ఆయిలీ చర్మం వారు వర్షాకాలంలో తీసుకోవాల్సిన టిప్స్

రాబోయే వర్షాకాల ఇబ్బందుల గురించి బాధపడుతున్నారా? మీ చర్మ సౌందర్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారా? ముఖ్యంగా ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఈ టిప్స్ చాలా బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా మొటిమలు రాకుండా ఉండటానికి ఆరు రకాల టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. వాతావరణం మార్పు వల్ల మన చర్మం లో ఎన్నో రకాల మార్పులను మనం గమనించొచ్చు. ముఖ్యంగా ఆయిలీ స్కిన్ ఉన్నవారు వర్షాకాలంలో ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. చెప్పుకోవాలంటే మొటిమలు రావటం, బ్లాక్ […]

Share:

రాబోయే వర్షాకాల ఇబ్బందుల గురించి బాధపడుతున్నారా? మీ చర్మ సౌందర్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారా? ముఖ్యంగా ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఈ టిప్స్ చాలా బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా మొటిమలు రాకుండా ఉండటానికి ఆరు రకాల టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది.

వాతావరణం మార్పు వల్ల మన చర్మం లో ఎన్నో రకాల మార్పులను మనం గమనించొచ్చు. ముఖ్యంగా ఆయిలీ స్కిన్ ఉన్నవారు వర్షాకాలంలో ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. చెప్పుకోవాలంటే మొటిమలు రావటం, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇలాంటి అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. మొటిమ కారణంగా మన శరీరం నుంచి ఎక్కువ ఆయిల్ అనేది ఉత్పత్తి జరుగుతుంది. దీనికి కారణంగా మొఖం జిటుగా కనిపించడం, శరీరం అంతా చిరాకుగా అనిపించడం జరుగుతాయి. ముఖ్యంగా ఇలాంటి ఇబ్బందులు జెనెటిక్ పరంగా, హార్మోన్ పరంగా, లేదంటే వాతావరణ ప్రభావంగా వస్తూ ఉంటాయి. అయితే చర్మం ఉత్పత్తి చేసే ఆయిల్ కారణంగా, జిడ్డుగా, చర్మం లో చిరాకు దురద లాంటివి మొదలవుతాయి. 

అంతేకాకుండా మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా షుగర్ అలాగే కార్బోహైడ్రేట్స్ ఉండటం వల్ల కూడా మన చర్మం అనేది జిడ్డుగా మారడానికి కారణం అవచ్చు. అనిల్ ముఖర్జీ స్కిన్ ఎక్స్పోర్ట్ సోషల్ మీడియాలో కొన్ని టిప్స్ అనేది పంచుకున్నారు. ఈ టిప్స్ అనేవి ముఖ్యంగా వర్షాకాలంలో ఆయిల్ స్కిన్ వారి గురించి తెలియజేశారు. మన చర్మం నుంచి జిడ్డుని నివారించేందుకు, మన లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు తెచ్చుకోవడం ద్వారా మన చర్మాన్ని నిగారించుకోవడంతో పాటుగా ఆరోగ్యంగా కూడా మార్చుకోవచ్చు అని అంజలి ముఖర్జీ చెప్తున్నారు. 

ఆరోగ్యకరమైన ఆరు టిప్స్: 

1. మనం తీసుకునే ఆహారంలో నూనె పదార్థాలను తగ్గించాలి. ముఖ్యంగా ఫ్రై చేసినవి అలాగే ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉన్న పదార్థాలను మానేయాలి.ఎక్కువగా బటర్, చీజ్ అలాగే ఎక్కువ ఫ్యాట్ ఉన్న డైరీ ఐటమ్స్, మైదాతో చేసిన బిస్కెట్స్, కేక్, పేస్ట్రీస్, చాక్లెట్స్, జంక్ ఫుడ్ జోలికి వెళ్ళకూడదు. 

2. అలాగే విటమిన్ బి2 డెఫిషియన్సీ కారణంగా కూడా మన స్కిన్ అన్నది ఆయిలిగా మారి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు అంటే పాలకూర లాంటివి, గోధుమల మొలకలు బఠానీ వంటివి తినడం వల్ల మన bodyలో రైబోఫ్లావెన్ ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుంది. అంతేకాకుండా జింక్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల మన స్కిన్ లో ఎక్కువ గ్లో పెరుగుతుంది. అదే విధంగా, మన శరీరం మీద మొటిమలు లాంటివి వచ్చాయంటే అది ఖచ్చితంగా జింక్ డెఫిషియన్సీ కారణంగా కూడా అవుతుంది. 

3. మనం ఎప్పుడూ కూడా ఎక్కువగా వాటర్ తాగడానికి ఇష్టపడాలి. మన bodyని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి దాని కారణంగా మన స్కిన్ అనేది హెల్తీగా మారుతుంది. రోజుకి కనీసం 8 నుంచి 10 గ్లాసుల గ్లాసుల వాటర్ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. 

4. ఇంక మేకప్ విషయానికి వస్తే, ముఖ్యంగా నిద్రపోయే ముందు మనం మేకప్ పూర్తిగా తీసేయాలి. నిద్రపోయేటప్పుడు కూడా మేకప్ ఉంచుకోవడం కారణంగా బ్యాక్టీరియా అనేది మన స్కిన్ మీద ఏర్పడుతుంది. అంతేకాకుండా, మన చర్మం పైన ఉండే కొన్ని రంధ్రాలను మేకప్ కప్పి వేస్తుంది, కాబట్టి ఆక్సిజన్ సరఫరా అనేది చర్మానికి సరిగ్గా జరగదు. దానివల్ల ఉదయానికి మన చర్మం ముడతలు పడిపోయినట్లు కనిపిస్తుంది. అందుకనే మనం ఎప్పుడైనా నిద్రపోయేటప్పుడు మేకప్ తీసి నిద్రపోవాలని గుర్తుంచుకోండి. 

5. లైట్ గా మాయిశ్చరైసర్ అప్లై చేయడం వల్ల అదే విధంగా ఒక గ్లాస్ వాటర్ తాగి నిద్ర పోవడం వల్ల ఉదయానికి మన చర్మానిగారింపు పెరుగుతుంది. 

6. ప్రతి వారం మన చర్మానికి ఏదో ఒక ప్యాక్ వేసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా మడ్ ప్యాక్ వేసుకోవడం ద్వారా ఆయిల్స్కిన్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. 

7. ఆయిల్ స్కిన్ ఉన్నవారు, లావెండర్ వాటర్ చర్మం మీద స్ప్రే చేసుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల ఆ చర్మని నిగారింపు పెరుగుతుంది. చర్మం ఉత్తేజంగా కనిపిస్తుంది. 

8. మన body వెయిట్ మెయింటైన్ చేయడం కూడా మన స్కిన్ ఆరోగ్య విషయంలో ఒక భాగం. మన bodyలో చేరిన ఫ్యాట్ కారణంగా మన చర్మం నుంచి ఆయిల్ ఉత్పత్తి అనేది జరగే అవకాశం ఉంది. 

9. జిడ్డుగా ఉండే చర్మంతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోకపోవడం మంచిది. ఎక్కువ ఫాట్ ఉన్న పదార్థాలు తినడం వల్ల, చర్మం జిడ్డుగా మారే అవకాశం ఉంది.