వర్షాకాలంలో మీ ఆరోగ్యాన్ని పెంచే మూలికలు

వర్షాకాలం వచ్చేసింది. వర్షాకాలం అంటేనే చాలామందికి అనారోగ్యం గుర్తొస్తుంది. ఎక్కువగా చాలా మంది జలుబు దగ్గు జ్వరాలతో బాధపడుతుంటారు. ఎందుకంటే వర్షాకాలంలో వైరస్ బ్యాక్టీరియాలు వంటివి ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. అందుకే వర్షాకాలంలో ప్రజలు చాలా జాగ్రత్తగా కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా, కొన్ని రోగాల నుంచి బయటపడొచ్చు. అంతేకాదు మన ఇంట్లోనే దొరికే కొన్ని మూలికలతో మన ఆరోగ్యం పదిలంగా ఉంచుకోవచ్చు.  మరి అలాంటి మూలికల గురించి ఈరోజు తెలుసుకుందామా..  తులసి:  మనం ప్రతి ఒక్కరం […]

Share:

వర్షాకాలం వచ్చేసింది. వర్షాకాలం అంటేనే చాలామందికి అనారోగ్యం గుర్తొస్తుంది. ఎక్కువగా చాలా మంది జలుబు దగ్గు జ్వరాలతో బాధపడుతుంటారు. ఎందుకంటే వర్షాకాలంలో వైరస్ బ్యాక్టీరియాలు వంటివి ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. అందుకే వర్షాకాలంలో ప్రజలు చాలా జాగ్రత్తగా కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా, కొన్ని రోగాల నుంచి బయటపడొచ్చు. అంతేకాదు మన ఇంట్లోనే దొరికే కొన్ని మూలికలతో మన ఆరోగ్యం పదిలంగా ఉంచుకోవచ్చు. 

మరి అలాంటి మూలికల గురించి ఈరోజు తెలుసుకుందామా.. 

తులసి: 

మనం ప్రతి ఒక్కరం ఇంట్లో పెంచుకునే తులసి మొక్కలో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ తులసి ఆకులు మనం రోజు తీసుకున్నట్లయితే బ్యాక్టీరియాని, వైరస్ ని, ఫంగస్ ని ఇలా ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని ఈ వర్షాకాలంలో కాపాడుతుంది. అంతేకాకుండా మనలోని రోగ నిరోధక శక్తి పెంపొందించడంలో తులసి చాలా బాగా పనిచేస్తుంది. రోజు మనం ఉరుకులు పరుగులతో ఎంతో ఒత్తిడికి గురవుతున్నాం కదా.. ఒత్తిడి నుంచి కూడా మనల్ని దూరం చేసే ఎన్నో మంచి గుణాలు తులసిలో మనకి కనిపిస్తాయి. 

అల్లం: 

అల్లం మన ఇంట్లో దొరికే ఒక పదార్థం కదండీ. అల్లం మన రోజు తినే ఆహారంలో వాడుతూనే ఉంటాము. నిజానికి అల్లం లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎన్నో ఉన్నాయి. ఈ వర్షాకాలంలో క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే గనక, త్రోట్ ఇన్ఫెక్షన్స్ గాని, జ్వరం, దగ్గు, రొంపల నుంచి మనల్ని కాపాడుతుంది. అంతేకాకుండా మనం తాగే టీలో గాని, మనం తినే ఆహారంలో గాని అల్లాన్ని వాడితే, మన జీర్ణశక్తి పెంపొందుతుంది. అంతేకాకుండా, మన శరీరాన్ని వేడి పరుస్తుంది అలాగే మనకి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. 

వెల్లుల్లి: 

వెల్లుల్లి కూడా మన వంటింటి ఆహార పదార్థాల్లో ఒకటి కదండీ. వెల్లుల్లిలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా చాలా వరకు ఆయుర్వేద మందులు తయారీలో కూడా వెల్లుల్లి ఉపయోగిస్తూ ఉంటారు. వెల్లుల్లి మనం రోజు తీసుకునే ఆహారంలో గాని, లేదంటే ఒక వెల్లుల్లి రెబ్బ పూర్తిగా తిన్నా సరే, మనకి ఈ వర్షాకాలంలో ఇన్ఫెక్షన్స్ భార్య నుంచి తప్పిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారికి, వెల్లుల్లి ఒక చక్కని చిట్కా. అంతేకాకుండా మన గుండెకు సంబంధించిన ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది. 

వేప: 

మన పూర్వం నుంచి ప్రతి ఒక్కరూ ఎటువంటి మందు తయారీ కైనా, వేపాకు ఉపయోగించడం మనకి తెలిసిన విషయమే కదా. ఇప్పుడు వర్షాకాలంలో కూడా మనల్ని ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడే మంచి ఆయుర్వేద గుణాలు వేపలో ఉన్నాయి. ముఖ్యంగా, చిన్నపిల్లలకు ఈ వర్షాకాలంలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఉండాలంటే, వేపాకు, పసుపు రెండు మిక్స్ చేసిన మిశ్రమాన్ని స్నానం చేసే నీటిలో కలిపి వారానికి రెండుసార్లు స్నానం చేసినట్లయితే, ఇన్ఫెక్షన్స్ అనేవి చిన్నపిల్లల దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి ఎన్నో రకాల జ్వరాల నుంచి కూడా ఈ వేపాకు తప్పకుండా కాపాడుతుంది. 

అశ్వగంధ: 

అశ్వగంధలో ఎన్నో ప్రయోజనకరమైన శక్తిలు ఉన్నాయి. ఆయుర్వేదంలో అశ్వగంధ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అశ్వగంధ ప్రతి ఒక్కరిలోని ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి, ఇన్ఫెక్షన్స్ భారి నుంచి తప్పించడానికి, ఒత్తిడి నుంచి బయట పడేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.