జుట్టుకు హెయిర్ సీరం వాడటం మంచిదేనా ?హెయిర్ సీరం వాడటానికి ఈ 5 కారణాలు చాలు

హెయిర్ సీరంలో సిలికాన్ ఉంటుంది. ఇది డ్యామేజ్ అయిన జుట్టును బాగుచేయడానికి సహాయపడుతుంది. అయితే.. ఇది కొంతమందికి హాని కలిగిస్తుంది. హెయిర్ సీరం మీ జుట్టుకు మంచిదా కాదా అని చూద్దాం .. హెయిర్ సీరం జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది జుట్టుకు మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది. మీరు హెయిర్ సీరం ఉపయోగించడం ప్రారంభించినప్పుడు మీరు చాలా మార్పులను గమనించవచ్చు. ముఖ్యంగా హెయిర్ సీరం ఉపయోగించి, మీరు మీ జుట్టును ఎండ, గాలి, కాలుష్యం, […]

Share:

హెయిర్ సీరంలో సిలికాన్ ఉంటుంది. ఇది డ్యామేజ్ అయిన జుట్టును బాగుచేయడానికి సహాయపడుతుంది. అయితే.. ఇది కొంతమందికి హాని కలిగిస్తుంది. హెయిర్ సీరం మీ జుట్టుకు మంచిదా కాదా అని చూద్దాం ..

హెయిర్ సీరం జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది జుట్టుకు మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది. మీరు హెయిర్ సీరం ఉపయోగించడం ప్రారంభించినప్పుడు మీరు చాలా మార్పులను గమనించవచ్చు. ముఖ్యంగా హెయిర్ సీరం ఉపయోగించి, మీరు మీ జుట్టును ఎండ, గాలి, కాలుష్యం, చెమటల నుండి రక్షించవచ్చు. హెయిర్ సీరం వల్ల మరొక ప్రయోజనం కూడా ఉంది.. ముఖ్యంగా ఇది మీ జుట్టును హైడ్రేట్‌ చేయడానికి సహాయపడుతుంది. మీ జుట్టు చాలా అందంగా, చిక్కులు లేకుండా, మెరుస్తూ ఉంటుంది.

హెయిర్ సీరం వల్ల మీ జుట్టుకు మీ జుట్టుకు ఈ క్రింది ప్రయోజనాలు కలుగుతాయి:

1. మాయిశ్చరైజింగ్

స్కాల్ప్ సీరంలు నెత్తిమీద హైడ్రేట్ చేయడానికి, పొడిదనాన్ని, దురదను నివారించడంలో సహాయపడతాయి.

2. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయడం

కొన్ని సీరమ్‌లలో బయోటిన్, విటమిన్లు, ఖనిజాల వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి, మీ జుట్టును మెరుగుపరచడంలో సహాయపడతాయి.

3. జుట్టు రాలడాన్ని నివారించడం

కొన్ని స్కాల్ప్ సీరమ్‌లు సెబమ్ ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడతాయి. దీనివల్ల  హెయిర్ ఫోలికల్స్‌ దృఢంగా మారి, జుట్టు రాలడం తగ్గుతుంది.

4. చుండ్రును తగ్గించడం

టీ ట్రీ ఆయిల్ వంటి పదార్ధాలతో కూడిన స్కాల్ప్ సీరంలు దురదతో సహా చుండ్రు యొక్క లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.

5. జుట్టు ఆరోగ్యంగా ఎదిగేలా చేయడం

స్కాల్ప్ సీరంలు జుట్టును పొడవుగా, ఆరోగ్యంగా ఎదిగేలా చేయడానికి సహాయపడతాయి. 

ఎటువంటి సీరంను ఎంచుకోవాలి?

జుట్టు చక్కగా ఉంటే మీ అందం రెట్టింపు అవుతుంది. హెయిర్ సీరం జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. అయితే, మార్కెట్లో అనేక రకాల హెయిర్ సీరంలు అందుబాటులో ఉన్నాయి. కానీ మీరు మీ జుట్టుకు సరిపోయే సీరంను ఎన్నుకోవాలి. మీరు హెయిర్ డ్యామేజ్ సమస్యతో బాధపడుతుంటే, మీరు సరైన హెయిర్ సీరంను ఎంచుకోవాలి.

హెయిర్ సీరంలో ఉల్లిపాయ వంటి పదార్థాలు ఉంటే, అది జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యను బట్టి, హెయిర్ సీరం ఎంచుకోండి. సీరం ఉపయోగించడం వల్ల  జిడ్డుగా అనిపించదు, అంతేకాకుండా హెయిర్ స్టైల్ కూడా దెబ్బతినదు.

హెయిర్ సీరం మీ జుట్టుకు చాలా మంచిది. స్టైలింగ్ సాధనాలను ఉపయోగించే ముందు, హెయిర్ సీరం ఉపయోగించి, ఆ తరువాత స్టైలింగ్ చేయడం వల్ల జుట్టు పాడవకుండా ఉంటుంది. 

హెయిర్ సీరంను ఎలా ఉపయోగించాలి?

స్టెప్ 1:

సీరం అప్లై చేసే ముందు, జుట్టు తడిగా ఉండాలి. కాబట్టి స్నానం చేసిన తర్వాత దాన్ని ఉపయోగించడం మంచిది.

స్టెప్ 2:

మీ జుట్టును సహజమైన తేలికపాటి షాంపూతో కడగాలి. తరువాత కండీషనర్ అప్లై చేయాలి. అప్పుడు మీ జుట్టుకు సీరంను అప్లై చేయాలి. 

స్టెప్ 3:

మీ జుట్టు దాదాపుగా పొడిగా ఉన్నప్పుడు, మీ అరచేతుల్లో రెండు నుండి మూడు చుక్కల హెయిర్ సీరం ఉంచండి. సీరంను వేడి చేయడానికి కొన్ని సెకన్ల పాటు చేతులను రుద్దండి.

స్టెప్ 4:

ఇప్పుడు మీ జుట్టును పాయలుగా విడదీసి, సీరం మీ నెత్తికి తేలికగా, మృదువుగా అప్లై చేయాలి. సీరంని గట్టిగా రుద్దకూడదు, నెమ్మదిగా అప్లై చేయాలి. 

గమనిక:

మీ ముందు, వెనుక వెంట్రుకలకు సీరం అప్లై చేయాలని గుర్తుంచుకోండి.

స్టెప్ 5:

మీరు సీరం అప్లై చేయడం పూర్తయినప్పుడు, కనీసం 10 నిమిషాలు మీ చేతివేళ్లతో నెత్తిమీద మసాజ్ చేయండి.

హెయిర్ సీరం స్కాల్ప్ ఇన్ఫెక్షన్‌ను నయం చేయడమే కాక, తేమగా ఉంచుతుంది. ఇది మీ జుట్టుకు ఒక కవచాన్ని సృష్టిస్తుంది. అన్ని రకాల నష్టాల నుండి జుట్టును కాపాడుతుంది. మరమ్మతులు చేస్తుంది. కాబట్టి.. మీ జుట్టును మెరిపించే హెయిర్ సీరం ఉపయోగించండి. మెరిసే జుట్టును మీ సొంతం చేసుకోండి!