Yoga For Eyes: కళ్లపై ఒత్తిడిని తగ్గించే యోగాసనాలు ఇవే..

ఈ జాగ్రత్తలు ముఖ్యం..!

Courtesy: Twitter

Share:

Yoga For Eyes: సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అంటే అన్ని ఇంద్రియాల్లో కెల్లా కళ్లు చాలా ముఖ్యమైనవి అని అర్థం. కళ్లు లేకపోతే అడుగు కూడా ముందుకు వేయలేం. ప్రకృతిని ఆస్వాదించలేం. అయితే ప్రస్తుత సాంకేతిక యుగంలో కంటి సమస్యల రిస్క్ పెరుగుతోంది. కాలుష్యానికి తోడు డిజిటల్ స్క్రీన్‌పై ఎక్కువ సమయం గడుపుతుండటంతో కళ్లపై ఒత్తిడి(Pressure on the Eyes) పెరుగుతోంది. కంటి అలసటతో చివరికి కంటి చూపుపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో కంటి ఒత్తిడి తగ్గించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రాక్టీస్ చేయాల్సిన యోగాసానాలేంటో(Yoga) చూద్దాం.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కళ్లకు(Eyes) తగినంత విశ్రాంతి(Rest) అవసరం. అప్పుడే అవి ఆరోగ్యంగా ఉంటాయి. అందుకు ప్రతి రోజూ స్క్రీన్(Screen) ముందు గడిపే సమయాన్ని క్రమంగా తగ్గించుకోండి.  డ్యూటీ సమయంలో ఎక్కువ సేపు కూర్చోనే పని చేయాల్సి ఉంటుంది. వర్క్ మీద అదే పనిగా ఫోకస్ చేయడంతో కళ్లు త్వరగా అలసిపోతాయి(get tired). కాబట్టి డ్యూటీలో అప్పుడు బ్రేక్(Break) తీసుకోండి. దీంతో కళ్లు రిలాక్స్(Relax) అవుతాయి. కళ్లపై ఒత్తిడిని(Pressure on the eyes) తగ్గించడానికి చదివేటప్పుడు లేదా పని చేస్తున్నప్పుడు తగినంత లైటింగ్ ఉండేలా చూసుకోండి. 4. 20-20-20 రూల్‌తో కళ్లపై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. కంప్యూటర్లపై పనిచేసేవారు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, 20 మీటర్ల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్లపాటు చూడటమే ఈ రూల్(Rule). దీంతో కళ్లకు విశ్రాంతి దొరుకుతుంది.

యోగాసనాలు

కంటి ఒత్తిడిని(Eye Pressure) తగ్గించుకోవాలన్నా, దృష్టి మెరుగుపర్చుకోవాలన్నా, యోగాను(Yoga) దినచర్యలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడి(Pressure), అలసట నుంచి కళ్లను రక్షించడంలో కొన్ని రకాల యోగా ఆసాలు కీలకపాత్ర (Key role) పోషిస్తాయి. దీర్ఘకాలంలో మెరుగైన కంటి ఆరోగ్యాన్ని అందిస్తాయి. అందుకు ప్రాక్టీస్(Practice) చేయాల్సిన యోగా ఆసనాలు(Yoga Asanas) చూద్దాం.

తడాససం (Tadasasam) (నిటారుగా నిలబడటం)

నేలపై నిటారుగా నిలబడాలి. అదే సమయంలో భుజాలను ముందుకు చాచి, అరచేతులు రెండు లోపలివైపుకు అభిముఖంగా ఉండేలా చూసుకోవాలి. మోకాళ్ళు, తొడలు, పిరుదులు, ఉదర భాగంలోని కండరాలను కొద్దిగా బిగుతుగా ఉండేలా చూసుకుని, స్థిర విన్యాసస స్థితిలో(Fixed orientation) ఉండాలి. ముక్కు ద్వారా గాలి పీల్చుకోవాలి. అలాగే భుజాలను పైకి లేపి చేతులను కలపాలి. అదే సమయంలో కలిపిన అరచేతులు ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. కొద్ది సమయం అలాగే ఉన్న తరువాత మెళ్ళగా గాలి వదులుతూ పూర్వ స్థితికి రావాలి. తరువాత కాళ్ళను దూరం చేస్తూ విశ్రాంతి(Rest) తీసుకోవాలి.

పాదహస్తాసనం(Padahastasana) (నిలబడి ముందుకు వంగడం)

సమస్థితిలో నిలబడి ఊపిరి పీల్చుకోవాలి. భుజాలు, మెడను రిలాక్స్‌గా(Realx) ఉంచి, తలను ముందుకు వచ్చాలి. అరచేతులను పాదాలకు ఇరువైపులా ఉంచాలి. తలను వచ్చినప్పుడు నెమ్మదిగా మోకాళ్ళను నిటారుగా ఉంచాలి. ఛాతీని తొడలకు తాకేలా ప్రయత్నించాలి. ఇలా కొద్దిసేపు ప్రాక్టీస్(Practice) చేయాలి.

శీర్షాసనం (Sirsasana) (తల కిందికి కాళ్లు పైకి)

 రెండు చేతులపై బరువు మోపి తలను నేలకు ఆనించాలి. రెండు కాళ్లను కలిపి మెల్లగా నిటారుగా పైకి లేపాలి. పిక్కలు, తొడలు, నడుము, వీపు నిటారుగా ఉండేటట్లు చూసుకోవాలి. బరువు తలమీద తక్కువగాను, చేతుల మీద ఎక్కువగాను మోపాలి. ఇలా కొద్దిసేపు ఉన్న తరువాత నెమ్మదిగా తిరిగి యథా స్థితికి రావాలి. ఈ ఆసనం తర్వాత తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి.

హలాసనం(Halasana) (నాగలి భంగిమ)

మొదట వెల్లకిలా పడుకోవాలి. చేతులను నేలపై ఉంచాలి. ఆ తరువాత రెండు కాళ్లను మెల్లగా నిటారుగా లేపి, తలవైపు తీసుకొచ్చి నేలపై ఆనించాలి. ఆసనంలో ఉన్నంతసేపూ శ్వాసను బయటనే ఆపాలి. పొట్టను లోపలికి బిగపడితే ఈ ఆసనం సులువుగా వేయవచ్చు. ఆ ఆసనం నాగలి మాదిరి ఉంటుంది. ఈ భంగిమలో 15 నుంచి 20 సెకన్ల వరకు ఉండవచ్చు. ఈ యోగాసనాలను రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తే కంటి సమస్యలు తగ్గుతాయి. కంటిపై ఒత్తిడి తగ్గి, చూపు సామర్థ్యం పెరుగుతుంది.

చక్రాసనం(Chakrasana) (చక్రాల భంగిమ)

మీ వెనుకభాగంలో పడుకుని, మీ చేతులను మీ తలపై ఉంచి, మీ శరీరాన్ని ఒక వంపులోకి ఎత్తండి, మీ అవయవాల మధ్య బరువును సమానంగా పంపిణీ చేయండి. 15 నుండి 20 సెకన్ల వరకు పట్టుకోండి.

ధనురాసనం(Sagittarius) (విల్లు భంగిమ)

మీ పొట్టపై పడుకుని, చేతులు మరియు కాళ్లను వీలైనంత పైకి ఎత్తండి. 15 నుండి 20 సెకన్ల వరకు పట్టుకోండి.

కంటి ఒత్తిడిని తగ్గించడానికి మరియు భంగిమను మెరుగుపరచడానికి మీ డెస్క్ వద్ద కుర్చీ యోగాను ప్రాక్టీస్ చేయండి. తడసనా, సమకోనసనా మరియు ఉత్కటాసనా వంటి సాధారణ భంగిమలను మీ కార్యస్థలంలో చేయవచ్చు. మీరు ఇంటి నుండి పని చేస్తున్నా లేదా కార్యాలయంలో పని చేస్తున్నా, మొత్తం శ్రేయస్సు మరియు ఉత్పాదకత కోసం మీ కళ్ళను సాగదీయడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి ప్రతి గంటకు కొన్ని నిమిషాలు కేటాయించండి.


గ‌మ‌నిక‌: ఇది కేవ‌లం అవ‌గాహ‌న కోసం అందించిన స‌మాచారం మాత్ర‌మే. ఆరోగ్యం, ఆహారానికి సంబంధించిన నిర్ణ‌యాలు తీసుకునే ముందు వైద్యుల‌ను సంప్ర‌దించ‌డం ఉత్త‌మం.