న్యూట్రిషన్ విషయంలోని అపోహ‌లు ఇవే

ఆహార విషయాలలో, పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడంలో ఎవరు వెనకడుగు వేయరు. మరి ఇటువంటి పద్ధతి పాటిస్తున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన కొన్ని నిజాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. నేషనల్ న్యూట్రిషన్ మంత్ వచ్చేసింది, మనం న్యూట్రిషన్ విషయంలో కొన్ని అపోహలు పడుతున్నాం వాటిని ఇప్పుడు క్లారిఫై చేసుకుందాం. న్యూట్రిషన్ విషయంలో జరుగుతున్నది ఏంటి? సెప్టెంబర్ ని నేషనల్ న్యూట్రిషన్ మంత్ అని పిలుచుకుంటారు. మనం ఒకప్పుడు చాలా బాగా న్యూట్రిషన్ మెయింటైన్ చేసేవాళ్లం. కానీ ఇప్పుడు […]

Share:

ఆహార విషయాలలో, పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడంలో ఎవరు వెనకడుగు వేయరు. మరి ఇటువంటి పద్ధతి పాటిస్తున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన కొన్ని నిజాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. నేషనల్ న్యూట్రిషన్ మంత్ వచ్చేసింది, మనం న్యూట్రిషన్ విషయంలో కొన్ని అపోహలు పడుతున్నాం వాటిని ఇప్పుడు క్లారిఫై చేసుకుందాం.

న్యూట్రిషన్ విషయంలో జరుగుతున్నది ఏంటి?

సెప్టెంబర్ ని నేషనల్ న్యూట్రిషన్ మంత్ అని పిలుచుకుంటారు. మనం ఒకప్పుడు చాలా బాగా న్యూట్రిషన్ మెయింటైన్ చేసేవాళ్లం. కానీ ఇప్పుడు రోజులు మారాయి. న్యూట్రిషన్ అనే దాని మీద ఫోకస్ తగ్గింది. ఇంకా కొంతమంది న్యూట్రిషన్ విషయంలో కొన్ని అపోహలు పడుతున్నారు. డాక్టర్ నీతా దేశ్ పాండే వాటి గురించి అన్ని క్లియర్ గా తెలియజేశారు.

ఇంపోర్టెడ్ సూపర్ ఫుడ్ వర్సెస్ లోకల్ లెజెండ్స్

ఎక్కువగా బెర్రీస్, అవకాశం సూపర్ ఫుడ్ అంటాం. కానీ బెర్రీస్ లో కంటే మన జామకాయలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని చాలామందికి తెలియదు. అదేవిధంగా క్వినోవా అనేది సూపర్ ఫుడ్. కానీ అమర్నాథ్ లో దానికంటే ఎక్కువగా ప్రోటీన్ ఐరన్ మెగ్నీషియం ఉంటాయి.

కార్బోహైడ్రేట్స్

2014 సర్వే ప్రకారం ప్రతి ఇండియన్ 64% కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నారు. కానీ మనం తీసుకోవాల్సింది 60 శాతమే. మనం తీసుకునే కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ని 15శాతం వరకు తగ్గిస్తే మనకు డయాబెటిస్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. మన బాడీకి తగ్గట్టు మనం కార్బోహైడ్రేట్ ని తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించాలి. మనం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

ఫ్యాట్

ట్రాన్స్ ఫ్యాట్ వల్ల మన హార్ట్ కి ప్రాబ్లం వస్తుంది, అందుకే వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. శాచ్యురేటెడ్ ప్యాడ్స్ కూడా మోతాదులో తీసుకోవాలి. ఫ్యాట్స్ ని సరైన మోతాదులో తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. అలా కాదని ఎక్కువగా తీసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి.

వెజిటేరియన్ ప్రోటీన్

ఒక కప్ లెంటిల్స్ లో 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రాముల చికెన్ లో 18 గ్రాముల ప్రోటీనే ఉంటుంది. అందుకే లెంటిల్స్ తీసుకుంటే మన బాడీకి చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. చికెన్ తినడం వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. అదే వెజిటేరియన్ ఫుడ్ వల్ల అలా యూరిక్ యాసిడ్ పెరగదు. పనీర్, సోయా చంక్స్ లాంటివి కూడా వెజిటేరియన్ ఫుడ్స్. వీటి వల్ల కూడా మన బాడి హెల్దిగా ఉంటుంది.

మోడ్రన్ లైఫ్ స్టైల్, విటమిన్ ఛాలెంజెస్

మనలో చాలామందికి విటమిన్ డిఫిషియన్సీ వస్తుంది. మిల్లెట్స్ లాంటివి తింటే మన బాడికి కావలసిన విటమిన్స్ అందుతాయి. కానీ మనలో చాలామంది దీని మీద ఫోకస్ చేయట్లేదు. అందుకే విటమిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్కువగా హెల్ది ఫుడ్ తింటే మనకు విటమిన్ డిఫిషియన్సీ రాదు.

హెల్దిగా మారడానికి కొన్ని నియమాలు

మనలో చాలామంది హెల్తి ఫుడ్ తినరు, ఇంకా కొందరైతే టైం కి తినరు. ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇంకా తినేటప్పుడు మన ఫోకస్ అంతా ఫుడ్ మీద పెడితే అది మన వంటికి పడుతుంది. అలాకాకుండా అన్ హెల్తి ఫుడ్ తింటే మీ ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తినాలి. ఇంకా రెగ్యులర్గా వ్యాయామం చేయాలి. సైక్లింగ్ జాగింగ్ లాంటివి కూడా చేయాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ప్రశాంతత మీద కూడా ఫోకస్ చేయాలి. పైన చెప్పిన వాటర్ ని పెట్టి మీద ఫోకస్ చేస్తే మీ ఆరోగ్యం కొన్ని రోజుల్లోనే పూర్తిగా మీ కంట్రోల్లోకి వస్తుంది. అప్పుడు మీరు చాలా హెల్తీగా ఉంటారు.