హాయిగా నిద్ర పోవాలంటే ఇవి తినండి

చాలామంది నిద్ర పట్టక తీగ ఇబ్బందులకు గురవుతున్నారు. రోజంతా ఉరుకులు పరుగుల జీవితంలో ఒత్తిడి కారణంగా చాలామందికి రాత్రిపూట ఎనిమిది గంటల సరే న నిద్ర లేకపోవడం గమనార్హం. ప్రతి ఒక్కరికి సుమారు రోజుకి 8 గంటల నిద్ర కచ్చితంగా ఉండాలి. ఇప్పుడున్న ఉరుకులు పరుగులలో చాలామంది ఒత్తిడి కారణంగా ఇన్సోమినియా కి గురవుతున్నారు. అంటే, ఒత్తిడి కి గురై నిద్ర పట్టకపోవడం. ఇన్సోమ్నియా అంటే ఏమిటి: చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఎనిమిది గంటలు నిద్రలేక, ఎన్నో […]

Share:

చాలామంది నిద్ర పట్టక తీగ ఇబ్బందులకు గురవుతున్నారు. రోజంతా ఉరుకులు పరుగుల జీవితంలో ఒత్తిడి కారణంగా చాలామందికి రాత్రిపూట ఎనిమిది గంటల సరే న నిద్ర లేకపోవడం గమనార్హం. ప్రతి ఒక్కరికి సుమారు రోజుకి 8 గంటల నిద్ర కచ్చితంగా ఉండాలి.

ఇప్పుడున్న ఉరుకులు పరుగులలో చాలామంది ఒత్తిడి కారణంగా ఇన్సోమినియా కి గురవుతున్నారు. అంటే, ఒత్తిడి కి గురై నిద్ర పట్టకపోవడం.

ఇన్సోమ్నియా అంటే ఏమిటి:

చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఎనిమిది గంటలు నిద్రలేక, ఎన్నో అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. నిద్ర లేకపోవడం వల్ల అనేక రోగాలు వస్తాయి. ముఖ్యంగా గుండె సంబంధిత రోగాలు నిద్రలేమి కారణంగా వస్తాయి. చాలామంది చేసిన అధ్యయనాల ప్రకారం ఇన్సోమ్నియా అనేది ఒక సీరియస్ హెల్త్ ఇష్యూ. ఆరోగ్యకరమైన శరీరం చాలా త్వరగా నిద్రలోకి జారుకుంటుంది. కానీ ఒత్తిడి కారణంగా చాలామందికి త్వరగా నిద్ర పట్టట్లేదు. దీన్నే ఇన్సోమ్నియా అని అంటారు.

ఈ వ్యాధికి గురైన వారు సుమారు వారంలో మూడు సార్లు నిద్రపోకుండా గడుపుతారు. నెలలో కనీసం రెండు వారాలు నిద్రపోరు. ఎక్కువగా ఒత్తిడికి గురైన వారిలో ఇటువంటి అనారోగ్య సమస్య తలెత్తుతుంది. ప్రశాంతంగా ఉండటమే దీనికి ఉత్తమం.

కాకపోతే ఒత్తిడి తగ్గించి నిద్ర బాగా పట్టాలంటే కొన్ని ఆహార పదార్థాలను సజెస్ట్ చేస్తున్నారు న్యూరాలజిస్ట్ లోవ్నీత్ బాత్ర.

నిద్ర పట్టేందుకు తినాల్సిన పదార్థాలు:

మెగ్నీషియం, కాల్షియం, జింక్, విటమిన్ బి వంటివి ఎక్కువగా నిద్ర పట్టేందుకు సహాయపడే ఖనిజాలు అని చెప్పొచ్చు. ఇలాంటి ఖనిజాలు ఉన్న ఆహార పదార్థాలు మనం రోజు తీసుకుంటే, మనలో తప్పకుండా ఎంతో మార్పు గమనించొచ్చు. నిద్ర హాయిగా పడుతుంది.

వేడి పాలు:

నిద్రపోయే ముందు గోరువెచ్చని వేడి పాలు తాగడం ఎంతో ఉత్తమం. ముఖ్యంగా వేడి పాలలో ఉండే ట్రైటుఫాన్, మెలోటోనిన్ వంటి పదార్థాలు నిద్ర హాయిగా పట్టడానికి సహాయపడతాయి. కాబట్టి నిద్రపోయే ముందు గోరువెచ్చని వేడి పాలు తాగి నిద్ర పోతే చాలా బాగుంటుంది.

బార్లీ గ్రాస్ పౌడర్:

అవును మీరు విన్నది నిజమే. బార్లీ గ్రాస్ చక్కగా పౌడర్ పట్టి మనం తాగే పానీయాల్లో కలుపుకుని తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది అట. బార్లీ గ్రాస్ లో క్యాల్షియం, జింకు, పొటాషియం, మెగ్నీషియం వంటి పదార్థాలు ఉండడం వల్ల అవి మన శరీరంలో ఒత్తిడిని తగ్గించి నిద్రను అందిస్తాయి.

అరటి పళ్ళు:

తక్కువ ఖరీదులో దొరికే అరటి పళ్ళు మన రోజు వారి ఆహారంలో చేర్చుకుంటే, డబ్బుతో పాటు, మన ఆరోగ్యము మన చేతిలో ఉంటాయి. అరటిపల్లెలో ఉండే విటమిన్ b6, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు మంచి నిద్రకు కారకాలు. కాబట్టి మనం రోజు రాత్రి పడుకునే ముందు అరటిపండు తింటే, మత్తు నిద్ర పట్టడం ఖాయం.

 సబ్జా గింజలు:

మీకు ఈ సబ్జా గింజల గురించి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా సమ్మర్ సీజన్లో మనం తాగే వాటిలో తినే వాటిలో సబ్జా గింజలు ఉపయోగిస్తూనే ఉన్నాము. ఈ సబ్జా గింజలలో శరీరంలోని వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అంతేకాదు రాత్రి పడుకునే ముందు మనం తీసుకునే ఆహారంలో గాని తాగే పానీయంలో గాని సబ్జా గింజలు వేసుకుంటే, అందులో ఉండే అమినో ఆసిడ్ మనకు చక్కని నిద్రను అందించడంలో సహాయపడుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఆహార పదార్థాలను మీరు తినే పదార్థాలలో చేర్చండి. ఇంకా హాయి నిద్ర మీ సొంతం అవ్వక తప్పదు.