప్పి, జలుబు, కండరాల నొప్పులను తగ్గించడానికి ఉపయోగిస్తుంటాం. పిప్పర్‌మింట్‌ ఆయిల్‌తో మీకు నొప్పి ఉన్న చోట మసాజ్‌ చేస్తే..  నొప్పి త్వరితగతిన తగ్గుతుంది. ప్రతిరోజు ఈ ఆయిల్‌తో కనుక మసాజ్ చేస్తే మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీరు పిప్పర్‌మింట్‌ ఆయిల్‌ వాసన చూస్తే కొన్ని సమస్యల నుంచి బయటపడొచ్చు. 

టార్ట్ చెర్రీ

ఫైటోన్యూట్రియెంట్స్, ఆర్గానిక్ యాసిడ్స్, కెరోటినాయిడ్స్ కలిగిన పవర్‌హౌస్‌ ఇది. చెర్రీస్‌లో అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్, పొటాషియం, విటమిన్ సి మరియు మెలటోనిన్ ఉన్నాయి. చెర్రీస్ తీసుకోవడం నొప్పిని నియంత్రించడంలో సహాయపడుతుంది. తలనొప్పి, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందుతుంది. రాత్రి బాగా నిద్రపోవడానికి దీని రసాన్ని కూడా తీసుకుంటారు.

కారవే విత్తనాలు

జీర్ణక్రియను మెరుగుపరచడంలో కారవే గింజలు సహాయపడతాయి.  అజీర్ణం, ఉబ్బరం వలన  కలిగే నొప్పిని తగ్గిస్తుంది.  ఈ విత్తనాలతో తయారు చేసిన టీ ని తాగితే నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.