తిన్న తర్వాత ఇలా అస్సలు చేయకండి

ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా కానీ మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టే మనం ఏం తీసుకుంటున్నామో ఎటువంటి పనులు చేస్తున్నామో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక మీకు ఇప్పటికే అనారోగ్య సమస్యలు ఉంటే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏమవుతుందిలే అని లైట్ తీసుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకోసమే మీరు ఏం చేసినా ప్రతీది మానిటర్ చేస్తూ ఉండాలి. మీరు భోజనంలో ఏమి […]

Share:

ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా కానీ మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టే మనం ఏం తీసుకుంటున్నామో ఎటువంటి పనులు చేస్తున్నామో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక మీకు ఇప్పటికే అనారోగ్య సమస్యలు ఉంటే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏమవుతుందిలే అని లైట్ తీసుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకోసమే మీరు ఏం చేసినా ప్రతీది మానిటర్ చేస్తూ ఉండాలి. మీరు భోజనంలో ఏమి తింటున్నారో ఎంత ముఖ్యమో.. దాని తర్వాత ఏమి చేస్తారో కూడా అంతే ముఖ్యం. మీరు మీ భోజనం తర్వాత ఏం చేస్తారనే విషయాలను పరిశీలించి.. ఆ అలవాట్లు మీకు మీ ఆరోగ్యానికి అంతగా సెట్ కాకపోతే వాటిని మానేయడమే చాలా మంచిది. ఇలా చేయడం వలన మీరు ప్రమాదాలకు దూరంగా ఉండొచ్చు. ఎవరికైతే జీర్ణక్రియ ప్రక్రియకు కొన్ని అలవాట్లు ఆటంకం కలిగిస్తాయో వాటిని వదులుకోవడమే ఉత్తమం. అలా కాకుండా అవే అలవాట్లను కంటిన్యూ చేస్తే మాత్రం రిజల్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది. చాలా మంది వ్యక్తులు పగటి సమయంలో తమ ప్రొడక్టివిటీని పెంచుకునేందుకు ఎక్కువ మక్కువ చూపుతారు. అందుకోసమే రాత్రి పూటే ఎక్కువ మంది నిద్రిస్తారు. అయితే కొంత మంది మాత్రం రాత్రి పూట నిద్ర తక్కువ అయితే దానిని భర్తీ చేసేందుకు మధ్యాహ్నం నిద్రిస్తుంటారు. ఇక కొంత మంది ఉదయం పూట అల్పాహారం లాగించి ఆ తర్వాత జిమ్‌ కి వెళ్తుంటారు. మనకు న్యాప్స్ (కునుకులు) వస్తే అవి జీర్ణక్రియకు ఆటంకం కలిగించే అవకాశం ఉంటుంది. ఇవి జీర్ణ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. అంతే కాకుండా కఠినమైన శారీరక శ్రమ అనేది పోషకాల శోషణను (అబ్జార్బింగ్) ప్రభావితం చేస్తుంది. 

నిపుణులు ఏం చెబుతున్నారంటే…. 

భోజనం తర్వాత కొన్ని రకాల పనులను చేయకూడని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. వీరి మాటలను మనం ఫాలో కాకపోతే పెద్ద ప్రమాదాన్ని కొని తెచ్చుకోవాల్సిన ప్రమాదం ఉంటుంది. అందుకోసమే వీరు చెప్పేవి మనం పట్టించుకోవాలి. భోజనం తర్వాత మీ రక్తంలో చెక్కెరలను సమతుల్యం చేయడానికి మరియు జీర్ణక్రియను సులభతరం చేయడానికి కొంత సమయం పాటు నడవాలని చాలా మంది ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒక అధ్యయనం ప్రకారం.. 30 నిమిషాల పోస్ట్‌ ప్రాండియల్ బ్రిస్క్ వాకింగ్ సెషన్ భోజనం తర్వాత గ్లైసెమిక్ ప్రతిస్పందనను మెరుగుపరుస్తుంది కాబట్టే భోజనం చేసిన తర్వాత నడక అనేది చాలా మంచిది. అంతే కాకుండా భోజనం తర్వాత మీరు చేసే పనులపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మీ జీర్ణక్రియ మరియు మొత్తం శ్రేయస్సును గణనీయంగా ప్రభావితం చేస్తుంది. 

ఇవి మాత్రం చేయకండి… 

భోజనం తర్వాత కొంత మంది వ్యక్తులు వెంటనే ఈ కింది పనులను చేస్తుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని అనేక మంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఓ సారి పరిశీలిస్తే… 

నిద్రపోవడం..

కొంత మంది ఇలా తిన్న వెంటనే అలా నిద్ర పోతూ ఉంటారు. కానీ ఇలా తిన్న వెంటనే నిద్ర పోవడం మంచిది కాదు. అందుకోసమే తిన్న తర్వాత కొద్ది సేపు వాకింగ్ చేసి నిద్రపోవాలని అనేక మంది నిపుణులు సూచిస్తున్నారు. తిన్న వెంటనే మనం నిద్ర పోయినట్లయితే మన జీర్ణక్రియ అనేది తాత్కాలికంగా ఆగిపోతుంది. ఇలా ఆగిపోవడం మనకు మంచిది కాదు. పడుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ మరియు అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. అలా కాకుండా మీరు తిన్న తర్వాత కొద్ది సేపు వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి. 

జిమ్ కు వెళ్తున్నారా.. 

కొంత మంది తిన్న తర్వాతనే వర్కవుట్స్ చేసేందుకు జిమ్ కు వెళ్తుంటారు. ఇలా తినగానే వెంటనే జిమ్ లో వర్కవుట్స్ చేయడం మంచిది కాదు. అందుకోసమే తిన్న తర్వాత జిమ్ కు వెళ్లొద్దని నిపుణులు సూచిస్తున్నారు. భోజనం చేసిన వెంటనే జిమ్‌ కు వెళ్లడం వల్ల జీర్ణక్రియ నుంచి రక్త ప్రవాహాన్ని మళ్లిస్తుంది. ఇది మనలో తక్కువ సామర్థ్యాన్ని కలిగిస్తుంది. హార్డ్ వర్కవుట్స్ చేయాల్సి వస్తే తిన్న తర్వాత కనీసం ఒక గంటైనా వెయిట్ చేయండి. 

టీ కాఫీలు తాగడం

తిన్న తర్వాతనే కొంత మంది టీ కాఫీలు తాగుతుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని అనేక మంది నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇలా చేయడం మానుకోవాలి. టీ, కాఫీలు అనేవి ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తాయి. అంతే కాకుండా ఇవి ఖనిజ అసమతుల్యతకు (ఇన్ బ్యాలెన్స్) దారితీయవచ్చు. మీకు భోజనం తర్వాత ఏదైనా డ్రింక్ కావాలని అనిపిస్తే గోరువెచ్చని నీరు లేదా హెర్బల్ టీని ఎంచుకోండి. వీటిని తాగడం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 

పండ్లు తింటున్నారా?

మరికొంత మంది తిన్న వెంటనే పండ్లను తినేందుకు మొగ్గు చూపుతారు. కానీ ఇలా తిన్న వెంటనే పండ్లను తినకూడదు. అదేంటీ పండ్లు ఆరోగ్యానికి మంచివే కదా అని మీకు అనుమానం కలగడం కామన్. పండ్లు పోషకమైనవే అయినప్పటికీ, భోజనం చేసిన వెంటనే వాటిని తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం మరియు అసౌకర్యం కలుగుతుంది.