పోహాతో నోరూరించే ఐదు అల్పాహారాలు ఇలా చేసేయండి సింపుల్‌గా..

పోహా చాలామంది ఇళ్లల్లో ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్‌లలో ఒకటి. ఎందుకంటే ఇది మంచి రుచితో పాటు చాలా పోషకాలను కూడా అందిస్తుంది. అల్పాహారం కోసం రుచికరమైన పోహాను తినడం అంటే చాలామందికి ఇష్టం. ఇది ఫిట్‌గా ఉంచడమే కాకుండా బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్ ఇందులో తగినంత పరిమాణంలో లభిస్తుంది. ఇది శరీరానికి అవసరమైన విటమిన్లను కూడా కలిగి ఉంటుంది. సులభంగా జీర్ణమయ్యే పోహాతో మరికొన్ని రుచికరమైన అల్పాహారాలను కూడా తయారు చేయవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..   […]

Share:

పోహా చాలామంది ఇళ్లల్లో ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్‌లలో ఒకటి. ఎందుకంటే ఇది మంచి రుచితో పాటు చాలా పోషకాలను కూడా అందిస్తుంది. అల్పాహారం కోసం రుచికరమైన పోహాను తినడం అంటే చాలామందికి ఇష్టం. ఇది ఫిట్‌గా ఉంచడమే కాకుండా బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్ ఇందులో తగినంత పరిమాణంలో లభిస్తుంది. ఇది శరీరానికి అవసరమైన విటమిన్లను కూడా కలిగి ఉంటుంది. సులభంగా జీర్ణమయ్యే పోహాతో మరికొన్ని రుచికరమైన అల్పాహారాలను కూడా తయారు చేయవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..  

పోహా ఉప్మా: 

సాధారణమైన ఉప్మాతో పోలిస్తే పోహా ఉప్మాను ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అంటారు. పైగా ఈ పోహా ఉప్మాను చేయడానికి అతి తక్కువ సమయం మాత్రమే పడుతుంది. పోహా ను 5 నిమిషాలు నీటిలో నానబెట్టి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బాండీలో నూనె వేసి, వేడి అయ్యాక అందులో కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటా, అల్లం, పచ్చిమిర్చి అన్ని వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో పోహా వేసి బాగా కలపాలి. ఉప్పు, పసుపుతో పాటు గరం మసాలాను కూడా వేసి వేడివేడిగా సర్వ్ చేయండి. 

కంద పోహా: 

 కంద పోహా కూడా తినడానికి రుచికరంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన రుచికరమైన అల్పాహారం. దీనిని ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు. ఈ పోహా తయారు చేయడానికి ముందుగా ఒక  బాండీలో నూనె వేసి జీలకర్ర , కరివేపాకు, ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కావలసిన మసాలా దినుసులను వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆ తరువాత పాన్లో కడిగి పోహాను తీసి పక్కన పెట్టుకోవాలి. తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి నిమ్మకాయ రసం తో పాటు మరికొన్ని కంద ముక్కలు యాడ్ చేయాలి. 

పోహా కట్లెట్..

పోహా కట్లెట్ తయారు చేసుకోవడానికి బంగాళదుంపలు కావాలి. ముందుగా బంగాళదుంపను ఉడికించి మెత్తగా చిదిమి పక్కన పెట్టుకోవాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కొత్తిమీర, గరం మసాలా పొడి, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని కట్లెట్‌లాగా వత్తుకొని పాన్‌లో వేడివేడి నూనెలో వేసి అటూ ఇటూ తిప్పుకుంటూ గోధుమ రంగులో వచ్చేంతవరకు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే పోహా కట్లెట్ రెడీ. దీనిని పొదీనా చట్నీ లేదా కెచప్‌తో తింటే చాలా బాగుంటుంది.

పోహా ఇడ్లీ: 

పోహా ఇడ్లీ తయారు చేసుకోవడానికి.. మిక్సింగ్ గిన్నెలో బియ్యప్పిండి, కడిగిన పోహా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా పెరుగు వేసి మెత్తని పిండిలా చేసుకోవాలి. చిటికెడు ఉప్పు, బేకింగ్ సోడాతో పాటు తగినన్ని నీళ్లు పోసి కలిపి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో ప్లేట్లకు నూనె రాసి ఈ మిశ్రమాన్ని పెట్టి 15 నిమిషాల పాటు సన్నని ఆవిరి మీద ఉడికించుకోవాలి. అంతే పోహా ఇడ్లీ రెడీ వీటిని చట్నీ లేదా సాంబార్‌తో వేడిగా సర్వ్ చేయండి. 

ఆలూ పోహ: 

ఆలూ పోహా మహారాష్ట్రలో ఎక్కువగా ఇష్టపడే అల్పాహారం. దీనిని తయారు చేసుకోవడానికి ఒక బాండీలో నూనె పోసి కాగాక ఆవాలు, కరివేపాకు, జీలకర్ర ఇంగువ వేసి కొన్ని సెకన్ల పాటు వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బంగళా దుంప ముక్కలను వేసి మెత్తగా 7 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు కడిగిన పోహా వేసి చివరిగా గరం మసాలా పొడి వేసి మరో రెండు నిమిషాల పాటు ఉంచాలి. అంతే ఆలూ పోహా రెడీ.