మెట్లు ఎక్కడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికీ గుండె ఆరోగ్యం క్షీణిస్తోంది. ఒకప్పుడు గుండె జబ్బులు అంటే ఏ 50 సంవత్సరాల తర్వాతో లేక 60 సంవత్సరాల తర్వాతో అటాక్ చేసేవి. కానీ ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ఎవరికి పడితే వారికి గుండె జబ్బులు వస్తున్నాయి. చేస్తున్న పని చేస్తుండగానే గుండె జబ్బులతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. అందుకోసమే అందరూ గుండె ఆరోగ్యం మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. గుండె అనేది మన శరీరంలో ఎంతో ముఖ్యమైన పార్ట్. మన […]

Share:

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికీ గుండె ఆరోగ్యం క్షీణిస్తోంది. ఒకప్పుడు గుండె జబ్బులు అంటే ఏ 50 సంవత్సరాల తర్వాతో లేక 60 సంవత్సరాల తర్వాతో అటాక్ చేసేవి. కానీ ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ఎవరికి పడితే వారికి గుండె జబ్బులు వస్తున్నాయి. చేస్తున్న పని చేస్తుండగానే గుండె జబ్బులతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. అందుకోసమే అందరూ గుండె ఆరోగ్యం మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. గుండె అనేది మన శరీరంలో ఎంతో ముఖ్యమైన పార్ట్. మన శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉండి.. గుండె ఆరోగ్యంగా లేకపోయినా కానీ మనకు చాలా సమస్యలు వస్తాయి. మన శరీరానికి ప్రసరణ అయ్యే రక్తం మొత్తం గుండె నుంచే పంప్ చేయబడుతుంది. అటువంటి గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం నేటి రోజుల్లో అనేక మంది అనేక రకాల వ్యాయామాలు చేస్తున్నారు. చాలా మంది చాలా రూపాయలు ఖర్చు చేసి గుండె ఆరోగ్యం మెరుగు చేసుకోవడం కోసం వ్యాయామాలు చేస్తున్నారు. 

కానీ సింపుల్ మరియు చవకగా ఉండే వ్యాయామం చేసి గుండె ఆరోగ్యాన్ని మనం మెరుగు పర్చుకోవచ్చు. అదే స్టెయిర్స్ (మెట్లు) ఎక్కడం. నేటి రోజుల్లో మనలో చాలా మంది లిఫ్ట్ వాడుతున్నారు. ఒక్క ఫ్లోర్ వెళ్లాలన్నా సరే స్టెయిర్స్ వాడకుండా లిఫ్ట్ ను వాడుతున్నారు. ఇలా లిఫ్ట్ వాడడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మన గుండె ఆరోగ్యంగా ఉండడం కోసం స్టెయిర్స్ వాడాలని చాలా మంది ఆరోగ్య నిపుణులు చెబుతారు. కానీ మనలో చాలా మంది ఆ మాటలను పెడచెవిన పెడుతుంటారు. 

కొంత మంది అయితే మరీ దారుణంగా ఫస్ట్ ఫ్లోర్ పోవాలన్నా సరే లిఫ్ట్ ను వాడతారు. అసలు స్టెయిర్స్ అనే ఒక విషయం ఉందనే విషయాన్నే మర్చిపోయినట్లు వ్యవహరిస్తుంటారు. దీని వలన అనేక గుండె సమస్యలు వస్తాయి. సింపుల్ గా స్టెయిర్స్ ఎక్కి… గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునే సువర్ణావకాశాన్ని వీరు మిస్ చేసుకుంటూ ఉంటారు. మీరు చిన్న పనికి కూడా లిఫ్ట్ వాడకుండా స్టెయిర్స్ ను వాడడం వలన మీ గుండెకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో కింద ఉంది. 

కార్డియో వాస్కులర్ ఫిట్ నెస్ మెరుగుపరుస్తుంది… 

మనం చిన్న పనికి కూడా లిఫ్ట్ వాడకుండా స్టెయిర్స్ వాడడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. దీని వలన మన కార్డియో వాస్కులర్ ఫిట్ నెస్ అనేది మెరుగుపడుతుంది. స్టెయిర్స్ ఎక్కడం అనేది హృదయనాళానికి సంబంధించిన వ్యాయామం. ఇది కాళ్లు మరియు కోర్తో సహా బహుళ కండరాల సమూహాలను యాక్టివేట్ చేస్తుంది. రెగ్యులర్ గా స్టెయిర్స్ ఎక్కడం మీ హృదయ స్పందన రేటును పెంచుతుంది. అంతే కాకుండా మెరుగైన హృదయ ఫిట్‌ నెస్‌ ను ప్రోత్సహిస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని మీకు దూరం చేస్తుంది. 

క్యాలరీల బర్నింగ్

ప్రస్తుత రోజుల్లో అనేక మందిని పట్టి పీడిస్తున్న సమస్య క్యాలరీ బర్నింగ్. మనం తిన్న ఆహారాన్ని ఖర్చు చేయడం ఎలాగో తెలియక చాలా మంది అవస్థలు పడుతున్నారు. క్యాలరీ బర్నింగ్ ఇష్యూ అనేది సర్వ సాధారణం అయిపోయింది. కానీ మీరు స్టెయిర్స్ ఎక్కడం వలన మీ క్యాలరీలు అనేవి ఈజీగా బర్న్ అయిపోతాయి. అంతే కాకుండా మీ వెయిట్ మెయింటెనెన్స్ లో కూడా సహాయపడుతుంది. అలాగే గుండె సమస్యలకు ప్రధాన కారణమైన ఊబకాయం ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన బరువును మెయింటేన్ చేయడం అనేది గుండె ఆరోగ్యానికి చాలా కీలకం.

బెటర్ బ్లడ్ ప్రెజర్

బ్లడ్ ప్రెజర్ అనేది చాలా ముఖ్యం. మన రక్త నాళాలు కనుక సరిగ్గా పని చేయకపోతే మనకు అనేక సమస్యలు వస్తాయి. స్టెయిర్స్ ఎక్కడం వల్ల మీ బాడీ అంతటా మెరుగైన రక్త ప్రసరణ జరుగుతుంది. మీరు ఎక్కేటప్పుడు, మీ గుండె మరింత రక్తాన్ని పంప్ చేస్తుంది. మీరు మెట్లు ఎక్కే సమయంలో మీకు ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. కావున మీ గుండె ఎక్కువ రక్తాన్ని పంప్ చేస్తుంది. అంతే కాకుండా మీ కండరాలు మరియు అవయవాలకు ఆక్సిజన్ మరియు పోషకాలను కూడా పంపిణీ చేస్తుంది. ఈ మెరుగైన ప్రసరణ రక్తం గడ్డకట్టడం, అథెరోస్క్లెరోసిస్ మరియు రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేస్తుంది… 

ప్రస్తుత రోజుల్లో చాలా మంది కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరగడం వలన అది రక్తనాళాలలో అడ్డంకిగా మారుతుంది. కొలెస్ట్రాల్ ను మన వ్యవహారిక భాషలో కొవ్వుగా వ్యవహరిస్తారు. ఈ కొవ్వు వలన అనేక సమస్యలు వస్తాయి. కొవ్వు పడితే దాన్ని తగ్గించుకోవడం చాలా కష్టం. అందుకోసమే కొవ్వు అనేది రాకుండా చూసుకుంటారు. కానీ నేడు మనం తినే ఆహారం వలన చాలా ఈజీగా కొవ్వు అనేది మన శరీరంలో ఫామ్ అవుతోంది. 

స్టెయిర్స్ ఎక్కడం వంటి శారీరక శ్రమను కనుక మీరు చేసినట్లయితే మీ శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. తద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ లో కూడా రెండు రకాలు ఉంటాయి. ఇందులో మంచి కొలెస్ట్రాల్ మరియు చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ వలన అంతగా సమస్య అనేది లేకపోయినా కానీ చెడు కొలెస్ట్రాల్ వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మరీ ముఖ్యంగా గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకోసమే కొలెస్ట్రాల్ ను సరిగ్గా మెయింటేన్ చేసుకోవడం చాలా అవసరం. అందుకోసమే అనేక మంది కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం కోసం అనేక వ్యాయామాలు చేస్తుంటారు. డబ్బులు ఖర్చు పెట్టి అనేక వ్యాయామాలు చేసే బదులు ఎటువంటి ఖర్చు లేకుండా వచ్చే స్టెయిర్స్ ఎక్కడం వంటి వ్యాయామం చేయడం వలన చాలా ప్రయోజనకరగంగా ఉంటుంది.