వేసవిలో మీ చిన్నారి కోసం 5 సమ్మర్ డ్రింక్స్

వేసవిలో మీ చిన్నారిని హైడ్రేటెడ్‌గా మరియు యాక్టీవ్ గా ఉంచడానికి ఐదు రకాల డ్రింక్స్ ఉన్నాయి.  ఇవి మీ పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి.  వేసవిలో తల్లిదండ్రులుగా మనం సాధారణంగా మన పిల్లల ఆహారం గురించి ఆందోళన చెందుతాము. ఎందుకంటే వేడి వాతావరణం,  డీహైడ్రేషన్, ఆకలి లేకపోవడం, అలసట మరియు అనారోగ్యాలకు కారణమవుతుంది. అంతే కాకుండా, ఇది పిల్లలకు సెలవుల సమయం కాబట్టి, పిల్లలు ఆరు బయట ఆడుకోవడానికి ఎక్కువ సమయం గడుపుతారు. వారిని శక్తి వంతంగా మరియు […]

Share:

వేసవిలో మీ చిన్నారిని హైడ్రేటెడ్‌గా మరియు యాక్టీవ్ గా ఉంచడానికి ఐదు రకాల డ్రింక్స్ ఉన్నాయి.  ఇవి మీ పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి.  వేసవిలో తల్లిదండ్రులుగా మనం సాధారణంగా మన పిల్లల ఆహారం గురించి ఆందోళన చెందుతాము. ఎందుకంటే వేడి వాతావరణం,  డీహైడ్రేషన్, ఆకలి లేకపోవడం, అలసట మరియు అనారోగ్యాలకు కారణమవుతుంది. అంతే కాకుండా, ఇది పిల్లలకు సెలవుల సమయం కాబట్టి, పిల్లలు ఆరు బయట ఆడుకోవడానికి ఎక్కువ సమయం గడుపుతారు. వారిని శక్తి వంతంగా మరియు హైడ్రేటెడ్‌గా ఉంచే పోషకాహారం వారికి అవసరం. అందువల్ల, వారి ఆహారంలో ఈ కాలంలో దొరికే కూరగాయలైన దోసకాయ, క్యారెట్, క్యాలీఫ్లవర్, బ్రోకలీ, లెట్యూస్‌లను, వీటితో పాటు పుచ్చకాయ, కర్బూజా, మామిడి, లిచీస్, ద్రాక్ష మొదలైన పండ్లను చేర్చుకోవడం చాలా ముఖ్యం. ఈ కూరగాయలలో అధిక నీటి శాతం, ఎన్నో పోషక విలువలు ఉంటాయి. అందువల్ల మీ పిల్లలు హైడ్రేటెడ్‌గా ఉంటారు.

మీ చిన్నారి చురుకుగా ఉండేలా మరియు డీహైడ్రేషన్‌కి గురికాకుండా చూసుకోవడానికి, వారికి పోషకాహారం, ప్రోటీన్ ఫుడ్ మరియు డ్రింక్స్ అందించడం చాలా ముఖ్యం. అందువల్ల పిల్లలను హైడ్రేటెడ్‌గా, యాక్టివ్‌గా ఉంచడానికి ఈ 5 రకాల డ్రింక్స్ ఇవ్వడం మంచిదాని నిపుణులు సలహా ఇస్తున్నారు.

కొబ్బరినీళ్లు: ఎండా కాలంలో కొబ్బరినీళ్లు బాగా ఉపయోగ పడతాయి. ఇది త్వరగా హైడ్రేట్ అవుతుంది. సహజ శీతలీకరణం మరియు మీ పిల్లలకు శక్తిని అందించే ఖనిజాలు ఉంటాయి. అదే విధంగా ట్రేస్ ఎలిమెంట్ల సంపదను ఎక్కువగా కలిగి ఉంటుంది. రోజుకు ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల వేసవి కష్టాలను దాదాపుగా దూరం చేసుకోవచ్చు.

సత్తు: సత్తు అనేది కాల్చిన శనగపప్పుతో తయారు చేయబడిన వంటకం. దీంతో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీనికి కొన్ని ఎండుద్రాక్షలు మరియు చక్కెర లేదా బెల్లం కలిపి ఒక గ్లాసు తాగిస్తే, సత్తు మీ చిన్నారికి రోజంతా సరిపోయేంత శక్తిని ఇస్తుంది.

పుచ్చకాయ: ఇది ఒక ప్రసిద్ధ సీజనల్ ఫ్రూట్. ఇందులో నీరు మరియు పోషకాలు అధికంగా ఉంటాయి. వేసవి కాలంలో డ్రింక్స్‌లోని మెనూలో ఇది తప్పనిసరి. పిల్లలకు అల్పాహారంగా లేదా అల్పాహారంలో భాగంగా అందించవచ్చు. పిల్లలు పుచ్చకాయను ఇష్టపడని పక్షంలో పుదీనా ఆకులను కలిపి జ్యూస్‌గా చేసి కలిపి తాగించవచ్చు.

నిమ్మరసం: మీ పిల్లల కోసం ఇది ఒక గొప్ప వేసవి డ్రింక్. ఒక గ్లాసు నిమ్మరసం వారి ఎలక్ట్రోలైట్స్ మరియు నీటిని తిరిగి నింపడంలో సహాయపడుతుంది. మీరు దానిని రుచిగా మార్చడానికి పుదీనా ఆకులు, జీలకర్ర పొడి, కొద్దిగా రాతి ఉప్పు, కొన్ని నానబెట్టిన చియా గింజలు మొదలైన వాటిని జోడించవచ్చు.

మజ్జిగ: ఇది కూడా సులభంగా తయారు చేయగలిగే పానీయం. మీరు దీన్ని కేవలం ఒక కప్పు పెరుగు మరియు నాలుగు కప్పుల నీరు కలిపి తయారు చేసుకోవచ్చు. కావాలంటే మీరు కొత్తిమీర ఆకులు, చిటికెడు ఉప్పు, జీలకర్ర మరియు ఇంగువ వేసి చల్లగా సర్వ్ చేయవచ్చు.

గుర్తుంచుకోండి! ఈ వేసవిలో ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల మీ పిల్లలు బయట వెళ్లకుండా చూసుకోవడం మంచిది.