మీకు థైరాయిడ్ ఉందా??

ప్రస్తుత రోజుల్లో ఓవర్ వెయిట్ అనేది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. ఈ సమస్యకు సొల్యూషన్ కోసం అనేక మంది అనేక విధాలుగా ప్రయత్నాలు చేసినా కానీ చాలా మందికి ఎక్కువగా ఫలితం కనిపించడం లేదు. దీంతో చేసేదేం లేక చాలా మంది ఓవర్ వెయిట్ తో సమస్యలు పడుతూనే జీవనం గడుపుతున్నారు. ఓవర్ వెయిట్ వల్ల వచ్చే సమస్యలు అధికంగా ఉంటున్నాయని పలువురు నిపుణులు చెబుతున్నారు.  థైరాయిడ్ కు బాటలు.. ఇలా ఓవర్ వెయిట్ కావడం […]

Share:

ప్రస్తుత రోజుల్లో ఓవర్ వెయిట్ అనేది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. ఈ సమస్యకు సొల్యూషన్ కోసం అనేక మంది అనేక విధాలుగా ప్రయత్నాలు చేసినా కానీ చాలా మందికి ఎక్కువగా ఫలితం కనిపించడం లేదు. దీంతో చేసేదేం లేక చాలా మంది ఓవర్ వెయిట్ తో సమస్యలు పడుతూనే జీవనం గడుపుతున్నారు. ఓవర్ వెయిట్ వల్ల వచ్చే సమస్యలు అధికంగా ఉంటున్నాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. 

థైరాయిడ్ కు బాటలు..

ఇలా ఓవర్ వెయిట్ కావడం వల్ల థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సిటీ లైఫ్ స్టైల్ కు అలవాటు పడిన చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. థైరాయిడ్ సమస్య అనేది ఎన్నో రోజుల నుంచి ఉన్నా కానీ ఈ మధ్య కాలంలో మరీ విపరీతంగా వస్తోంది. థైరాయిడ్ వస్తే ఇక అంతే సంగతులు అని చాలా మంది హెచ్చరిస్తున్నారు. మనకు నచ్చింది ఇష్టపూర్తిగా తినేందుకు మనస్ఫూర్తిగా దేనినీ ఆస్వాదించేందుకు వీలుండకుండా పోతుంది. ఇన్ని భయాలు పెట్టుకున్నా కానీ థైరాయడ్ సమస్య మాత్రం ఆగడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిలో ఈ సమస్య ఉంది. ఈ సమస్య పరిష్కరించుకునేందుకు ఎంత మంది ఎన్ని విధాలుగా ట్రై చేసినా కానీ పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. దీంతో అనేక మంది నిరాశకు గురవుతున్నారు. ఇలా ఆరోగ్య సమస్యతో కొంత మంది బాధపడుతుంటే వారి సమస్యను క్యాచ్ చేసుకుందామని కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారు. థైరాయిడ్ కోసం మందులంటూ మార్కెట్లోకి అనేక రకాల మందులను ప్రవేశపెడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మందులను వాడిన చాలా మందికి ఎటువంటి ఫలితాలు రాలేదని పైగా సైడ్ ఎఫెక్ట్స్ రూపంలో ఇబ్బందులు పడుతున్నట్లు తెలియజేశారు. అయినా కానీ ఈ మందుల వాడకం ఆగడం లేదు. ఈ మందుల సరఫరా కూడా అంతుచిక్కడం లేదు. 

ఇలా బరువు తగ్గండి…

వెయిట్ తగ్గించుకోవడం ఎలా అని ప్రస్తుత రోజుల్లో చాలా మంది రీసెర్చులు చేస్తున్నారు. వెయిట్ లాస్ అయ్యేందుకు అనేక మందిని ఆశ్రయిస్తున్నారు. అంతే కాకుండా అనేక రకాల మందులను కూడా వాడుతున్నారు. కానీ ఇవేమీ వాడకుండానే వెయిట్ లాస్ కావొచ్చు.. మన లైఫ్ స్టైల్ ను మార్చుకుంటే మనం వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఎటువంటి వ్యాయామాలు చేయకుండా, ఎటువంటి మందులు వాడకుండా, వాటితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇబ్బందులు పడకుండా ఉంటూ లైఫ్ స్టైల్ ను మార్చుకోవడం వల్ల వెయిట్ లాస్ కావొచ్చు. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు ప్రతి ఒక్కరూ బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలా ప్రయత్నాలు చేయడం షరామామూలుగా జరుగుతుంటుంది. కానీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వారు అంత ఈజీగా వెయిట్ లాస్ అవరు. వారి శరీరంలోని కొవ్వును కరిగించుకునేందుకు వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అవి అంతగా ఫలించవు. థైరాయిడ్ తో బాధపడే వారు వెయిట్ లాస్ అయ్యేందుకు ఈ చిట్కాలు ఉత్తమంగా పని చేస్తాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓ సారి లుక్కేస్తే.. 

మన బాడీని బట్టి మీల్ ప్లానింగ్

ఒక్కొక్కరి శరీర నిర్మాణం ఒక్కోలా ఉంటుంది. అందుకోసం అందరికీ ఒకే రకమైన మీల్ ప్లాన్ అనేది సరిపోదు. అందుకోసమే మన బాడీ టైప్ ను బట్టి మనం మీల్ ప్లాన్ చేసుకోవాలి. ఇష్టం వచ్చిన విధంగా ప్లాన్ చేసుకోవడం వలన మనం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మన బాడీకి ఎటువంటి మీల్ ప్లాన్ సరిపోతుందో తెలుసుకునేందుకు మీ వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. వైద్యుడి సలహా మేరకు కాకుండా మన ఇష్టం వచ్చిన విధంగా డైట్ తీసుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఇలా సరైన ప్లాన్ ప్రకారం మీల్స్ తీసుకోవడం వలన మన ఓవర్ వెయిట్ ను మనం తగ్గే అవకాశం ఉంటుంది. 

వ్యాయామాలను సరైన పద్ధతిలో ప్లాన్ చేసుకోండి.. 

మనం ఓవర్ వెయిట్ ఉన్నాం కదా అని చెప్పి ఇష్టం వచ్చిన రీతిలో వ్యాయామాలు చేస్తామంటే కుదరదు. మన బాడీ ఎంత వెయిట్ ఉన్నా కానీ వ్యాయామం అనేది ప్లానింగ్ ప్రకారమే చేయాలి. అందుకోసం ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలి. అలా కాకుండా ఇష్టం వచ్చిన విధంగా వ్యాయామాలు చేస్తామంటే కుదరదు. వ్యాయామాల్లో ఏరోబిక్ వ్యాయామాలు మొదలైన వివిధ రకాల వ్యాయామాలు ఉండేలా చూసుకోవడం అవసరం. 

ట్రాక్ చేస్తూ అడ్జస్ట్ చేసుకోండి… 

మీరు ఏం చేస్తున్నారు.. ఎటువంటి రిజల్ట్స్ వస్తున్నాయని ట్రాక్ చేయడం చాలా అవసరం. మనం ఏదో చేస్తూ పోతూ మన బాడీ రియాక్షన్స్ పట్టించుకోకపోవడం మంచిది కాదు. అందుకోసమే మనం ఏం చేస్తున్నామనే విషయంలో జాగ్రత్త అవసరం. ట్రాకింగ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ట్రాకింగ్ లేకుండా చేయడం మంచిది కాదు. ఏ పని చేసినా ట్రాకింగ్ చేయడం ఇంపార్టెంట్. ఇంకా ఈ విషయంలో అయితే ట్రాకింగ్ అనేది మరింత ముఖ్యం. అంతే కాకుండా మన బాడీ మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా కూడా మనం మేనేజ్ చేసుకోవాలి. ఒకేసారి బరువు తగ్గాలని మనం ఎక్కువ వ్యాయామాలు (మన శరీరం మీద ఒత్తిడి పడేలా) చేయడం మంచిది కాదు. మనం ఏం చేసినా కానీ మన శరీరం మీద ఒత్తిడి అనేది పడకుండా చూసుకోవాలి.