ఐదు సూత్రాలతో మహిళల్లో అలసట, బలహీనతకు చెక్

రుతుస్రావం స్త్రీ జీవితంలో ఒక సాధారణమైన భాగం. సాధారణంగా పీరియడ్స్ సమయంలో మహిళలు నరకం అనుభవిస్తారు. కడుపునొప్పి, తీవ్ర రక్తస్రావం, తల తిరగడం, తలనొప్పి, వికారం వంటి సమస్యలతో సతమతమవుతుంటారు. ఆ సమయంలో వచ్చే పొత్తికడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వలన మరింత నీరసంగా మారిపోతారు. ఆ సమయంలో స్త్రీలకి పీరియడ్స్ వల్ల అలసట, బలహీనత ఎక్కువగా ఉంటుంది. అలసట, బలహీనత సమస్యకి ప్రీమెన్ స్ట్రువల్ డైస్ఫోరిక్ డిజార్డర్.. ఈ సమస్య పీరియడ్స్ రావడానికి వారం లేదా […]

Share:

రుతుస్రావం స్త్రీ జీవితంలో ఒక సాధారణమైన భాగం. సాధారణంగా పీరియడ్స్ సమయంలో మహిళలు నరకం అనుభవిస్తారు. కడుపునొప్పి, తీవ్ర రక్తస్రావం, తల తిరగడం, తలనొప్పి, వికారం వంటి సమస్యలతో సతమతమవుతుంటారు. ఆ సమయంలో వచ్చే పొత్తికడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వలన మరింత నీరసంగా మారిపోతారు. ఆ సమయంలో స్త్రీలకి పీరియడ్స్ వల్ల అలసట, బలహీనత ఎక్కువగా ఉంటుంది. అలసట, బలహీనత సమస్యకి ప్రీమెన్ స్ట్రువల్ డైస్ఫోరిక్ డిజార్డర్.. ఈ సమస్య పీరియడ్స్ రావడానికి వారం లేదా పది రోజుల్లో ముందు నుంచే మొదలవుతుంది. దీనికి ప్రధాన లక్షణాలు అలసట, బలహీనంగా ఉండటం చిరాకు కోపంగా అనిపించవచ్చు‌. ఈ సమస్యకి ఈ ఐదు సూత్రాలతో చెక్ పెట్టవచ్చు..

బ్యాలెన్స్డ్  డైట్: 

సమతుల ఆహారాన్ని మీ డైట్ లో భాగం చేసుకోవాలి. విటమిన్స్,  మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలతో పాటు ఆ సీజన్లో లభించే అన్ని రకాల ఆహారాలను తీసుకోవాలి. మీ ఆహారంలో ఓట్స్, రెడ్ మీట్, బెర్రీలు తీసుకోవాలి. 

ఐరన్: 

శరీరంలో ఐరన్ లోపం ఉన్నప్పుడు అలసట, బలహీనతగా ఉంటుంది. మీ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంపొందించుకోవడానికి ఐరన్ ఎక్కువగా దోహదపడుతుంది. ఐరన్ లోపాన్ని అధిగమించడానికి ప్రతిరోజు ఒక బీట్రూట్ తింటే శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అదేవిధంగా బచ్చలి కూర, దానిమ్మ పండు, జామ పండు, ఆకుకూరలు తింటే మీ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచడంలో చాలా ప్రభావంతంగా పనిచేస్తాయి.

విటమిన్స్ డెఫిషియన్సీ:

విటమిన్ల లోపం వల్ల కూడా మహిళల్లో బలహీనత, అలసట ఏర్పడుతుంది. రుతుస్రావం సమయంలోనే కాకుండా మిగతా సమయాలలో కూడా కొంతమంది మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటారు. ఇందుకు ప్రధాన కారణం విటమిన్ సి, విటమిన్ బి 12, విటమిన్ డి, కాల్షియం కూడా లోపం కావచ్చు. వీటిని అధిగమించడానికి మీ డైట్ లో సిట్రస్ పండ్లను నిమ్మ, నారింజ, ద్రాక్ష తీసుకుంటే విటమిన్ సి లభిస్తుంది. విటమిన్ బి 12 కోసం గుడ్లు, చేపలు, పాలు, పాల పదార్థాలను తీసుకోవాలి. విటమిన్ డి, కాల్షియం కోసం పాలు, పెరుగు , జున్ను, ఆకుపచ్చ కూరగాయలను మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. 

వ్యాయామం, కంటి నిండా నిద్ర:

ప్రతిరోజు మహిళలు కంటి నిండా నిద్రపోవాలి. ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు నిద్రపోవాలి. లేదంటే అలసట, బలహీనత వస్తుంది. అలాగే వ్యాయామం కూడా చేయాలి. వ్యాయామం చేయడం వలన మీ శరీరానికి కావాల్సిన రక్త ప్రసరణ జరుగుతుంది. అదేవిధంగా రోజుకి 6 నుంచి 8 గ్లాసుల నీళ్ళు తాగాలి. 

కెఫిన్: 

డార్క్ చాక్లెట్, కాఫీ వంటి వాటిలో లభించే కెఫిన్ తక్షణ శక్తిని అందించిన కూడా.. అది మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కెఫిన్ పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటే మంచిది. రాత్రి భోజనం తర్వాత కెఫిన్ పదార్థాలకు దూరంగా ఉండాలి.