ర‌క్త ప్ర‌స‌ర‌ణ బాగా జ‌ర‌గాలంటే ఇవి తినండి

శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి బ్లడ్ సర్కులేషన్ ఈజీగా జరగాలి అనుకుంటే తప్పకుండా మనం క్రమ పద్ధతిలో ఈ ఆహార పదార్థాలను తీసుకోవాలి. నిజానికి మన శరీరంలో ఎటువంటి పని చేయాలన్నా బ్లడ్ సర్కులేషన్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. బ్లడ్ సర్కులేషన్ ఫ్రీగా జరిగితేనే మన బాడీలో ప్రతి పార్టీకి ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది. బ్లడ్ సర్కులేషన్ క్రమంగా ఫ్రీగా జరిగితే, బాడీలో ప్రతి పార్ట్ ఆరోగ్యంగా ఉంటుంది. మన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. నిపుణులు […]

Share:

శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి బ్లడ్ సర్కులేషన్ ఈజీగా జరగాలి అనుకుంటే తప్పకుండా మనం క్రమ పద్ధతిలో ఈ ఆహార పదార్థాలను తీసుకోవాలి.

నిజానికి మన శరీరంలో ఎటువంటి పని చేయాలన్నా బ్లడ్ సర్కులేషన్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. బ్లడ్ సర్కులేషన్ ఫ్రీగా జరిగితేనే మన బాడీలో ప్రతి పార్టీకి ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది. బ్లడ్ సర్కులేషన్ క్రమంగా ఫ్రీగా జరిగితే, బాడీలో ప్రతి పార్ట్ ఆరోగ్యంగా ఉంటుంది. మన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. నిపుణులు కొన్ని ఆహార పదార్థాలను సూచిస్తున్నారు.  ఈ ఆహార పదార్థాలు మనం రోజు గనుక తీసుకుంటే మన body లోని బ్లడ్ సర్కులేషన్ చాలా బాగా జరుగుతుంది.

దానిమ్మ పండు:

నిపుణులు సూచిస్తున్న ఆహార పదార్థాలలో దానిమ్మ పండు ఒకటి. ముఖ్యంగా దానిమ్మ పండులోని పాలిఫినాల్ ఆంటీ ఆక్సిడెంట్ మరియు నైట్రేట్స్ ఖనిజాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. దానిమ్మ పండు గింజలను తీసుకోవడం, దానిమ్మ పండు జ్యూస్ తాగడం, లేదంటే దానిమ్మ పండు కి సంబంధించిన సప్లిమెంట్ పదార్థాలు తీసుకోవడం కారణంగా మన body లో బ్లడ్ సర్కులేషన్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది.

బీట్రూట్:

ఎన్నో కాయగూరలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాంటి కూరగాయలలో ఒకటి బీట్రూట్. మన శరీరంలో రక్తప్రసరణ అనేది క్రమ పద్ధతిలో జరగాలి అంటే తప్పకుండా బీట్రూట్ తినాలి. వారంలో కనీసం బీట్రూట్ రెండు సార్లు తింటే, శరీరంలో బ్లడ్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఇందులో ఉన్న ఐరన్ నైట్ రేట్స్, ఆక్సిజన్ లెవెల్స్ పెరగడానికి సహాయపడతాయి. ఫలితంగా రక్త ప్రసరణ అనేది చాలా ఫ్రీగా జరుగుతుంది. నీరసం ఎలాంటివి ఉన్నా సరే, వెంటనే నీరసం పోయి, ఉత్తేజంగా మారిపోతాము.

పాలకూర:

ముఖ్యంగా ఆకుకూరలు తినడం మన రోటిన్ లో ఒక భాగంగా చేస్తారు. బ్లడ్ తక్కువ ఉన్నవారు ఎక్కువగా ఆకుకూరలు తినడం వల్ల అందులో ఉన్న ఐరన్, బ్లడ్ ఎప్పుందించడానికి సహాయపడుతుంది. ఆకుకూరల్లో ముఖ్యంగా పాలకూర లో నైట్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ పాలకూర తినడం వల్ల అందులో ఉండే పోషకాలు రక్త ప్రసరణ జరిగేందుకు తోడ్పడతాయి.

వెల్లుల్లిపాయ:

వెల్లుల్లిపాయలో సల్ఫర్ అనేది ఉంటుంది. అందులో ఉండే అలసిన్ కాంపౌండ్, మన శరీరంలోని రక్తప్రసరణ జరిగే నరాలను విశాలంగా ఉండేలా చేస్తుంది. ఈ క్రమంలోనే, ప్రతి ఒక్క శరీర అవయవానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ముఖ్యంగా వెల్లుల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి. ఆంటీ ఆక్సిడెంట్ అనేవి గుండె సంబంధించిన ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటుంది. అందుకే వెల్లుల్లి తినడం కారణంగా గుండెకు సంబంధించిన వ్యాధులు దూరం అవుతాయి. అంతేకాకుండా రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది.

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్కలో కూడా యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి ఎక్కువ ఒత్తిడి అనేది కలగదు, దీని కారణంగా బ్లడ్ వెజిల్స్ డామేజ్ అనేది తగ్గుతుంది. ఈ క్రమంలోనే బ్లడ్ సర్కులేషన్ చాలా ఫ్రీగా జరుగుతుంది. అందుకే ఆహారంలో దాల్చిన చెక్క తినడం వల్ల, ఎక్కువ ఒత్తిడికి గురవకుండా ఉంటాము. అంతేకాకుండా, కొత్త అధ్యయనం ద్వారా చెక్క తినడం వల్ల యవ్వనంగా ఉంటామని తేలింది.

అందుకే ఏ సందర్భంలో ఉన్న ఎంత వర్క్ లో ఉన్నా సరే ఆహారాన్ని మాత్రం స్కిప్ చేయకూడదు. రోజుకి ఎనిమిది గ్లాసులు వాటర్ తాగాలి. ఈ రెండు క్రమం తప్పకుండా చేస్తే, శరీరంలో రక్తహీనత కూడా తగ్గుతుంది. ఎటువంటి అనారోగ్యం మన దరి చేరదు.