ఇవి మీ శరీర బరువును పెంచేస్తాయి జాగ్రత్త

మనకి తెలియకుండానే మన రోజు వారి ఆహార పదార్థాల వల్ల మన శరీర బరువు అనేది పెరుగుతుందట. మనకి ఆరోగ్యాన్ని కలిగించే కొన్ని ఆహార పదార్థాలు కూడా మనలోని బరువుని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయట. మరి అలాంటి కొన్ని ఆహార పదార్థాలను ఈరోజు తెలుసుకుందామా..  పళ్ళ రసాలు:  చాలామంది ప్రతిరోజూ వారు తీసుకునే ఆహారంతోపాటు పళ్ళ రసాలు కూడా వారి జీవన శైలిలో ఒక భాగంగా చేసుకుంటారు. కాకపోతే మన ఇంట్లో చేసుకునే స్వచ్ఛమైన పలరసాలతో […]

Share:

మనకి తెలియకుండానే మన రోజు వారి ఆహార పదార్థాల వల్ల మన శరీర బరువు అనేది పెరుగుతుందట. మనకి ఆరోగ్యాన్ని కలిగించే కొన్ని ఆహార పదార్థాలు కూడా మనలోని బరువుని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయట. మరి అలాంటి కొన్ని ఆహార పదార్థాలను ఈరోజు తెలుసుకుందామా.. 

పళ్ళ రసాలు: 

చాలామంది ప్రతిరోజూ వారు తీసుకునే ఆహారంతోపాటు పళ్ళ రసాలు కూడా వారి జీవన శైలిలో ఒక భాగంగా చేసుకుంటారు. కాకపోతే మన ఇంట్లో చేసుకునే స్వచ్ఛమైన పలరసాలతో కంపేర్ చేసుకుంటే బయట నుంచి మనం తెచ్చుకుని పళ్ళ రసాలలో ఎక్కువ శాతం పంచదార కంటెంట్ ఉండడం వల్ల మన శరీరంలో అనవసరమైన క్యాలరీస్ ఎక్కువ అవుతున్నాయి. అంతేకాకుండా ప్రిజర్వ్ చేసిన పళ్ళ రసాలలో ఎక్కువగా ఫైబర్ అనేది ఉండదు. దానికి కారణంగా మనం తక్కువ మోతాదులో బయటి నుంచి తెచ్చుకున్న పలరసం తాగినప్పటికీ, అందులో ఎక్కువగా బరువును పెంచే క్యాలరీలు అధికంగా ఉంటాయి. 

డ్రై ఫ్రూట్స్: 

మనకి తెలిసిన విషయం ఏంటంటే డ్రైఫ్రూట్స్ ఎండ్ అవ్వాలా మనిషి ఆరోగ్యంగా ఉంటారు కదా. కానీ 

డ్రై ఫ్రూట్స్ తయారీ విధానంలో, అందులో ఉండే న్యాచురల్ షుగర్స్ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ అవుతుంది దానికి ఫలితంగా క్యాలరీ మోతాదు ఎక్కువగా అవుతుంది. అయితే డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా మంది ఉదయం సాయంత్రం పూట తమ డైట్లో తీసుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అదే విధంగా మనకి, బరువుని పెంచడంలో కూడా ముందంజలో ఉంటుంది అని నిపుణులు సూచిస్తున్నారు. 

నట్ బటర్: 

చిన్నపిల్లలతో మొదలుకొని పెద్దవారు వరకు నట్ బటర్ అంటే ఇష్టపడనవారు అంటూ ఎవరూ ఉండరు. కానీ నిజానికి నెట్ బటర్ చాలా రుచికరంగా ఆరోగ్యంగా ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. అదేవిధంగా తమ బ్రేక్ ఫాస్ట్ లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వీటి తయారీ విషయంలో చాలా కంపెనీలు ఇందులో ఆయిల్స్, షుగర్, అదే విధంగా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అనేవి ఎక్కువగా ఉపయోగించడం వల్ల, క్యాలరీల మోతాది ఎక్కువగా ఉంటుంది, దీనికి ఫలితంగా మనం బటర్ యూస్ చేసిన ప్రతిసారి మన శరీరంలోకి అధిక క్యాలరీలు అందిస్తున్నామని అర్థం చేసుకోవచ్చు. 

స్మూతీ: 

చాలామంది స్మూతీ చాలా ఇష్టంగా తాగుతూ ఉంటారు. ముఖ్యంగా ఆకలిగా ఉన్నప్పుడు ఈ స్మూతీ ఒకటి తాగితే చాలు మన ఆకలి వెంటనే తీరుతుంది. కానీ స్మూతీలలో ఉపయోగించే ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ మన శరీరానికి అధిక బరువుని అందించడంలో అస్సలు వెనకాడదు. స్మూతీలు నిజానికి ఫ్రూట్ జ్యూస్, పెరుగు, అధిక షుగర్ మోతాదితో కూడిన ఒక బెస్ట్ డ్రింక్. కానీ ఇది రుచితో పాటు మనకి బరువుని అధికంగా పెంచుతుంది. 

సలాడ్ డ్రెస్సింగ్: 

భోజనానికి తర్వాత చాలామంది, సలాడ్ తినడం ఒక అలవాటుగా పెట్టుకుంటారు. మన బరువు తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాకపోతే సలాడ్ డ్రెస్సింగ్ విషయంలో మనం ఉపయోగించే కొన్ని పదార్థాలు అధిక బరువును కలిగించే కారకాలు. ఇందులో ఉపయోగించే ఆలివ్ ఆయిల్, వెనిగర్, మసాలా దినుసులు లాంటివి మనం ఇంట్లోనే ఉపయోగించుకుంటే మంచిది. అలా కాకుండా బయట మార్కెట్లో దొరికే డ్రెస్సింగ్ ప్యాకెట్స్ అనేవి ఉపయోగిస్తే అవి మన క్యాలరీలు అధికం చేసే కారకాలు కావచ్చు. 

వీట్ బ్రెడ్: 

చాలామంది వీట్ బ్రెడ్ తినడం అనేది ఒక ఆరోగ్యకరమైన విషయం గా పరిగణిస్తూ ఉంటారు. అయితే ఈ బ్రెడ్ లో కార్బోహైడ్రేట్స్ మరియు క్యాలరీలు కూడా అధికంగానే ఉంటాయి. చాలా మంది తాము తినే స్నాక్స్ టైంలో అధికంగా బ్రెడ్ తినడం ఒక అలవాటుగా పెట్టుకున్నట్లయితే తప్పకుండా వారికి ప్రోటీన్స్ న్యూట్రియన్స్ తో పాటుగా, వెయిట్ కూడా అధికంగా అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం వీట్ బ్రెడ్ తయారీ విషయంలో ఎక్కువ కాలం నిలవ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ యూస్ చేస్తున్నారు. వాటిల్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, ఆడిట్ షుగర్ వంటివి ఉంటున్నాయి. ఇవి శరీర బరువుని ఇన్బాలన్స్ చేస్తాయి.