జీర్ణశక్తిని పెంపొందించే యోగా ఆస‌నాలు

చాలామంది జీర్ణ సమస్యలతో ఎంతో బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో డిప్రెషన్, అలసట ఇలాంటివి ఎన్నో మొదలయ్యాయి. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి ఇప్పుడు ఆరు రకాల యోగ ఆసనాలు ఎలా ప్రయోజనకరంగా మారుతున్నాయో చూద్దాం.  యోగా చేయడం కారణంగా మన శరీరానికి ఎన్నో బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అధ్యయనాలు ప్రకారం ఎన్నో రకాల శరీర సంబంధిత వ్యాధులను దూరం చేసింది యోగ. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మన శరీరం అనేది మన మెదడు […]

Share:

చాలామంది జీర్ణ సమస్యలతో ఎంతో బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో డిప్రెషన్, అలసట ఇలాంటివి ఎన్నో మొదలయ్యాయి. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి ఇప్పుడు ఆరు రకాల యోగ ఆసనాలు ఎలా ప్రయోజనకరంగా మారుతున్నాయో చూద్దాం. 

యోగా చేయడం కారణంగా మన శరీరానికి ఎన్నో బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అధ్యయనాలు ప్రకారం ఎన్నో రకాల శరీర సంబంధిత వ్యాధులను దూరం చేసింది యోగ. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మన శరీరం అనేది మన మెదడు ప్రశాంతతకు కనెక్ట్ అయి ఉంటుంది. మన మైండ్ ప్రశాంతంగా ఉంటేనే మన శరీరంలో ఆరోగ్యం మరింత పెంపొందించుకునే వాళ్ళం అవుతాము. మనం ఎక్కువగా వ్యాయామం చెయ్యలేము హెల్త్ కేర్ గురించి అంత సమయం వ్యతించలేము అనే వారి కోసం ఈరోజు కొన్ని యోగ ఆసనాలు గురించి తెలుసుకుందాం. ఇవి మన రోజు దినచర్యలో ఒక అరగంట చేయడం ప్రారంభిస్తే మన శరీరంలో మనం చక్కని మార్పు మనం చూడొచ్చు. ముఖ్యంగా జీర్ణశక్తి పెంపొందించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడతాయి. 

సమయానికి తినకపోవడం ప్రస్తుత జీవన శైలిలో ఒక భాగంగా మారిపోయింది. దీని కారణంగా చాలామంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తో బాధపడుతున్నారు. అంతేకాకుండా జీర్ణశక్తి బలహీనతతో బాధపడుతున్నారు. నిజానికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఒక్కసారి వచ్చిందంటే దానికి తగ్గించుకోవడానికి మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా డయాబెటిస్ వంటి వ్యాధులకు ఏమి తక్కువ ఏమి కాదు. జీర్ణశక్తి బలహీనంగా ఉండడం కారణంగా మనలోని హెల్త్ ఇష్యూస్ కూడా మొదలవుతాయి డిప్రెషన్, నరాల బలహీనత, చిరాకు ఇలాంటివి ఎన్నో తలెత్తుతాయి. డాక్టర్ రాజీవ్ రాజేష్, చీఫ్ యోగ ఆఫీసర్ జిందాల్ ఇన్స్టిట్యూట్లో యోగ ఎటువంటి ప్రభావం మన శరీరం మీద చూపిస్తుంది అనే దాని గురించి చాలా చక్కగా చెప్పారు. 

జీర్ణ సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలను తరచుగా ప్రజలలో చూస్తూనే ఉంటాము. కానీ జీర్ణ సమస్యలు అనేవి మన శరీరం మీద చాలా ప్రభావితం చేస్తాయి, ముఖ్యంగా ఎక్కువగా అలసటగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. బ్రీతింగ్ ఎక్ససైజ్, మెడిటేషన్ అనేవి యోగాలో ముఖ్యమైన భాగం. యోగ చేయడం వల్ల స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. మన జీర్ణ సమస్య తగ్గి మనం తీసుకునే ఆహారంలోని పోషకాలు మన శరీరానికి పట్టేలా చేస్తాయి. మన పొత్తి కడుపులో చక్కగా బ్లడ్ సర్కులేషన్ సక్రమంగా జరగడానికి యోగ బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇటువంటి యోగ ఆసనాలు వేయడం ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి మన శరీరంలో బాగా పెరుగుతాయి. ప్రతి ఒక్కసారి రా అవయవాలలో బ్లడ్ సర్కులేషన్ అన్నది చాలా బాగా జరిగి మనం మరింత యవ్వనంగా అదే విధంగా ఉత్సాహంగా కనిపించడానికి తోహదపడతాయి. 

ఇప్పుడు ఐదు యోగ ఆసనాల గురించి తెలుసుకుందాం: 

భుజంగాసనం: 

భుజంగాసనం వెయ్యడం కారణంగా మన జీర్ణశక్తి మరింత మెరుగుపడుతుంది. అంతే కాకుండా కండరాల్లో శక్తి పెంపొందించుకుంటుంది. 

పవనముక్తాసన: 

ఈ ఆసనం వల్ల పొత్తికడుపులోని కండరాలు బలపడతాయి. గ్యాస్టిక్ సమస్యలు తగ్గుతాయి. అంతే కాకుండా జీర్ణశక్తి మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 

ధనురాసనం: 

ఇది కండరాలు బలపడడానికి ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా, మన శరీరంలో ప్రతి అవయవం యొక్క శక్తి మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా జీర్ణశక్తి మెరుగు పడుతుంది. 

అర్థ మత్స్యంద్రాసన: 

ఈ ఆసనం గమ్మత్తుగా ఉంటుంది. కాస్త వెనక్కి తిరిగి కూర్చున్నట్లు ఈ ఆసనం కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల మన కండరాళ్ళకి మసాజ్ అయినట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా మన శరీరంలో రక్తప్రసరణ ఈజీగా జరిగేలా ప్రోత్సహిస్తుంది. 

పశ్చిముత్తానాసనం: 

ఇది ముఖ్యం గా పొత్తి కడుపు కండరాల బలానికి ఎంతో ఉపయోగపడుతుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. 

సూర్య నమస్కారం: 

ఉదయాన్నే ఈ సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల, మన శరీరంలో ఉండే ప్రతి ఒక్క అవయవం ఉత్తేజ పడుతుంది. ముఖ్యంగా మనం వివరంగా కనిపించడానికి ఇది సహాయపడుతుంది. జీర్ణశక్తి పెంపొందించడానికి దోహదపడుతుంది.